ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.
చిట్యాల, నేటి ధాత్రి :
మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిట్యాల మండలం అధికారులు, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు, బుధవారం రోజున నేటి ధాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో చిట్యాల మండలంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.. అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని .ప్రజలు భారీ వర్షాల వలన అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే పోలీసులకు , అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజలు అధికార యంత్రంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళరాదని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినారు.
