మండలంలో నామినేషన్లకు 14 క్లస్టర్ సెంటర్లు సిద్ధం..

మండలంలో నామినేషన్లకు 14 క్లస్టర్ సెంటర్లు సిద్ధం

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలంలోని
39 గ్రామపంచాయతీలకు 14 క్లస్టర్ల ఆధారంగా వార్డు, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు సిద్ధం చేసిన అధికారులు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన 14 క్లస్టర్ సెంటర్ల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 39 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు సంబంధిత క్లస్టర్ సెంటర్ల వద్ద స్వీకరించబడనున్నాయి. ప్రజలకు ఎలాంటి గందరగోళం లేకుండా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సాగేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ఎంపీడీవో యసం లావణ్య తెలిపారు.
క్లస్టర్ వారీగా గ్రామాలు – వార్డు సంఖ్యలు:
* అలంకానిపేట్ క్లస్టర్
అలంకానిపేట – 10 వార్డులు
బొల్లికొండ – 10 వార్డులు
రెడ్డియనాయక్ తండా – 8 వార్డులు
అమీన్‌పేట్ క్లస్టర్
అమీన్‌పేట్ – 8 వార్డులు
పనికర – 8 వార్డులు
రామన్నకుంట తండా – 8 వార్డులు
టేకులకుంట తండా – 8 వార్డులు
అప్పలరావుపేట క్లస్టర్
అప్పలరావుపేట – 10 వార్డులు
తోపనపల్లి – 10 వార్డులు
వెంకటాపురం – 10 వార్డులు
* బంజారపల్లి క్లస్టర్
బంజారపల్లి – 8 వార్డులు
లవుడియా వాగ్య నాయక్ తండా – 8 వార్డులు
చంద్రుగొండ క్లస్టర్
చంద్రుగొండ – 10 వార్డులు
గొల్లపల్లి – 10 వార్డులు
మూడుతండా – 8 వార్డులు
దీక్షకుంట క్లస్టర్
దీక్షకుంట – 10 వార్డులు
దేవుని తండా – 8 వార్డులు
సీతారాంపురం – 6 వార్డులు
ముదిగొండ క్లస్టర్
హరిచంద్ తండా – 8 వార్డులు
ముదిగొండ – 8 వార్డులు
గుండ్రపల్లి క్లస్టర్
గుండ్రపల్లి – 10 వార్డులు
కసాన తండా – 8 వార్డులు
మడిపల్లి – 8 వార్డులు
నాగారం క్లస్టర్
నాగారం – 10 వార్డులు
నక్కలగుట్ట తండా – 8 వార్డులు, కాగా నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ క్లస్టర్లు నెక్కొండ 14 వార్డులు నెక్కొండ తండా ఆరువార్డులు పత్తిపాక 8 వార్డులు, పెద్ద కొరుపొలు క్లస్టర్లో పెద్ద కొరుపొలు 10 వార్డులు, వెంకట తండా 8 వార్డులు, రెడ్డవాడ క్లస్టర్లు అజ్మీర మంగ్య తండ 8 వార్డులు, గొట్లకొండ ఎనిమిది వార్డులు, రెడ్లవాడ 10 వార్డులు, సాయి రెడ్డి పల్లి క్లస్టర్లో మహబూబ్ నాయక్ తండ 8 వార్డులు, పిట్ట కాలు బోడు తండా ఎనిమిది వార్డులు, సాయి రెడ్డిపల్లి ఎనిమిది వార్డులు, సూరిపల్లి క్లస్టర్ లో చెరువు ముందరి తండా ఎనిమిది వార్డులు, చిన్న కొరుపోలు 8 వార్డులు, సూరిపల్లి 10 వార్డులు. ఎంపీడీవో యసం లావణ్య మాట్లాడుతూ కేటాయించిన గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యాలని ప్రజల సౌకర్యార్థం క్లస్టర్లుగా నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. కేటాయించిన క్లస్టర్ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు వార్డు నెంబర్లుగ పోటీ చేసేవారు నామినేషన్ వేయాలని ఆమె అన్నారు.

కలెక్టర్ నామినేషన్ కేంద్రాలు, వరి కొనుగోలు పరిశీలన

నిర్ణీత గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి,చెల్కగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామపంచాయతీ, నెల్కివెంకటాపూర్,వందూర్ గూడ,చింతపల్లి,తానిమడుగు గ్రామాలకు నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ,ద్వారక, కొండాపూర్,ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామపంచాయతీ, మ్యాదరిపేట,మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామపంచాయతీ,దండేపల్లి, కర్ణపేట,నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం మండలంలోని ద్వారక గ్రామంలో కొనసాగుతున్న షెడ్యూల్డ్ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయాలని,కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు,గోనె సంచులు, తేమ యంత్రాలు,తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.దొడ్డు రకం,సన్న రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయాలని,సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు సమయంలో రైతుల వివరాలు, ధాన్యం వివరాలను సేకరించి ట్యాబ్ లలో నమోదు చేయాలని, సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 10.30 గంటల లోపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 25 మంది 25 రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు.
ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి విధులు చాలా కీలకమని ఎన్నికలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విదులపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి , డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మునిసిపాలిటీ మాజీ ప్రతినిధి కౌన్సిలర్ ముహమ్మద్ అథర్ గౌరి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికా అర్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఉజ్వల్ రెడ్డి విద్యావంతులైన పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు, సంగారెడ్డి జిల్లా ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు అని, డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేశారని, ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్…

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.

ఆలయ ట్రస్ట్ బోర్డులో యాదవులకు చోటు కల్పించాలి…

ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో యాదవులకు చోటు కల్పించాలి
ఐలోని మల్లన్న స్వామిని యాదవులు కులదైవంగా కొలుస్తారు
స్వామివారి సేవకు యాదవులను దూరం చేసే కుట్ర జరుగుతుంది
అందుకే యాదవులకు ట్రస్ట్ బోర్డులో చోటు ఇవ్వలేదు
స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని యాదవులకు చోటు కల్పించాలి
జి ఎం పి ఎస్ మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

 

అయినవోలు మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా కొలువుదీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంలో స్థానిక యాదవులను గుర్తించకపోవడం స్థానిక యాదవులను అవమానపరచడమేనని జి.ఎం.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు విమర్శించారు. శుక్రవారం ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అయినవోలు మండలంలో అయినవోలు గ్రామానికి చెందిన గత పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా యాదవులను గుర్తింపు లేకుండా అవమానపరుస్తున్నారని నల్లబెట్ట రాజు యాదవ్ ఆవేదన వ్యక్తపరిచినారు. మేము ఓట్ల బ్యాంకు వరకేనా, కనీసం నామినేట్ పోస్టులకు కూడా అర్హత లేకుండా పోయినామా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి యాదవులను గుర్తించి ట్రస్ట్ బోర్డులో కనీస గౌరవప్రధ స్థానాలనైనా స్థానిక యాదవులకు కేటాయించాలని చినరాజు విజ్ఞప్తి చేసినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version