పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని.!

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణ లక్ష్మి పథకం..

#ఆర్ధిక భారంలో ఉన్న సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు…

#ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు..

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే నాయిని.

హన్మకొండ, నేటిధాత్రి:

ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు రూ. 42,04,842 ల కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు.కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు .
ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

కారేపల్లి: నేటి ధాత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర కు తెలంగాణ రాష్ట్రం లో పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ని ఆ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి మండలం లో పాట్టిమీద గుంపు బాజ్జుమల్లాయిగూడెం లలో పత్తి పంట పరిశీలన చేశారు. రైతుల నుంచి కౌలు రేట్లు వివిధ రకాల పంటల సాగు పరిస్థితి మిర్చి సాగు విస్తీర్ణం పై రైతుల నుంచి వివరాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మద్దతు ధర కు పత్తి కొనుగోలు చేయకుండా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( పీడీపీఎస్) ను రాష్ట్రం లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని తెలంగాణ రాష్ట్రం లో అత్యధికంగా పత్తి పండించే ఆదిలాబాద్ జిల్లాలో ఈ వ్యవసాయ సీజన్ లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అని పత్తి రైతులకు తీవ్రంగా నష్టం వాటిలే అవకాశం ఉందని రాంబాబు అన్నారు.
ఎంఎస్ పి విధానం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుంది పీడీపీఎస్ విధానం వల్ల రైతు తన పత్తి పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత మార్కెట్ ధర కన్నా ఎం.ఎస్.పి ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని నేరుగా డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు అంటే ప్రభుత్వం రైతు దగ్గర పంటను కొనదు కానీ మార్కెట్లో రైతు నష్టపోయిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తుందని నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు గత వానాకాలం సీజన్లో 44 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది పైగా రైతులు పత్తి పంట సాగు చశారు ఇంత మంది రైతులకు బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత వ్యత్యాసం ధర నగదు బదిలీ చేయడం సాధ్యం కాదు మధ్యప్రదేశ్ లో 2016-17 లోనే 8 ప్రధాన పంటలకు పీడీపీఎస్ విధానాన్ని అమలు చేసి రైతులకు వ్యత్యాసాలు నిర్ధారించడంలో లోపాలు వ్యత్యాసపు ధర చెల్లింపులు ఆలస్యం మార్కెట్ ధరలు తేడాలు నిజమైన రైతులకు కాకుండా దళారులకు చెల్లింపులు వంటివి చోటు చేసుకోవటం తో మరుసటి సంవత్సరమై ఆ పథకాన్ని నిలిపివేశారని ఇప్పుడు తెలంగాణలో పీడీపీఎస్ ప్రయోగించడం పత్తి రైతులను నాశనం చేస్తుందని వెంటనే ఈప ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు బాదావత్ శ్రీనివాసరావు మన్నెం బ్రహ్మయ్య వడ్లమూడి మధు యనమద్ది రామకృష్ణ మహిళా రైతులు పాల్గొన్నారు.

44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్. !

4.లేబర్ కోడ్లను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్…………………

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి :

 

 

అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ AITUC ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలోని ICDS అధికారి మజార్ గారికి సమ్మె నోటీసు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చీర లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్న చట్టాల గురించి ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సరి అయిందన్నారు 44 కార్మిక. చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేయాలని చూసి ఆలోచనను విరమించుకోవాలన్నారు అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ స్కీం వర్కర్స్ లక్షలాదిమంది శ్రమదోపిడికి గురవుతూ అతి తక్కువ వేతనాలతో ఎక్కువ పని గంటలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రయత్నిస్తుంటే మా యొక్క హక్కులను కాలరాయటం బిజెపి ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీకి తగునా అన్నారు మే 20 తారీకు నాడు చేపట్టినటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు………….. కార్యక్రమంలో. రేషపల్లి నవీన్. బందు మహేందర్. డప్పు శీను తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల హామీల అమలుకోసం ఉద్యమిద్దాం.

ఎన్నికల హామీల అమలుకోసం ఉద్యమిద్దాం

సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ఎన్నిక
జమ్మికుంట :నేటిధాత్రి

 

 

అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం పేదల పక్షాన సిపిఐ నిరంతరం పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల సిపిఐ పదవ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హాజరై మాట్లాడారు.ఈ సభలోలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఉద్యమ పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుటకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సిపిఐ నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. .సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ అన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో,రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వే వేగవంతంగా అమలు చేసి పేదలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేర వేర్చాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హేచ్చరించారు. అనంతరం జమ్మికుంట మండల సిపిఐ నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గజ్జి అయిలయ్య, సహాయ కార్యదర్శిగా గరిగే రాములు, శీలం రాజేందర్, 11 మంది సభ్యులతో కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సభలో ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కళ్యాణ్, మహిళా సమాఖ్య నాయకురాలు, శారద, ఐల రాజేందర్, శ్రీరాములు, సీపీఐ కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో.

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో బీసీ..చలో ఢిల్లీ

-బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న పోరాటం గల్లీలో ముగిసింది..

ఇక ఢిల్లీలో చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ 2న చేపట్టిన హలో బీసీ..

చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం గల్లీలో పోరాటం ముగిసిందని, ఇక ఢిల్లీలో పోరాటం చేయబోతున్నామన్నారు.

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఢిల్లీని బీసీల దండు ముట్టడించబోతుందన్నారు.

ఏప్రిల్ 2వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తే కేంద్రంలోనే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు.

బీసీ నినాదాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరన్నారు.

బీసీలను అణగదొక్కాలని చూస్తే వదిలిపెట్టబోమన్నారు.

బీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా కారాదని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలకు అన్యాయం చేస్తే వెంటాడుతాం..మేలు చేస్తే గుండెల్లో దాచుకుంటామన్నారు.

