ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు
జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారికి జహీరాబాద్ సీనియర్ నాయకులు ముర్తజ తన యాక్టివా బండి పై ఎమ్మెల్యేను తీసుకొని ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ముర్తుజా, డివిజన్ నాయకులు ,మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
