ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణలో భాగంగా గురువారం సాధారణ ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి వర్ధన్నపేట మండలంలోని కట్రియాల, ఉప్పరపల్లి, నల్లబెల్లి గ్రామాలు, పర్వతగిరి మండలంలోని వడ్లకొండ, పర్వతగిరి కళ్ళెడం, అన్నారం షరీఫ్ గ్రామాలు, రాయపర్తి మండలంలోని రామన్నగూడెం, మైలారం, కొండూర్, తిరుమలయపల్లి, రాయపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని పరిశీలించారు.ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ బూతులను సందర్శించి పర్యావరణాన్ని పరిరక్షించుటలో భాగంగా హరిత పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడంపట్ల అబ్సర్వర్ అభినందించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పర్యావరణ హిత చర్యలు, ఓటర్లకు అందుబాటులో ఉంచిన సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించి, పోలింగ్ శాంతియుతంగా మరియు సజావుగా సాగేందుకు అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేశారు.
అబ్సర్వర్ వెంట జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.
