ప్రశాంతంగా మున్సిపాలిటీ ఎన్నికలు..

ప్రశాంతంగా మున్సిపాలిటీ ఎన్నికలు

* ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మూడు మున్సిపాలిటీలోని రెండు చోట్ల మినహా ఇతర అన్నిచోట్ల పోలింగ్ సక్రమంగా జరిగింది. మొదట మందకోడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పొంచుకుంది. 7:00 నుంచి 9 గంటల వరకు రెండు గంటల వ్యవధిలో 15% లోపు పోలింగ్ ఆ తర్వాత 11, ఒంటిగంట వరకు పోలింగ్ శాతం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఒకటి గంటల వరకు మూడు మున్సిపాలిటీలో 50 శాతానికి మించి పోలింగ్ జరిగింది. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కు మూడు రోజుల కిందట అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గడి మలక్పేట్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ల మధ్య జరిగిన గొడవతో బందోబస్తును మరింత పెంచారు. సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన అద్రాస్ పల్లి, కొల్తూరు గ్రామాల్లో బందోబస్తును మరింత పెంచారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ లాల్ గడి మలక్పేట్ ను సందర్శించి, బందోబస్తును పర్యవేక్షించారు.

కాగా జిల్లా కలెక్టర్ మన చౌదరి, ఎన్నికల పరిశీల కురాలు విజయ కాంతి వెస్లీ తో కలిసి మూడు మున్సిపాలిటీల్లో ని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓటింగ్ నిర్వాహణ, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డిసిపి పురుషోత్తం, ఏసీపీ లు శ్రీనివాస్ రెడ్డి, బాలగంగి రెడ్డి, మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలను పరిశీలించారు. కేశవరం, కొల్తూరు, మూడు చింతలపల్లి, ఉద్దమర్రి గ్రామాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇది ఇలా ఉంటే అలియాబాద్ మున్సిపాలిటీ ఐదో వార్డులో బిజెపి అభ్యర్థి నకిలీ వెండి నాణేలను ఓటర్లకు అందజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విషయాన్ని గుర్తించిన ఓటరు సదరు అభ్యర్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రావల్కోల్ లో ఓటు వేయడానికి వచ్చిన వారిపై డి ఐ కిరణ్ శాంతి భద్రతల విధుల్లో భాగంగా లాటీ ఛార్జ్ చేశారు. దీనీ పై సిపిఎం నేత నరేష్ తో పాటు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సరికి ఎల్లంపేట్ మునిసిపల్ 83.28 %, అలియాబాద్ మునిసిపల్ 79.62 % మూడుచింతలపల్లి మునిసిపల్ 89.06 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఓటు హక్కు ప్రతిఒక్కరి బాధ్యత…

ఓటు హక్కు ప్రతిఒక్కరి బాధ్యత

ఓటు హక్కు వినియోగించిన దేవస్థాన మాజీ ఛైర్మెన్ గందే వెంకన్న

పరకాల,నేటిధాత్రి

బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 17వార్డులో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 34వ బూత్ నంబర్లో గల తమ ఓట్లను పరకాల పట్టణ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మెన్ గందే వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి వినియోగించుకున్నారు.ఉదయం నుంచే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి తన ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.17వ వార్డులో ఉదయం నుంచే ఓటర్ల రాకపోకలు కొనసాగాయి.యువత, మహిళలు,వృద్ధులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది శాంతియుతంగా పోలింగ్ నిర్వహించారని అన్నారు.

