పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు.అనంతరం ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,కె. ఆర్ నాగరాజు,వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరిష్,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి,ఎన్డిపిసిఎల్ సి యండి వరుణ్ రెడ్డి,ఎన్సిసి గ్రూప్ కమాండర్ కర్నల్ సచిన్ అన్నారావు,.
కర్నల్ రవి,వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్,అదనపు డిసిపిలు సురేష్ కుమార్, ప్రభాకర్ రావు శ్రీనివాస్, బాలస్వామి,రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి శ్రీనివాస్ రావుతో పాటు ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐలు,ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు ‘శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది,అమరవీరుల కుటుంబ సభ్యులు మౌనం పాటించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు
పాటుపడాలన్నారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారన్నారు. వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే ఉంటామని చెప్పారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో శాసన సభ్యులు,పోలీసులు,అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం
సభ్యులు పాల్గొన్నారు.
