పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామ యువకులు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లడానికి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుబేర్, ఇర్ఫాన్, షకీల్, సిరాజ్, యూసుఫ్, అజారుద్దీన్, రిహాన్, మల్లేశం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.