సుందరయ్యనగర్ గౌస్ కబ్రస్థాన్ నూతన కమిటీ ఏర్పాటు…

సుందరయ్యనగర్ గౌస్ కబ్రస్థాన్ నూతన కమిటీ ఏర్పాటు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ ఏనుమాముల మార్కెట్, మిర్చి యార్డు వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ వసీం, మహమ్మద్ సలీంలా ఆధ్వర్యంలో మైనార్టీల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో సుందరయ్యనగర్ లోని కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కొరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిఎకైన వారిలో కమిటీ గౌరవ అధ్యక్షుడుగా అబ్దుల్ ఖయ్యూం, అధ్యక్షుడిగా మహమ్మద్ ఆజం ఖాద్రి( బబ్బు ), ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ సలీం సయ్యద్ అఫ్జల్, కోశాధికారిగా షేక్ ఉమర్, ఉప కోశాధికారిగా మహమ్మద్ జావిద్, సహాయ కార్యదర్శులుగా ఎండి మహబూబ్, షేక్ జావిద్, ముఖ్య సలహాదారుగా సయ్యద్ వసీం, గౌరవ సలహాదారులుగా ఎండి సాబీర్, జహీర్ భాష, అక్బర్, షేక్ యాకూబ్, కార్యవర్గ సభ్యులుగా షేక్ అబ్జల్, ఎండి గౌస్, ఫెరోస్, సోహెల్, ఫరీద్ బాబా, ఆరిఫ్, ముజాహిద్, ముస్తఫా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్…

టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్
మెట్ పల్లి సెప్టెంబర్ 23 నేటి దాత్రి

 

మెట్ పల్లి పట్టణం: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన కోరుట్ల అసెంబ్లీ నియిజకవర్గ లీగల్ సెల్ కమిటీ సభ్యులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు నియామక ఉత్తర్వులను అందించారు. కన్వీనర్ గా సీనియర్ న్యాయవాది ఎం.డి.రజాక్, కో కన్వీనర్లుగా కస్తూరి రమేష్, మన్నే గంగాధర్, జాయింట్ కన్వీనర్లుగా వంగవేణు, నేరెళ్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీ గా నల్ల రాజేందర్, జాయింట్ సెక్రెటరీలుగా గజ్జి గంగారాం, మద్దుల రోజా లకు నియామక ఉత్తర్వులు అందించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం ల సూచన మేరకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక ఉత్తర్వులు పంపినట్లు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, సీనియర్ న్యాయవాది కోటగిరి వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్బంగా నియామక ఉత్తర్వులు అందుకున్న న్యాయవాదులు వారి నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, ఏజిపి అబ్దుల్ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం, కార్యదర్శి రాంప్రసాద్, న్యాయవాదులు తెడ్డు ఆనంద్, సురక్ష, కోటగిరి చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T124445.869-1.wav?_=1

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంశంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజల సందర్భంగా వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ ను ఆలయ కమిటీ నిర్వహికులు ఆహ్వానించారు ఈమేరకు సుమన్ దంపతులను సన్మానం చేశారు ఈసందర్భంగా ఆలయ కమిటీ నిర్వహికులను సుమన్ అభినందించారు ఈకార్యక్రమంలో చిట్యాల నాగరాజు దాచ లక్ష్మినారాయణ గోనూర్ రామకృష్ణ దాచశివ తదితరులు పాల్గొన్నారు

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్…

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఆలయ ట్రస్ట్ బోర్డులో యాదవులకు చోటు కల్పించాలి…

ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో యాదవులకు చోటు కల్పించాలి
ఐలోని మల్లన్న స్వామిని యాదవులు కులదైవంగా కొలుస్తారు
స్వామివారి సేవకు యాదవులను దూరం చేసే కుట్ర జరుగుతుంది
అందుకే యాదవులకు ట్రస్ట్ బోర్డులో చోటు ఇవ్వలేదు
స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని యాదవులకు చోటు కల్పించాలి
జి ఎం పి ఎస్ మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

 

అయినవోలు మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా కొలువుదీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంలో స్థానిక యాదవులను గుర్తించకపోవడం స్థానిక యాదవులను అవమానపరచడమేనని జి.ఎం.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు విమర్శించారు. శుక్రవారం ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అయినవోలు మండలంలో అయినవోలు గ్రామానికి చెందిన గత పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా యాదవులను గుర్తింపు లేకుండా అవమానపరుస్తున్నారని నల్లబెట్ట రాజు యాదవ్ ఆవేదన వ్యక్తపరిచినారు. మేము ఓట్ల బ్యాంకు వరకేనా, కనీసం నామినేట్ పోస్టులకు కూడా అర్హత లేకుండా పోయినామా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి యాదవులను గుర్తించి ట్రస్ట్ బోర్డులో కనీస గౌరవప్రధ స్థానాలనైనా స్థానిక యాదవులకు కేటాయించాలని చినరాజు విజ్ఞప్తి చేసినారు.