మా పోరాటంతోనే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు.

హలో బీసీ..చలో ఢిల్లీ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహిళలు, విద్యార్థులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిపోతున్నామని ఆయన తెలిపారు.

ఆశలు బారెడు ఆచరణ మూరెడులా రాష్ట్ర బడ్జెట్.

ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా రాష్ట్ర బడ్జెట్

గత బడ్జెట్ పై శ్వేత పత్రం ప్రకటించాలి

ఎన్నికల హామీలు అమలయ్యే విధంగా బడ్జెట్ సవరించాలి

వ్యవసాయరంగానికి 10 శాతం కేటాయించకపోవడం శోచనీయం

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మూడు లక్షల నాలుగువేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా ఉందని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎద్దేవా చేశారు.బడ్జెట్ అంకెల్లో గొప్పగా కనిపిస్తున్నప్పటికీ ఆచరణలో కేటాయింపులను చూస్తే ఎన్నికల హామీలు అమలయ్యే విధంగా లేవని, గత బడ్జెట్ కేటాయింపులపై ఖర్చులపై ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు.
బుదవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజల ఆశలను అడియాశలు చేసిందని ఈ క్రమంలో ఈ బడ్జెట్ లోనైనా హామీలన్నీ అమలయ్యే విధంగా కేటాయింపులు ఉంటాయని ఆశిస్తే ప్రజలకు శఠగోపం పెట్టారని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలను అరకొర అమలుచేసి ప్రచారా ఆర్భాటం చేస్తున్నారని అలాగే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేసి బడ్జెట్లో మాత్రం అందుకు అనుగుణంగా కేటాయింపులు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే వ్యవసాయ రంగానికి కేవలం 24,439 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని వాస్తవ సాగుదారులకు నేటికీ 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాదని, రైతు భరోసా రైతుల ఎకౌంట్లో పడలేదని అన్నారు.ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ రైతులందరికీ వర్తింపజేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారాన్ని నిధులు కేటాయించకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.ఇప్పటికైనా గత బడ్జెట్ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలు వచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా బడ్జెట్ సవరణలు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా రమేష్ హెచ్చరించారు.

జల్ జీవన్ మిషన్ అమలు

*తిరుపతి జిల్లాలో తాగునీటి సరఫరాపై

తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 14:

లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖా సహాయ మంత్రి వి.సోమన్న సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి తిరుపతి జిల్లాలో కేవలం 2.40 లక్షల గ్రామీణ ఇళ్లకు (57.58%) త్రాగు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అయితే,గత అయిదేళ్లలో 1.76 లక్షల కొత్త కనెక్షన్లు అందించారని, ప్రస్తుతం 4.16 లక్షల ఇళ్లకు (99.82%) తాగునీటి కనెక్షన్లు అందించబడ్డాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారీగా చూసినట్లయితే 1.19 లక్షల ఎస్సీ, 26 వేల ఎస్టీ కుటుంబాలకి త్రాగునీటి కనెక్షన్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఓబిసిలకి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో కనెక్షన్ల కవరేజ్ గరించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం తిరుపతి జిల్లాలో మొత్తం 4,018 హ్యాబిటేషన్లు ఉండగా వాటిలో 487 ఎస్టీ,1,331 ఎస్సీ హ్యాబిటేషన్ గా గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. వీటిలో 09.02.2025 నాటికి 485 ‘ఎస్టీ, మరియు1,328 ‘ఎస్సీ హ్యాబిటేషన్లు పూర్తి స్థాయిలో కనెక్షన్ లు అందించా
బడ్డాయని తెలిపారు.అలాగే తాగునీటి నిర్వహణలో గ్రామస్థాయి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల ఏర్పాటు ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని 908 గ్రామాలలో 901 గ్రామాలకు గ్రామ నీటి,పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. ఇందులో 50% కమిటీ సభ్యులు మహిళలు కావడం గమనార్హమని అన్నారు.ఈ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యం కల్పించామనీ తెలిపారు.
ఈ పథకం ప్రారంబించే సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో 30.74 లక్షల (32.18%) గ్రామీణ ఇళ్లకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందుబాటులో ఉండగా, 2025 ఫిబ్రవరి 9 నాటికి ఈ సంఖ్య 70.46 లక్షల (73.76%)కు చేరిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ ఇంటికి 55 లీటర్ల తాగునీరు రోజుకు అందించే లక్ష్యం కోసం జల్ జీవన్ మిషన్ వేగంగా పురోగమిస్తోందని ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక & సాంకేతిక సహాయం అందిస్తూనే ఉందని తెలియజేశారు.

ఆరు గ్యారెంటీల అమలుకై చలో హైదరాబాద్

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్

కారేపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను నెరవేర్చాలని ఈనెల 20 తారీఖున చలో హైదరాబాద్ మహా ప్రదర్శన సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కారేపల్లి మండలం వేరుపల్లి జవాన్ల పెళ్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్న వివిధ రకాల సర్వేలకే పరిమితమైందని ఎన్నికలకు ముందు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను ఇంతవరకు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రేషన్ కార్డులు పోడు భూములకు పట్టాలు కౌలు రైతులకు రైతులందరికీ ఎకరానికి 15 వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేల రూపాయలు కింటాకు 500 రూపాయల బోనస్ చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పెన్షన్ వివిధ రకాల పింఛన్లు కనీస వేతనం చట్టం అమలు చేయడంలో వంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు విద్య వైద్యం వివిధ రకాల వాగ్దానాలను హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీని మూలంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని దీనిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని దీని అమలుకై ఈనెల 20 తారీకున హైదరాబాదులో జరుగు మహా ప్రదర్శనను సభను అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి అలెం చంద్రయ్య బుర్ర కోటమ్మ సుగుణ పద్మ లక్ష్మి సరోజ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version