ముగిసిన పుర ఎన్నికలు…

ముగిసిన పుర ఎన్నికలు…

ప్రశాంత వాతావరణం లో ముగిస్తున్న మున్సిపల్ ఎన్నికలు

ఎంతో ప్రాయాస పడుతూ ఓట్లలో పాల్గొన్న వికలాంగులు… వృద్ధులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసాయి ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని పార్టీల నాయకులు సవ్యమనం పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించారు. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నట్టు కనబడుతుంది ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క ఓటరు కేసముద్ర మున్సిపాలిటీ అభివృద్ధి కొరకై తమ ఓటును వేసి మద్దతు తెలిపినట్టు వినపడుతుంది. ఎన్నికలు అయితే ముగిసాయి కానీ ఎవరికి పట్టం కడతారో అనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో పోటాపోటీగా ఎన్నికలు జరిగినట్టు సమాచారం. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎవరికి విజయం వరిస్తుందో ఎవరికి అపజయం వరిస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతుందని పలువురు భావిస్తున్నారు. పలువురు నాయకులు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఎవరికి వారు ఎన్ని చెప్పుకున్నా ప్రజల తీర్పే తుది తీర్పు ఆ తీర్పు వెలుపడే సమయం ఒక్కరోజు కన్నుమూస్తే మర్నాడు ఎవరి జాతకాలు ఏంటనేది తేలిపోతుంది అప్పటిదాకా అభ్యర్థులకు నాయకులకు కంటిమీద కు నుకు పట్టిన ప్రజలు మాత్రం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నట్టు కనపడుతుందని భావిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి ఓటర్ల నాడి ఎవరు ఊహించలేని విధంగా తీర్పు ఇచ్చేలా ఓటర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో ఎవరిని విజయం వరిస్తుందో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే శుక్రవారం 13వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.

భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ…

భూపాలపల్లిలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం జడ్పి ఉన్నత పాఠశాల, హనుమాన్ నగర్‌లోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 52,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని తెలిపారు. వీరిలో 26,786 మంది పురుషులు, 25,936 మంది మహిళలు, ఇతరులు 4 మంది ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 30 వార్డులకు 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 104 మంది ప్రెసైడింగ్ అధికారులు, 104 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు, 312 మంది ఇతర పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు.

అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. 86 పోలింగ్ కేంద్రాల్లో 149 వెబ్‌కాస్టింగ్ యూనిట్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. కొన్ని కేంద్రాల్లో లోపల మరియు బయట రెండు చోట్లా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపిఎస్..

ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపిఎస్

పటిష్టమైన భద్రతలో కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలు

కేసముద్రం/ నేటి ధాత్రి

నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిస్ ఐపీఎస్ కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల కేంద్రాలను సందర్శించారు వారితో పాటు డిఎస్పి తిరుపతిరావు, స్థానిక సీఐ సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతి కిరణ్ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో ముగిసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.

 ములుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి…..

 ములుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి..

#తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు!

ములుగు, నేటిధాత్రి:

 

 

జిల్లా కేంద్రమైన ములుగులో తొలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఉదయం నుండే ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది.

మహిళలు, వృద్ధులు మరియు యువ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్థానిక ప్రజల్లో భారీగా ఆసక్తి నెలకొంది.

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్…

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 37 వార్డుల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 9 గంటల వరకు 16.63 శాతం పోలింగ్ నమోదైంది.
మొత్తం 78,819 మంది ఓటర్లలో 13,112 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూల్లో నిలబడి ఓటు వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 29వ వార్డు లో ఓటు వేసిన బిఆర్ఎస్, సీనియర్ నాయకులు షేక్ ఫరిద్ తమ నాయకులు కార్యకర్తలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు,

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన..

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణలో భాగంగా గురువారం సాధారణ ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి వర్ధన్నపేట మండలంలోని కట్రియాల, ఉప్పరపల్లి, నల్లబెల్లి గ్రామాలు, పర్వతగిరి మండలంలోని వడ్లకొండ, పర్వతగిరి కళ్ళెడం, అన్నారం షరీఫ్ గ్రామాలు, రాయపర్తి మండలంలోని రామన్నగూడెం, మైలారం, కొండూర్, తిరుమలయపల్లి, రాయపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని పరిశీలించారు.ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ బూతులను సందర్శించి పర్యావరణాన్ని పరిరక్షించుటలో భాగంగా హరిత పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడంపట్ల అబ్సర్వర్ అభినందించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పర్యావరణ హిత చర్యలు, ఓటర్లకు అందుబాటులో ఉంచిన సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించి, పోలింగ్ శాంతియుతంగా మరియు సజావుగా సాగేందుకు అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేశారు.
అబ్సర్వర్ వెంట జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మొదటి విడత పంచాయితీ ఎన్నికలు..

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మొదటి విడత పంచాయితీ ఎన్నికలు

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మొదటి విడత సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అదనపు ఎన్నికల అధికారి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 మొదటి విడతలో జిల్లాలోని జన్నారం, దండేపల్లి,లక్షెట్టిపేట,హాజీపూర్ మండలాలలో సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.జిల్లాలో గుర్తించిన 24 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version