ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా సందర్శించిన

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా సందర్శించిన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను మంగళవారం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ సందర్శించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించిన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అప్పల రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలన్నారు. అదేవిధంగా ఉప కేంద్రాల పరిధిలో ఆశ,ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎలాంటి డెంగ్యూ కేసులు గాని మలేరియా కేసులు గాని నమోదు కాకుండా చూడాలని తెలిపారు.రోగులతో సమన్వయంగా ఉంటూ మందులను ముందస్తుగా నిలువ చేసుకోవాలని ఉపకేంద్ర సిబ్బందితో రోజు మాట్లాడాలని,ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పాముకాటు, కుక్కకాటు మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే పంచాయతీల కార్యదర్శులు,ఆరోగ్య కార్యకర్తలు సహజంగా ఉంటూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, ఆశ,అంగన్వాడి,ఆరోగ్య కార్యకర్తలు,మహిళా గ్రూపు సంఘాలు,యూత్ అంతా కలసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బుక్క వెంకటేశ్వర్లు జిల్లా మాస్ మీడియా అధికారి, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,డాక్టర్ అశోక్,డాక్టర్ స్పందన, సీనియర్ అసిస్టెంట్ సంపత్ పాల్గొన్నారు.

పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలి .

పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఫీజు రియంబర్మెంట్లు స్కాలర్షిషిపులు విడుదల కొరకు పిడి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్మేంట్,స్కాలర్షిప్ 7200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.విద్యార్థులు పై చదువులు చదవాలంటే కార్పొరేట్ కళాశాలలోని ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి గురి చేయడం వల్ల విద్యార్థులు చదువులని మానేసే పరిస్థితి నెలకొంటుంది.విద్యార్థులకు రావలసిన బకాయిలు తక్షణమే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని కోరారు.జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చుట్టూ ప్రహరి గోడ లేకపోవడం వల్ల మహిళ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ దీనిపై తక్షణమే ప్రభుత్వం,ఎమ్మెల్యే స్పందించి జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి డి ఎస్ యు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్,అన్వేష్,సుమంత్, వైష్ణవి,రోజా,మేఘన విద్యార్థులు పాల్గొన్నారు.

జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

జైపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జైపూర్,నేటి ధాత్రి:

రాష్ట్ర కార్మిక,ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు జైపూర్ మండలంలో శనివారం రోజున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు అందరికీ పథకంలో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు మంజూరైన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,హౌసింగ్ శాఖ ఏఈ కాంక్ష,గ్రామ కార్యదర్శి ఉదయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్,మాజీ ఉప సర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి,తడిసిన కల్కి రమేష్,ప్రశాంత్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు ఇరిగిరాల శ్రావన్ కుమార్,అరిగేలా శ్రీనివాస్ గౌడ్,ఇరిగిరాల లింగయ్య  పాల్గొన్నారు.

జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు.!

జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ ఆరోపణ

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు.పట్టా పాస్ బుక్ ఉండి అన్ని అర్హతలు ఉన్న కూడా ఎంక్వయిరి రిపోర్ట్ లు అర్హులకు కాకుండా అనర్హులకు అనుకూలంగా ఇస్తూ రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోయే విదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అంతే కాకుండా విద్యార్థుల విద్యాబ్యాసానికి అవసరమైన సర్టిఫికేట్స్ విషయంలో బీద విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని,గంగారపు రమేష్ తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి పై సమగ్ర విచారణ జరిపి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.శేఖర్, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీని మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా శనివారం ఎంపీఓ శ్రీపతి బాబురావు సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిస్టర్ లను పరిశీలించి సిగ్రిగేషన్ షెడ్డు లో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వేసవికాలం తాగునీరు సరఫరా లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ పైపు లైన్లు లీకేజీలు ఉంటే వెంటనే సరి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి పావని,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు.టీఎన్జీవో ఉద్యోగులు మంచిర్యాల జిల్లా చైర్మన్ గా గడియారం శ్రీహరిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జైపూర్ తహసిల్దార్ వనజ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం,వారి అభివృద్ధికి ఎల్లప్పుడు తోడుగా ఉంటూ తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. శుక్రవారం తహసిల్దార్ వనజా రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన.

జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి

జైపూర్,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ బదిలీల ప్రక్రియలో జైపూర్ పోలీస్‌ స్టేషన్‌ కి నూతన రెండవ ఎస్సైగా రామలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందు నుండి పోస్ట్ ఖాళీగా ఉండడంతో రెండవ ఎస్సై గా ఎస్సై నాగరాజును స్థానిక పిఎస్ కు ఉన్నతాధికారులు నియమించారు.దీనితో ఈ పోస్ట్ కు గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రామలక్ష్మి పదోన్నతి పై జైపూర్ పిఎస్ కి బదిలీ అయ్యారు.బాధ్యతలు చేపట్టిన రెండవ ఎస్సై రామలక్ష్మి కి ఏసీపి వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.పదోన్నతులతో బాధ్యతలు మరింత పెరుగుతాయని సూచించి,విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలన్నారు.ఫిర్యాది దారుల సమస్యలను మర్యాదపూర్వకం గా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అదే క్రమంలో నూతన రెండవ ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి కి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై రామలక్ష్మి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జూదం,అక్రమ మద్యం,మాదకద్రవ్యాలు తదితర వాటిపై పోలీస్ వారి ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version