వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి..

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నిజాంపేట్, నేటి ధాత్రి

 

జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు.
శనివారం మెదక్ జిల్లాలోని
నిజాంపేట్ మండలం చెల్మెడ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీవో రమాదేవి తాసిల్దార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం 2025-26 వానకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, నీడ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు, గోనె సంచులు, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలని సమకూర్చాలని తెలిపారు. . అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను ప్రతి రోజు సందర్శించాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు.

నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు..

నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

మండలంలో వానాకాలం పంటల సాగు మొత్తం 26,956 ఎకరాలకు చేరినట్లు తహసిల్దార్ వేముల రాజ్ కుమార్ చైర్మన్ తెలిపారు. గురువారం లైన్ డిపార్ట్మెంట్లతో కలిసి పంటల విస్తీర్ణంపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగులోకి వచ్చాయని వివరించారు. సమావేశంలో యం పి యస్ ఓ హనుమంతు నాయక్, ఏ ఓ నాగరాజు, ఇరిగేషన్ ఏ ఈ ఈ చందన, ఏ ఈ ఓలు రాజేష్, రఘు పాల్గొన్నారు.

స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసివేయాలి…

స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసివేయాలి

కౌలు రైతుల
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

కౌలు రైతులు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలి మధ్య దళారులక

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

పట్టా పాస్ బుక్ ఉన్న రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని వారు పండించిన ధాన్యాన్ని కానీ పత్తిని సీసీఐకి అమ్మడానికి వీలు ఉంది కానీ కౌవులు రైతులు పండించిన పంటను అమ్మాలంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. సందర్భంగా వారు మాట్లాడుతూ
భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులు 45 శాతం ఉంటారు ఒక ఎకరానికి కౌలు 15000 పెట్టుబడి 60000 పెట్టి సాగు చేసుకుంటున్నారు గతంలో వ్యవసాయ అధికారుల ద్వారా మాన్యువల్ ద్వారా కొనుగోలు చేసేది ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది తాము పండించినటువంటి పత్తి వడ్లు ఎవరికి అమ్ముకోవాలో తెలవక ప్రభుత్వంస్లాట్ బుక్ చేసుకో మంటుంది కౌలు రైతు ఏ పట్టా పాస్ పుస్తకం తో స్లాట్ బుక్ చేసుకోవాలి . ఎవరికి అమ్ముకోవాలి మధ్యదళారులక లేక సీసీఐకా అని దిక్కుతోచని పరిస్థితిలో పండించిన పంటను ఎవరికి అమ్మాలి అర్థం కాక బోరుమంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళ పట్ల వివక్ష చూపుతా ఉంది వీళ్ళు పండించిన పంటను మధ్య దళారులకు అమ్ముకొని మద్దతు ధర రాక ఇబ్బంది పడతా ఉన్నారు అసలే అకాల వర్షం కురవడం వలన పత్తి పంట తీవ్రంగా నష్టపోయినది పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై విలవిలాడుతున్నారు ప్రభుత్వం మాత్రం వీళ్లకు ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన దాఖలు కానరావడం లేదు తక్షణమే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పైసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ ఏఐసి సిటీ యు జిల్లా కార్యదర్శి కన్నూరి డానియల్ అనిల్ రాజేష్ పాల్గొన్నారు

నష్టపోయిన రైతుల కోసం తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన భాజపా నాయకులు

నష్టపోయిన రైతులను రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు

కరీంనగర్: నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామడుగు మండల కేంద్రంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈసందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ మాట్లాడుతూ మోంథ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాల కారణంగా మండలంలోని రైతుల పంటలు నష్టపోయి, కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు మొదలుపెట్టక అనేక రైతుల ధాన్యం తడిసిపోయి, వరదల్లో కొట్టుకోపోవడం, వరి, మొక్కజొన్న, పత్తి రైతులు కూడా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కారుపాకల అంజిబాబు,మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల అధ్యక్షులు దుర్శేట్టి రమేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, షేవెళ్ల అక్షయ్, మాదం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, బూత్ కమిటీ అధ్యక్షులు ఉత్తేమ్ కనుకరాజు, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రే షియా ప్రకటించాలి

