పేద ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం:ఎమ్మెల్యే నాయిని..

పేద ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం:ఎమ్మెల్యే నాయిని..

#రూ. 1.59 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
#హనుమకొండ, కాజీపేట మండలాల లబ్ధిదారులకు చేయూత..

హన్మకొండ, నేటిధాత్రి:

 

పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా కొండంత అండగా నిలుస్తోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ గోకుల్ నగర్ లోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం హనుమకొండ మరియు కాజీపేట మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మొత్తం 159 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 1,59,18,444 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆడబిడ్డల వివాహాల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. గతంలో పెళ్లిళ్లు చేయాలంటే పేదలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, మండల స్థాయి అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్…

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మునిసిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లిని ఒక ఆధునిక మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని ఈ నిధులతో రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యాలు, పట్టణ సౌందర్య వృద్ధికి, జయశంకర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ వెడల్పు,పలు అభివృద్ధి పనులు అమృత్సర్ స్కీం కింద 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవనానికి ఐదు కోట్ల రూపాయలు, గిరిజన భవనానికి కోటి రూపాయలు వెచ్చించామని తెలిపారు.ఈ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, పి.సి.సి సభ్యులు చల్లూరి మధు పిప్పాల రాజేందర్ ముంజల రవీందర్ అప్పం కిషన్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు. 

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కోప్పర్తి రాజం, మడుగుల శంకర్,జిలకర రాజం,యువ నాయకులు మడుగుల స్వామి దాస్, మడుగుల మహేష్,కొప్పర్తి చింటూ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోండి

పరమశివన్.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

దళిత ప్రజలకు ఆశ్రయంగా నిలుస్తున్న శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరం హెచ్చరించారు. శనివారం తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నాడు ఏపీ ఎస్సీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య తిరుపతి అంబేద్కర్ భవన్ పై విమర్శలు చేయడం తగదన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ అంబేద్కర్ భవన్ ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తామెంతో కృషి చేస్తున్నామన్నారు.అయితే కొందరు దుర్బుద్ధితో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళిత యువకులకు దళిత సంఘాలకు తాము ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.అలాగే నెలలో రెండుసార్లు అంబేద్కర్ ఎలా ప్రజలకు సేవ చేశారు అన్న అంశాలను ప్రజల నిరంతరం తెలియజేస్తూ అందరికీ అండగా ఉంటున్నామని తెలిపారు. ఇకనైనా అసత్యపు ఆరోపణలు మానుకొని అంబేద్కర్ భవన్ అభివృద్ధికి సహకరించాలని లేనిపక్షంలో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ భవన్ కార్యదర్శి కె.నాగేశ్వరరావు, సభ్యులు ఇంద్రముని,గోపి,పుష్ప రాజ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version