రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ…

రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ

రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం-వెలిచాల తిర్మల్ రావు

గంగాధర, నేటిధాత్రి:

 

తమ రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు పేర్కోన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలిచాల తిరుమలరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను బిఆర్ఎస్ నాయకులు భూతద్దంలో పెట్టి చూపిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని దుయ్యబెట్టారు. నాటి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోసపడ్డ పట్టించుకున్న నాధుడే లేడని, క్వింటాలకు ఆరు కిలోల వరకు కట్ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని మర్చిపోలేదని గుర్తు చేశారు. కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని, ఇరవై ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నారాయణపూర్ నిర్వాసితుల ఎదురుచూపుకు తెరదించుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇరవై మూడున్నర కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ పై పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరు చేశారని గుర్తు చేశారు. అబద్దాలతో కాలం గడుపుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మాజీ ఎంపిపి రాజగోపాల్ రెడ్డి, పడితపల్లి కిషన్, మాజీ వైస్ ఎంపిపి కర్ర బాపురెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు, బూరుగు గంగన్న, రేండ్ల రాజిరెడ్డి, రోమాల రమేష్, వంగల శ్రీనివాస్, ముద్దం నగేష్, కనకట్ల తిరుపతి, దోమకొండ మహేష్, జితేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో పంటల కొనుగోళ్లపై విస్తృత సమీక్ష…

సంగారెడ్డి జిల్లాలో పంటల కొనుగోళ్లపై విస్తృత సమీక్ష – కలెక్టర్ ప్రావీణ్య సూచనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

2025–26 సీజన్‌లో పత్తి, ధాన్యం తదితర పంటల కొనుగోళ్లను పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత శాఖలతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశాల్లో పౌరసరఫరాల శాఖ , సహకారశాఖ, వ్యవసాయ, మార్కెటింగ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 2025–26 సీజన్ పత్తి సాగు, దిగుబడిపై సమగ్ర అంచనా ప్రకారం, పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మార్కెటింగ్ యార్డుల పరిధిలోని 24 జిన్నింగ్ మిల్లుల నుండి సీసీఐ ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. పత్తి అమ్మకానికి ఆధార్ ప్రామాణికత తప్పనిసరి అని, చెల్లింపులు రైతుల ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలలోనే జమ అవుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి యంత్రాలు, వసతులు, భద్రత ప్రమాణాలు సరిగా ఉన్నాయో లీగల్ మెట్రాలజీ శాఖ పర్యవేక్షణలో పరిశీలించాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి భద్రత సూచనలు ఇవ్వాలని సూచించారు.

రైతుల కోసం తాగునీరు, కనీస వసతులు కల్పించడమే కాకుండా, టోకెన్ సిస్టమ్ అమలు చేసి కొనుగోలు వ్యవస్థను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. అంతేకాక, రైతులు కిసాన్ కంపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసి నిర్ణీత సమయానికి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

2025–26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తీ స్థాయిలో ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ప్యాడి క్లీనర్లు, తార్పాలిన్లు, మాచర్ మిషన్లు, గన్ని సంచులు, లారీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గోనెసంచులను రైతులకు నేరుగా ఇవ్వకుండా, కొలత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పిపిసి సెంటర్ ఇన్‌చార్జీలు కొనుగోలు వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే స్వీకరించి ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటాచ్మెంట్‌లో ఉన్న నిర్దిష్ట రైస్ మిల్లర్లకే PPC సెంటర్ నిర్వాహుకులు ధాన్యం పంపాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సోయా చిక్కుడు – 7, మొక్కజొన్న – 9 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పంటల కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా పంటల కొనుగోళ్లు జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు .

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి – రెవెన్యూ శాఖ పై దృష్టి

రీజినల్ రింగ్ రోడ్ ( ఆర్ ఆర్ ఆర్ ), రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు ( ఆర్ఓబి ఎస్ ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణపై కూడా కలెక్టర్ సమీక్షించారు.

భూసేకరణలో ప్రజల హక్కులు కాపాడుకునేలా , రైతులకు న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. విక్రయ విలువలను ఆధారంగా పరిగణించి భూసేకరణను న్యాయంగా పూర్తి చేయాల్సిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ బాల సరోజ ,డి ఏం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్ ,సహకారశాఖ అధికారి కిరణ్ కుమార్ , జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ , జహీరాబాద్ ఆర్ డి ఓ దేవుజా నిమ్జ్ ప్రత్యేక అధికారిని విశాలాక్షి ,మార్కెటింగ్ శాఖ అధికారులు ,సంబంధితశాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు .

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్…

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్

◆:- శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.

◆:- డీసీఎంహెచ్ చైర్మన్. మల్కాపురం శివకుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నాఫెడ్ వారిచే మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో సోయబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సోయబీన్ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మాణికరావు. మరియు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్. ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు 5328/ రూపాయలు. కావున రైతులు దళారుల వద్దకు తీసుకోనిపోయి మోసపోకుండా రైతులు సోయబీన్ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఇట్టి అవకశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ది పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ , ఏడాకులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ రైతు బంధు ఆధ్యక్షులు ప్రభు పటేల్, ఏడాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రభుపటేల్. సొసైటీ డైరెక్టర్లు అనాంత్ రామ్ గౌడ్, శ్రీనివాస్, రాంచందర్. అగ్రికల్చరల్ ఏవో వెంకటేశం ఏఈఓ వేద రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు,

మెట్పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం, కాంగ్రెస్ నాయకుల సూచనలు….

మెట్ పల్లి అక్టోబర్ 21 నేటి దాత్రి

మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జువ్వాడి కృష్ణారావు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్పల్లి నియోజకవర్గం లో మక్కల కొనుగోలు కేంద్రము ప్రారంభం జరిగాయని వాటిని రైతులు కొనుగోలు కేంద్రంలో మక్కలు కొనుగోలు చేసి లబ్ధి పొందాలని దళారులను నమ్మవద్దని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నాలకు మద్దతు ధర 500 కోట్లు మంజూరు చేస్తుందని దానిని మంత్రివర్యులు ప్రకటించారని రైతులు సన్నధాన్యాలు పండించి బోనస్ 500 రూపాయలు లబ్ది పొందాలని అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పై అవాక్కు చివాకులు మాట్లాడుతున్నారని హైదరాబాదులో ఉండి ఉదయం వచ్చి చెక్కులు ఇచ్చి మళ్లీ హైదరాబాద్ పోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం మండలాధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version