పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం…

పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామ యువకులు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లడానికి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుబేర్, ఇర్ఫాన్, షకీల్, సిరాజ్, యూసుఫ్, అజారుద్దీన్, రిహాన్, మల్లేశం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

జంగాలపల్లి MPPS పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం.

జంగాలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

ప్రభుత్వ బడులలో పిల్లలను చదివిద్దాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం

నేటి ధాత్రి చర్ల

 

 

 

 

 

చర్ల మండల కేంద్రంలోని ఎంపీపీస్ జంగాలపల్లి పాఠశాలలో శుక్రవారం నాడు బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించి చిన్నారుల భవిష్యత్తును వెలుగులతో నింపాలని ఉపాధ్యాయులు కోరారు ప్రభుత్వ బడిలో చదువుకుంటాం కానీ ప్రైవేట్ బడిలో డబ్బుతో చదువును కొంటాం డబ్బులు ఎవరికీ ఊరికే రావు ప్రభుత్వ బడిలో విలువలతో కూడిన చదువుకొని మంచి ఉన్నత చదువులు చదివి అనుభవమున్న ఉపాధ్యాయులు ఉంటారు విశాలమైన తరగతి గదులు మధ్యాహ్న భోజనం వారానికి 3 గుడ్లు మూడు రోజులు రాగి జావ ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా దుస్తులు ఇవ్వబడతాయి అని ఉపాధ్యాయులు గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు వివరించారు ఇకనైనా ప్రైవేటు స్కూళ్లపై మక్కువ మాని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే రామలక్ష్మి ఉపాధ్యాయులు సకినం బాలకృష్ణ అంగన్వాడీ టీచర్ పద్మ పిల్లల తల్లితండ్రులు గ్రామస్తులు  పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version