చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు.

చిట్యాల ఎస్సై పై ఎస్పీకి ఫిర్యా దు చేసిన రైతులు

భూపాలపల్లి నేటిధాత్రి:

సమస్యలను పరిష్కరించాలని చిట్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే ఎస్సై తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిట్యాల మండలానికి చెందిన రైతులు మంగళవారం జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
చిట్యాల మండలం చింతకుంట రామయ్య పల్లి కి చెందిన అబ్బెంగుల రాజయ్య ,కైలాపూర్ కు చెందిన బూదారపు మార్కండేయ ,చల్లగరిగే కు చెందిన ఇంచర్ల లక్ష్మీ అనే ముగ్గురు రైతులు చిట్యాల ఎస్సై శ్రావణ్ కుమార్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే కు ఫిర్యాదు చేశారు..అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఇంచర్ల లక్ష్మి మార్కండేయ అనే రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూమిని వేరే వాళ్ళు దున్నుకుంటున్నారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఎస్సై తమని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు…ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోని తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు జిల్లా ఎస్పీని కోరారు

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోడపాక రఘుపతి, ఎస్సై -2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా యోగా దినోత్సవం ను నిర్వహించారు. ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విధానమని దీని ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను, శారీరక మానసిక వికాసాన్ని సాధించవచ్చని చెప్పారు. ఎస్సై -2 ఈశ్వరయ్య స్వయంగా కొన్ని యోగాసనాలు వేసి విద్యార్థులతో చేయించాడు. యోగాతో శారీరక అనారోగ్యాలను తొలగించుకోవచ్చని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బుర్ర సదయ్య విద్యార్థుల చే యోగాసనాలు వేయించారు. హాస్టల్ వార్డెన్లు వేణు సింగ్, అరుణలు పాల్గొని విద్యార్థులకు మొలకలు, రాగి జావా అందించి ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, సరళ దేవి, నీలిమారెడ్డి రామనారాయణ కల్పన,శంకర్, మౌనిక, ఉస్మాన్ అలీ,బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవాలి

టెన్త్ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివి అత్యుత్తమ మార్కులు సాధించాలి.

జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఉన్నత పాఠశాలను మంగళవారం రోజున జిల్లా విద్యాధికారి ముద్దమల్ల రాజేందర్ సందర్శించారు, ఈ సందర్భంగా పాఠశాలలోని వివిధ రకాల రికార్డులను పరిశీలించారు, అనంతరం మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి కష్టపడి ప్రణాళిక బద్ధంగా చదివి విద్యార్థులందరూ అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులను వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి జవాబులను తెలుసుకున్నారు ఈ సందర్భంగా అతని మాట్లాడుతూ విద్యార్థులలో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆనందాన్ని వెలిబుచ్చాడు రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో చిట్యాల ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని విద్యార్థులలో ప్రేరణ కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కూచనపల్లి శ్రీనివాస్ బొమ్మ రాజమౌళి నీలిమ రెడ్డి సుజాత విజయలక్ష్మి కల్పన ఉస్మానాలి మౌనిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీజీ నాయకులు

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియమించాలని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాట్లాడుతూ గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఆరుగురు డాక్టర్లతో తూతూ మంత్రంగా వైద్య సేవలని అందిస్తున్నారని దుయ్యబట్టారు …. గైనిక్,, అనస్తీసియా,, పీడియాట్రిక్ డిపార్ట్మెంటులో ఇద్దరేసి డాక్టర్ల చొప్పున ఉంటూ వైద్యాన్ని అందించాల్సి ఉండగా వైద్యుల కొరత వల్ల అనేక ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భూపాలపల్లి పరకాల హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… కొన్నిసార్లు సమయానికి వైద్యం అందక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు… గత ఆరు నెలల నుండి పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది.. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదని, పేద ప్రజల ఆరోగ్యం అంటే ఆయనకు లెక్కే లేకుండా పోతుందని మండి పడ్డారు.వెంటనే జిల్లా కలెక్టర్ నిరుపేద రోగుల పరిస్థితుల దృష్ట్యా చిట్యాల హాస్పిటల్ కు పూర్తి స్థాయిలో గైనిక్,, అనస్తీషియా,, పీడియాట్రిక్ డాక్టర్లను నియమించాలని ఆయన కోరడం జరిగింది. లేనట్లయితే చిట్యాల హాస్పిటల్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్థామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాస్త్రాల తిరుపతి శీలపాక హరీష్ మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version