మెట్ పల్లి అక్టోబర్ 21 నేటి దాత్రి
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జువ్వాడి కృష్ణారావు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్పల్లి నియోజకవర్గం లో మక్కల కొనుగోలు కేంద్రము ప్రారంభం జరిగాయని వాటిని రైతులు కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేసి లబ్ధి పొందాలని దళారులను నమ్మవద్దని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నాలకు మద్దతు ధర 500 కోట్లు మంజూరు చేస్తుందని దానిని మంత్రివర్యులు ప్రకటించారని రైతులు సన్నధాన్యాలు పండించి బోనస్ 500 రూపాయలు లబ్ది పొందాలని అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పై అవాక్కు చివాకులు మాట్లాడుతున్నారని హైదరాబాదులో ఉండి ఉదయం వచ్చి చెక్కులు ఇచ్చి మళ్లీ హైదరాబాద్ పోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం మండలాధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