*బిజెపి మండల అధ్యక్షుడు
నరహరిశెట్టిరామకృష్ణ*

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్య క్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మండల పరిధిలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పత్తి, మొక్కజొన్న, మరియు వరి పంటలు తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశె ట్టి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన మాట్లాడుతూ రైతు కష్టానికి విలువ ఇచ్చే ప్రభు త్వం కావాలి కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైపో యింది. వేలాది ఎకరాల్లో పంటలు నాశనం అయినా, ఇప్పటివరకు ఎలాంటి పంట నష్ట నివారణ చర్యలు తీసు కోలేదని ప్రభుత్వం రైతుపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు. బిజెపి తరఫున డిమాండ్లు ప్రతి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం తక్షణం ప్రకటించాలి, పంట బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి,రాబోయే పంట సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి, నష్టపోయిన గ్రామాలను సర్వే చేయించి మండలాన్ని దుర్ఘట ప్రభావిత మండలంగా గుర్తించి రాష్ట్ర బృందం ద్వారా అంచనా వేయించాలి.ప్రభుత్వం స్పందించకపోతే, బిజెపి రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రైతు అన్నదాత అతనిని రక్షించడం ప్రభుత్వ ధర్మం. ఈ ధర్మాన్ని విస్మరించిన ప్రభుత్వా నికి రైతులు తగిన గుణపాఠం చెబుతారు. బిజెపి ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుందని
రైతుల కష్టాన్ని గుర్తించని ప్రభుత్వం, ప్రజల కష్టాన్ని ఎలా గుర్తిస్తుందని తెలపడం జరిగింది.

తుఫాన్ తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి…

తుఫాన్ తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:*

తుఫాన్ కారణంతో వివిధ రకాల పంటలు నష్టపోయిన రైతులను రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మిపురం,నాచినపల్లి,చాపలబండ గ్రామాలలో పర్యటించారు.అలాగే పంటలను పరిశీలించారు.కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంటలు చేతికందే దశలో తుఫాన్ తీవ్రత వలన నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈ నేపథ్యంలో వరి,అరటి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ పరిస్థితులలో ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకొని భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చల్ల నరసింహారెడ్డికొంగర నరసింహస్వామి, అక్కపెళ్లి సుధాకర్, కోడెం రమేష్, గొర్రె సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నేలపాలు ..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T121956.242.wav?_=1

 

అకాల వర్షంతో అపార నష్టం చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నేలపాలు ..

◆:- ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వేడుకలు ..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొంథా భారీ తుఫాన్ కారణంగా శుక్రవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలకు జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో రైతులు కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాను కారణంగా నీటిపాలు కావడంతో కన్నీరు మున్నీరుగా తమ విలపిస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంట చేతికి రావడంతో కురుస్తున్న వర్షాలకు మొలక ఎత్తే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి వర్షం కారణంగా నేత మరణంతో రైతుల కోసం అంత ఇంత కాదని చెప్పాలి తుఫాన్ చాలా వేగంగా వహించి మండల రైతులను పెద్ద మొత్తంలో ఊబిలోకి నెట్టింది భారీ వర్షాల కారణంగా జనం జీవితాలను దెబ్బతీస్తూ పల్లె ప్రాంతాల్లో విస్తృతంగా పంట పొలాలను నాశనం చేసింది వరి పత్తి మిరప పంటలు తుఫాన్ తో పాటు గాలి వర్షం ముప్పుతో కిందపడిపోవడం వలన రైతులకు భారీగా హార్దిక నష్టం కలిగింది.

◆:- పత్తి రైతు సుల్తాన్ సలావుద్దీన్ ఈదులపల్లి గ్రామం

రైతులు మమ్మల్ని ‌ప్రభుత్వం ఆదుకోవాలని ఈదులపల్లి చెందిన రైతు సుల్తాన్ సలావుద్దీన్ మాట్లాడుతూ.భారీ తుఫాన్ కారణంగా పంట నష్టపోయామని రైతులు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మండల వ్యాప్తంగా ఉన్న రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో వ్యవసాయ సాగుకు వేలాది రూపాయలు అప్పు తెచ్చి సాగు చేశామని వడ్డీ మందం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు…

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

 

రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సిడ్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఈవి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో వరి (జేజిఎల్ – 24423) పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి అనే రైతు తన అనుభవాన్ని, జేజిఎల్-24423 రకంలో విత్తనోత్పత్తి గురించి తను తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల, తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించిన అనంతరం శాస్త్రవేత్తలు డా.జి.ఉషారాణి, ఇ.ఉమారాణిలు మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగీస్తామని వారి సుముఖతను అధికారులకు తెలియజేశారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

చౌటుప్పల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలోఏర్పాటుచేసినటువంటి నక్కలగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సంఘ పి ఐ సి చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున రైతులు తమ ధాన్యరాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డులకు తమ పాన్ నెంబర్లకు లింక్ చేయించుకోవాలని తెలిపారు .కొనుగోలు ప్రారంభం అయినందున రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని తాలు పట్టుకోవాలని సూచించారు. అధికారులు సూచించిన పరిమితులు లోబడి ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సంఘం డైరెక్టర్ కృష్ణ, ఏఈఓ సౌమ్య, రైతులు జంగయ్య, వై బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి ,శ్రీశైలం ,కార్యదర్శి వై రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి

వరంగల్ జిల్లా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి

 

