వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీడ్రా విజేతలు రోషిణి, ప్రియాంక..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T133932.778.wav?_=1

 

వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీడ్రా విజేతలు రోషిణి, ప్రియాంక

నేటిధాత్రి, వరంగల్.

వరంగల్, జెపిఎన్ రోడ్డు లోని, వైభవలక్ష్మి షాపింగ్ మాల్లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు.

మొదటి, రెండవ లక్కీ డ్రా నంబర్లను చిన్నారుల చేతుల మీదుగా తీయించారు. లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకున్నవారికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కావ్య. లక్కీ డ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్న కాశీబుగ్గకు చెందిన జి. రోషిణి (కూపన్ నంబర్ B-373) ఒక కిలో వెండి బహుమతిగా అందుకున్నారు. రెండవ బహుమతి విజేత రెడ్డిపాలెంకు చెందిన జె.

ప్రియాంక (కూపన్ నంబర్ J-250) టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, పట్టుదలతో, నిజాయితీగా కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకు అందించాలని షాపింగ్ మాల్ యాజమాన్యానికి సూచించారు. యువ వయస్సులోనే వ్యాపారరంగంలో అడుగుపెట్టి మాల్‌ను స్థాపించిన యాజమాన్య ప్రతినిధులను ఎంపీ అభినందించారు. పండుగ శుభ సందర్భాలలో ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని, కస్టమర్ల విశ్వాసమే మాల్ విజయానికి మూలస్థంభమని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు ప్రదీప్, హరీష్, రిషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.

వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీడ్రా విజేతలు రోషిణి, ప్రియాంక…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T133932.778.wav?_=2

 

వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీడ్రా విజేతలు రోషిణి, ప్రియాంక

నేటిధాత్రి, వరంగల్.

మమ్ముట్టి ఆరోగ్యం.. స్పందించిన ఎంపీ..

మమ్ముట్టి ఆరోగ్యం.. స్పందించిన ఎంపీ.. మోహన్‌లాల్‌ ప్రత్యేక పూజలు

 

 

 

 

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే

 

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బుధవారం సాయంత్రం నుంచి పలు మాధ్యమాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఆయన అనారోగ్యానికి  గురైన వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ కథనాలను మమ్ముటి టీమ్‌ కొట్టి పారేసింది. ‘‘మమ్ముట్టి ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. రంజాన్‌ కారణంగా ఆయన షూట్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని వెకేషన్‌కు వెళ్లారు. విరామం నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన మోహన్‌లాల్‌తో కలిసి మహేశ్‌ నారాయణన్‌ (Mahesh Narayan) చిత్రంలో పాల్గొనున్నారు’’ అని టీమ్‌ వెల్లడించింది. దీనిపై ఆయన స్నేహితుడు, ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ ఖండించారు. మమ్ముట్టి ఆరోగ్యం బాగా లేదన్నమాట వాస్తవమే కానీ.. అది చాలా చిన్న సమస్య అని ఆయన క్లారిటీ ఇచ్చారు. (Mammootty health Update)

‘‘మేమిద్దరం చాలాకాలంగా నుంచి స్నేహితులం. కానీ, మా వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కొన్ని రోజుల నుంచి ఆ వివరాల గురించి కూడా పంచుకుంటున్నాం. మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. కొన్ని గంటల క్రితమే ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను’’ అని మమ్ముట్టిపై వస్తున్న రూమర్‌లకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.
అంతే కాదు మమ్ముట్టి ఆరోగ్యం కోసం మోహన్‌లాల్‌ శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోహన్‌లాల్‌ తెలిపారు. ఇలాంటి సమస్యలు  అందరికీ వస్తాయని చెప్పారు. 

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో.

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో మాజీ మేయర్ల పాత్ర ఏంటి?

అధికారిక కార్యక్రమాల్లో వేదికపై మాజీలను పిలిచినమున్సిపల్ కమిషనర్ పైచర్యలు తీసుకోవాలి

బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న కమిషనర్

_సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

కరీంనగర్ నగరంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్ల పంపిణీ అధికారిక కార్యక్రమంలో వేదికపై బిజెపి పార్టీకి చెందిన మాజీ మేయర్ సునీల్ రావు,
డి.శంకర్ కొంతమంది మాజీ కార్పొరేటర్లూ వేదికపై ఉండటం వేదికపై సీట్లలో కూర్చోవడానికి ఆహ్వానించిన నగరపాలక కమిషనర్ పైచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా బిజెపికి చెందిన నాయకులు వేదిక పై కూర్చున్న కమిషనర్ మౌనంగా ఉండటం ఉండి ప్రజలను అవమానపరుస్తున్నారని బిజెపి కార్యక్రమాల్లాగా అధికార కార్యక్రమాలు కమిషనర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

Municipal Commissioner

 

 

పదవి కాలం పూర్తయిన ఇంకా మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వేదికలపై పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో అరవై మంది కార్పొరేటర్ల పదవి కాలం పూర్తయిన బోర్డుపై ఉన్న వారి పేర్లు ఇంకా తొలగించడం లేదని వెంటనే వాటిని తీసేయాలని సురేందర్ రెడ్డి,రాజు ఈసందర్భంగా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి జహీరాబాద్ ఎంపీ.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి: జహీరాబాద్ ఎంపీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 23న జహీరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, కండేం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ బిబి పాటిల్.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీ బిబి పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ హాజరయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ గాజుల బాలకిష్టయ్య మనవరాలు లక్ష్మి (రమ్యశ్రీ )-భగత్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాలోన్నారు.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

23న జహీరాబాద్ కు సీఎం రాక ఎంపీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎంపీ సురేష్ షెట్కార్ తెలిపారు. జహీరాబాద్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. nimz జి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఝరసంగం మండలంలోని కేంద్రీయ విద్యాలయం పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఆల్గల్ రోడ్డు, బైపాస్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల వివరాలను ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ లకు డి ఈ సృజన్ చక్రవర్తి వివరించారు.

సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ.!

కుర్మ సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కుర్మ సురేందర్, పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్ ల యొక్క నాన్న కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.పరామర్శ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పల్లె దినేష్, కనకం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ సురేష్.

వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని యస్.వి. కన్వెన్షన్ హాల్ లో జరిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ గారి కూతురి వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ గారు, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్ గారు,పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హుగెల్లి రాములు, శుక్లవర్ధన్ రెడ్డి, ఖాజా భాయ్, స్వామి, ముర్జల్ గారు,మొయిజ్, ఇనాయత్, తధితరులు పాల్గొనడం జరిగింది.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని,వరి ధాన్యం తడవకుండా తాడ్పల్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆ ర్ సి

వనపర్తి నేటిదాత్రి :

 

 

మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వరలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి శ్రీశైలంమల్లికార్జున నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలోగుర్రం జగదీశ్వరయ్య
మల్లికార్జున్ లోటస్ సెలూన్ రామకృష్ణ కలిసిపూలబోకె ఇచ్చి శాలువతో రావులను ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం హుమ్నపూర్ గ్రామంలో ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో అక్కమహాదేవి మందిరం దగ్గర బోర్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుణవంత్ పాటిల్, కార్యకర్తలు భీమన్న, వైజీనాథ్ పాటిల్, రాజు, సిద్దయ్య స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్.

శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్

నేటి ధాత్రి కథలాపూర్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్ నుండి మండలానికి వచ్చిన బోర్ బావిలను ఈరోజు రెండు గ్రామాల్లో సిరికొండ,కథలాపూర్ లో కొబ్బరికాయ కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,బద్రి సత్యం,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్,కాసోజీ ప్రతాప్,గాందారి శ్రీనివాస్, తెడ్డు మహేష్,సునీల్,జీవన్ రెడ్డి,ప్రసాద్,భూమేష్,శ్రీనివాస్, ప్రమోద్,శ్రీకర్,రాకేష్,రాజారెడ్డి,గంగామల్లయ్య ఉన్నారు.

కేంద్ర మంత్రి కుమారస్వామితో ఎంపీ వద్దిరాజు భేటీ.

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ

“నేటిధాత్రి” న్యూఢిల్లీ.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డి.కుమారస్వామితో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.ఎంపీ రవిచంద్ర పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో ఆయన్ను కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Kumaraswamy

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా నెలకొల్పిన ఈ పరిశ్రమ కొన్నేళ్లుగా మూతపడడంతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఎంపీ రవిచంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు.ఈ విషయమై మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన కార్మిక నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం వచ్చే నెల 2వతేదీన ఢిల్లీ వస్తున్నదని,వారు కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరగా, మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.

MP నిధుల సహకారంతో CC రోడ్డు పనులు ప్రారంభం.

ఎంపీ నిధుల సహకారంతో సిసి రోడ్డు పనులు ప్రారంభం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ఎంపీ నిధులతో ఏర్పడిచేసిన సీసీ రోడ్డు పనులు స్థానిక గ్రామ బిజెపి నాయకులు బుధవారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారి గ్రామంలో ఎంపీ నిధుల సహకారంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ సుధాకర్ శ్రీనివాస్ దివ్య సాగర్ శంకరి ముఖేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

జైపూర్,నేటి ధాత్రి:

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP..

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP కథలాపూర్ మండల శాఖ….

నేటి ధాత్రి కథలాపూర్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కథలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు MP నిధులను కేటాయించడంతో BJP మండల శాఖ,బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ,తండ్రీయాల, కథలాపూర్ గ్రామాలకు బోర్ మోటార్,దులూర్ రజక సంఘ భవనానికి 9 లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్,వేములవాడ నియోజకవర్గ నాయకులు చెన్నమనేని వికాస్ రావు లకు బీజేపీ మండల శాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావ్,బద్రి సత్యం,కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్,నరెడ్ల రవి,గడ్డం జీవన్ రెడ్డి, తెడ్డు మహేష్ పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ.

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ

“నేటిధాత్రి”న్యూఢిల్లీ, మార్చి, 17:

ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి సోమవారం పరామర్శించారు. పార్లమెంట్ ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో ఈ మేరకు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రజలు, దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల ఎంపీ రవిచంద్ర ఆనందం వ్యక్తం చేశారు. మరింత కాలం ప్రజా సేవకు అంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిని కలిసి పరామర్శించిన వారిలో తెలంగాణకు చెందిన భాజపా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ఉన్నారు.

ఎంపీ డీకే అరుణకు సన్మానం.!

ఎంపీ డీకే అరుణకు సన్మానం

మహబూబ్ నగర్ /నేటీ ధాత్రి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో మహబూబ్ నగర్ ఎంపీ అరుణకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మరియు షాద్ నగర్ బిజెపి నాయకులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షాద్ నగర్ బీజేపీ నాయకులు శ్రీనివాస్, విజయ్ బాస్కర్, నర్సింహా యాదవ్, మోహన్ సింగ్, సుధాకర్, కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి, చౌదరిగూడ మండల అధ్యక్షులు గడ్డమిది రాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, మిద్దె గణేష్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజు నాయక్, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version