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.శుక్రవారం హన్మకొండలోని డిసిసిబి భవన్ ఆడిటోరియంలో జెడ్పి సీఈఓ, ఇంచార్జి డిఆర్డీఓ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా సహకార అధికారి నీరజలతో కలిసి వరంగల్ డివిజన్ లో వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక,శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025 -26 సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని,కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయకూడదని, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లు, తేమ శాతాన్ని నిర్ధారించేయంత్రాలు సమకూర్చడం జరుగుతుందని,సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేసి నిల్వ చేయాలని, కొనుగోలు సమయంలో ఎప్పటికప్పుడు ధాన్యం, రైతుల వివరాలను ట్యాబ్ లలో నమోదు చేయాలని, రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తూ రైతుల వివరాలు నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, నీడ, వైద్య వసతి తదితర మౌలిక వసతులు కల్పించాలని, తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తమ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలుకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గన్ని సంచులు రైతులకు అందించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని ,ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షించాలని, కొనుగోలు ప్రక్రియలో భాగంగా తేమశాతం యంత్రాలు, టార్పాలిన్లు, త్రాగునీరు, నీడ తదితర విషయాలకు సంబంధించి పి.సి.ఎస్.ఎ.పి. యాప్, గన్ని సంచుల నిర్వహణ కోసం మేనేజ్మెంట్ యాప్, పట్టాదారు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఆధార్, మొబైల్ నెంబర్ నిర్వహణపై ఓ.పి.ఎం.ఎస్. యాప్ లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

Efficient Rice Procurement in Warangal District

 

ప్రభుత్వం వరి ధాన్యం కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2 వేల 389 రూపాయలు, సాధారణ రకానికి క్వింటాలుకు రూ .2 వేల 369 లుగా నిర్ణయించడం జరిగిందని, సన్న రకం వడ్ల కు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, జిల్లాలో టాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు మాత్రమే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయబడిన రైతుల పంట సాగు డేటా ప్రకారం మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, హార్వెస్టర్ వినియోగ సమయంలో ఆర్ పి ఎం 18-20 ఉండేలా పర్యవేక్షించాలని, ఇలా నిర్దేశిత వేగంతో వినియోగించినట్లయితే తాలు పోయి నాణ్యమైన ధాన్యం వస్తుందని ,హార్వెస్టర్ యంత్రాల వినియోగ సమయంలో నిబంధనలను పాటించాలని, కోతకు వచ్చిన తర్వాత మాత్రమే పంట కోయాలని, బ్లోయర్ యాక్టివ్ మోడ్ లో ఉండాలని ,రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 48 గంటలలో సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Efficient Rice Procurement in Warangal District

 

కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన ప్యాడి క్లీనర్లను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు,సీఓలు, డిఆర్డీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..
– ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

రైతులకు తప్పని… యూరియా తిప్పలు..

రైతులకు తప్పని… యూరియా తిప్పలు..

#రాత్రి వేళలో యూరియా కోసం రైతులపడి గాపులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

గత నెల రోజులుగా మండలంలో యూరియా కోసం రైతుల అగచాట్లు సమసిపోవడం లేదు. ఈసారి మండలంలో అత్యధికంగా మొక్కజొన్న, వరి పంటల సాగు గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడంతో పంటలకు అధిక మొత్తంలో యూరియా వాడకం ఉండడంతో రైతులు యూరియా బస్తాల కోసం నాన ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరగడంతో రైతులు వ్యవసాయ పనులన్నీ పక్కనపెట్టి. వేకువ జాము నుండే యూరియా బస్తా కోసం ప్రభుత్వ ఆగ్రోసుల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూ లైన్ లో నిలబడి పడి గాపులు కాస్తున్నారు. రాత్రి వేళలో సైతం కేంద్రాల వద్ద రైతులు పడుకున్న సంఘటనలు సైతం ఉండడం గమనార్వం.

#యూరియా కొరత లేదు.

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వశాఖ సంబంధిత అధికారులు సైతం రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియాను అందించడం జరుగుతుందని చెప్పినప్పటికీ అది మాటలకే పరిమితం అవడం తప్ప ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని ప్రతిపక్ష పార్టీలు, రైతులు గగ్గోలు పెడుతున్న యూరియా కొరత నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రైతులు వాపోతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులతో ఎలాంటి సమీక్షలు జరపకుండా గాలికి వదిలేయడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ప్రజా సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు రైతులు పడుతున్న కష్టాలను గమనించి పంటలకు సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

కంది,వరి పంటలను సందర్శించిన శాస్త్రవేత్తలు…

కంది,వరి పంటలను సందర్శించిన శాస్త్రవేత్తలు

యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచనలు

పరకాల,నేటిధాత్రి

 

 

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమంలో భాగంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, డాక్టర్.ఎల్.కృష్ణ,శాస్త్రవేతలు డాక్టర్ భార్గవి,డాక్టర్.పద్మజ
ల బృందం శుక్రవారం నాడు పరకాల క్లస్టర్ మాదారంలో గల వరి,కందుల పంటలను సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు శాస్త్రవేత్తలు రైతులకి వరి మరియు కంది పంటలో విత్తనోత్పత్తిలో చేపట్టవలసిన మెలకువల గురించి మరియు సేంద్రియ ఎరువులు వాడకం పెంచుకుని యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతుల కి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పరకాల క్లస్టర్ మాదారం విస్తరణ అధికారి శైలజ,రైతులు పాల్గొన్నారు.

నిజాంపేటలో సుమారు వెయ్యి…

నిజాంపేటలో సుమారు వెయ్యి
ఎకరాలు పంట నష్టం..
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

గత రెండు రోజుల కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండల వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బచ్చురాజుపల్లి, రజక్ పల్లి, నందిగామ, జడ్చర్ల తాండ గ్రామాల్లో పంటను పరిశీలించడం జరిగిందన్నారు. మౌనిక శ్రీలత, రమ్య ఉన్నారు.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని సి.పి.ఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముషాం రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగినది. అని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. అన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సి.పి.ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది
ప్రతి సీజన్లో పంట పండించిన రైతుకు మొత్తం పంట ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా పంటకు ఎప్పుడు ఏమైతదో అని భయం గుప్పిట్లో బతకవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రైతుల రైతుల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదు.
బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల. జెండాలు వేరైనా మోసాలు ఒకటే. విధానాలు ఒకటే రైతే రాజు అని
రైతులను మోసం చేసి రైతుల ఓట్లతో అధికారం లోకి వస్తున్నాయి. రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళిక చేయకపోవడంతోనే ప్రతి పంట సీజన్ లో వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.ఇప్పటికైనా రైతులకు నష్టాలు జరగకుండా పండిన పంటను వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ పాల్గొన్నారు

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి.

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి

భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయములో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలి ఎమ్మెల్యే చెప్పారు

మాటలకు చేతులకు సంబంధం లేకుండా ఒక్క బస్తకు రెండు మూడు కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి

గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు

మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నడు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐకెపి సెంటర్ల లో ఉన్న వరి ధాన్యాన్ని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ధర్మ సమాజ్ పార్టీ గణపురం మండలాధ్యక్షుడు కుర్రి స్వామినాదన్ గార్లు పరిశీలించడం జరిగింది రైతులకు శాశ్వతమైన సిమెంట్ కల్లాలు లేక అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి రైతులు బాధపడుతున్నారు ప్రతి గ్రామంలో పంట దిగుబడి నీ దృష్టిలో పెట్టుకొని మూడు నుంచి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి కాంక్రీట్ సీసీ కల్లాలను నిర్మాణం చేయాలి వేలకోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు కల్లాల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు ఇలానే చేస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో రైతులందరూ రోడ్లమీద వడ్లు ఎండ పో సుకోవలసిన పరిస్థితి వస్తుంది ప్రతి కళ్ళం ప్రారంభోత్సవ సమయంలో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే పెట్టాలని ఎమ్మెల్యే చెప్పారు మాటలకు చేతలకు సంబంధం లేకుండా ఒక బస్థకు 2,3 కిలోల వడ్లు కటింగ్ అవుతున్నాయి ఇది వాస్తవం గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నారు మిల్లర్లు పాలకులు చేసే మోసం వల్ల ఒక ఎకరం పంట వేసిన రైతు 4500 వరకు నష్టపోతున్నాడు అయినా దీన్ని ప్రజా పాలన అంటున్నారు ప్రజలను దోపిడీ చేసే పాలన ప్రజాపాలన ఎట్లా అవుతుంది వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి. అలాగే అధికారాన్ని అండగా చేసుకొని బుర్రకాయల గూడెం నగరంపల్లి గ్రామాల్లో జరిగిన అవకతవకలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఎంపీడీవో ఎమ్మార్వో గ్రామపంచాయతీ కార్యదర్శి చిట్యాల వ్యవసాయ. మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ చిట్యాల డైరెక్టర్లు అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించిన.

గాంధీనగర్ లో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జి.ఎస్.ఆర్

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపో కుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకరాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా నిర్వాహ కులు తగిన ఏర్పాట్లు చేయా లని ఎమ్మెల్యే తగు సూచనలు ఇచ్చారు వివిధ శాఖల అధికా రులకు ఆదేశించారు. కొనుగో లు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారు లు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

గణపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు

వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయాలి

వరి ధాన్యం కొనే సెంటర్లో వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలల్లో కన్య బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీ ల ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, గణపురం మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఎండి చోట మియా మొలంగూరి రాజు అశోక్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, ఎమ్మార్వో ఎంపీడీవో కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version