సకల కళల పరిరక్షణ జేఏసీ జిల్లా

సకల కళల పరిరక్షణ జేఏసీ జిల్లా కమిటీ ఎన్నిక

కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ పాషా

పరకాల నేటిధాత్రి
శుక్రవారం రోజున పట్టణంలోని ఎఫ్జె గార్డెన్లో హనుమకొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కళాకారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం ఆయా మండలాల నుంచి హాజరైన వారితో హన్మకొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సకల కళల పరిరక్షణ జేఏసీ హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ పాషా, ప్రధాన కార్యదర్శిగా దండు సారంగపాణిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మహమ్మద్ అక్బర్ తెలిపారు.సకల కళల పరిరక్షణ జేఏసీ ఉపాధ్యక్షులుగా మల్లయ్య , బాబురావు,బుచ్చయ్య,సహాయ కార్యదర్శులుగా, రమేష్,సమ్మయ్య రాజయ్యాలను ఎన్నుకున్నారు.కోశాధికారిగా కొండ సమ్మయ్య,ప్రచార కార్యదర్శిగా బొందయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోగా 9 మందిని కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అక్బర్ పాషా,దండు సారంగపాణిలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు.

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

 

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ని ఎన్నిక చేయడం జరిగింది.ఈ కమిటీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు దుప్పటి మొగిలి మాదిగ ఆధ్వర్యంలో మండల ఇన్చార్జీలు చిలువేరు సంపత్ మాదిగ కో ఇన్చార్జి మేకల రవి మాదిగ ముఖ్య అతిథులుగా వచ్చి మాట్లాడడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ పెరగాలని తేదీ 7 8 2025 రోజున హనుమకొండలో జరగబోవు సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మండల నూతన కమిటీ కన్వీనర్ గా సంగాల సుమన్ మాదిగ, కోకన్వీనర్ గా దుప్పటి ప్రవీణ్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మొగిళి మాదిగ, సురేందర్ మాదిగ,రాజయ్య మాదిగ,దేవమని మాదిగ, సుమన్ మాదిగ,మోహన్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ

బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కమిటీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని పూల దుకాణాల బాలాజీ ఫ్లవర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా నూతన కమిటీ సభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.నూతన కమిటీ అధ్యక్షుడు పర్ష శ్రీనివాస్ ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శి బానోత్ పంతుల్ నాయక్,కార్యదర్శి కోల వెంకటే శ్వర్లు,కోశాధికారి భయ్యా కర్ణాకర్,కమిటీ సభ్యులు పర్ష వెంకన్న, పుల్లయ్య,శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 3 వ. మహాసభలు సిరిసిల్ల పట్టణంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర నాయకత్వం సమక్షంలో 21 మందితో నూతన కమిటీనీ ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికల్లో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా – ముశం రమేష్,అధ్యక్షులుగా, శ్రీరాముల రమేష్ చంద్ర,
ప్రధాన కార్యదర్శిగా,సూరం పద్మ,కోశాధికారిగా – జిందం కమలాకర్,ఉపాధ్యక్షులుగా దాసరి రూప , కావేటి సత్యం,లక్ష్మణ్ కార్యదర్శిలుగాబెజుగం సురేష్ ,బోనాల లక్ష్మి , కీసరి పుష్పల,కమిటీ సభ్యులుగా మాడుగుల మల్లయ్య , గట్ల సప్న , లింగంపల్లి జ్యోతి,గురజాల మమత, సులోచన,
వాణి,మానస తదితరులను ఎన్నుకోవడం జరిగినది.ఈ సందర్భంగా సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ నూతన కమిటీగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసి రాబోయే కాలంలో జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ₹4,000 పెన్షన్ అమలు కొరకై అదేవిధంగా బీడీ కంపెనీ యజమాన్యం బీడీ కార్మికుల శ్రమను విపరీతంగా దోపిడీకి పాల్పడుతుందని కార్మికులు పనిచేసినటువంటి బీడీల నుండి 2500 బీడీల కూలీని దోచుకోవడమే కాకుండా దీనితో పాటు అనేక రకాల కోతల పేరుతో కార్మికుల వేతనాల నుండి నెలకు దాదాపు ₹1000 రూ!! ల వరకు కట్ చేయడం జరుగుతుందన్నారు.
బీడీ పరిశ్రమ మరియు కార్మికుల పట్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బీడీ కంపెనీల యజమాన్యాలు చేస్తున్న దోపిడీపై కార్మికులను ఐక్యం చేసి రాబోయే కాలంలో నూతన కమిటీ పనిచేస్తుందని అన్నారు.కార్మికులందరూ కంపెనీ యజమాలకు,టేకేదారులకు భయపడకుండా ఐక్యం కావాలని సంఘం కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల నియామకం..

*మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల నియామకం *

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T114528.955.wav?_=2

* మహాదేవపూర్ జులై 28( నేటి ధాత్రి *

జయశంకర్ జిల్లా కాటారం మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ నియమించడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపీట వేశారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు మహాదేవపూర్ ఉమ్మడి మండలానికి ఐదు డైరెక్టర్ పదవులులభించాయి మండల కేంద్రానికి చెందిన ఇర్ఫాద్ అహ్మ ద్, పోత రామకృష్ణ తో పాటు మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ముల్కల శ్రీనివాస రెడ్డి చండ్రు పెళ్లి కి చెందిన గోమాస సడవలి పలిమల మండలం నుండి దాసరి సంతోష్ లకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు దీంతో ఉమ్మడి మండల వ్యాప్తంగా హర్ష వ్యక్తం చేస్తున్నారు తమ నియమకానికి సహకరించిన రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శీను బాబుకు కృతజ్ఞతలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక..

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 21:

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ను వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్, ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా పలమనేరుకు చెందిన కత్తి శ్రీనివాసులు అధ్యక్షులు గా కే నాగరాజు విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా కె, శివ కుమార్ కార్యదర్శి వి రమేష్ ట్రెజరర్ శ్రీనివాసులు ఈసీ మెంబర్స్ ఏకనాథ్, పి రమేష్, గిరిబాబు,ఆర్ కృష్ణప్ప, సి మురగయ్య ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులు, దళితుల హక్కుల పట్ల నిర్లక్ష్య వైఖరి పై పటిష్టమైన అవగాహన కలిగి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఈ కమిటీలో ఎంపిక చేయడం జరిగిందని రాబోవు రోజుల్లో చిత్తూరు జిల్లా లో ఎక్కడ దళితులపై దాడులు జరిగిన వారి హక్కులను కలరాల్సిన తక్షణమే ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని తెలిపారు అధ్యక్షులుగా ఎన్నికైన కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తూ దళిత వివక్షతను అదేవిధంగా వారి హక్కులను భంగం కలిగించే ఎక్కడైనా సరే ఈ కమిటీ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు, అతి త్వరలో పలమనేరు లో భారీగా సభ ఏర్పాటు చేసి దళిత హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేస్తామని కూడా ఆయన తెలిపారు..

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుగా గన్న రాజేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్స్,మంచిక హరీష్,పెండ్యాల స్వామి,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,అధికార ప్రతిధులుగా బుస శ్రీశైలం,దారావత్ మహేందర్,ఉపాధ్యక్షులు భాషబోయిన ప్రవీణ్,కర్దూరి హరీష్,కొంగర మురళీ,ఆల్లె రాజు,గజ్జి రాము,సహాయ కార్యదర్శులు జినుకల అఖిల్,పుట్ట అఖిల్,బయ్య నవీన్,చెరిపెల్లి రాజు,కోశాధికారి అజ్మీర నరేష్,కార్యవర్గ సభ్యులు చిలుక నరేందర్,దరావత్ రాజు,వాంకుడోతు అక్షయ్ కుమార్,
మోటం హరీష్,నునావత్ పవన్ కుమార్,భూక్య సుమన్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు.మండలం లోని అన్ని గ్రామాల నుండి ఎన్నిక చేయడం జరిగిందని మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,క్లస్టర్ ఇన్చార్జి మోటురి రవి,సీనియర్ నాయకులు బోల్లం బక్కయ్య,గడ్డం రాజు,బగ్గి రాజు,జై కిసాన్,బాణోత్ రవి,చిప్ప ప్రశాంత్,సమ్మెట రంగయ్య తదతరులు ఉన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా కమిటీ.!

 

భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

మంచిర్యాల జులై19 నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం భారతీయ మజ్దూర్ సంఘ్ మాజీ జిల్లా అధ్యక్షులు లగిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా పాత కమిటీని రద్దుచేసి, జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి  భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీని ప్రకటించడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా కుంటాల శంకర్, జిల్లా కార్యదర్శిగా మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా కిషన్ రెడ్డి, నీరటి సురేష్, సగ్గుర్తి ఆనందరావు, కోశాధికారి గగ్గూరి విశాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నాకర్ మహానంద్, సహాయ కార్యదర్శుగా, శశి,కొండు రాజేందర్, శాంతం సంపత్, కార్యవర్గ సభ్యులు,కోరకాని తిరుపతి ,కళ,సహజ,లను ఎన్నుకోవడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ బి.ఎమ్.ఎస్. జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు మరియు జిల్లా కమిటీ సభ్యులకు, కృతజ్ఞతలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘము (బి.ఎమ్.ఎస్)ను బలోపేతం చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి బి.ఎమ్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంది శ్రీనివాస్, జాతీయ నాయకులు మండ రవికాంత్, కన్స్ట్రక్షన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, మరియు జైపూర్ పవర్ ప్లాంట్,దేవాపూర్ పవర్ ప్లాంట్,సింగరేణి బొగ్గుగని కాంటాక్ట్,భవన నిర్మాణ, సంఘటిత, అసంఘటిత కార్మికులకు,పాల్గొన్నారు.

యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక.

తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్. ప్రధాన కార్యదర్శి ముందటి తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో. మండలంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో గౌరవ అధ్యక్షులుగా ఆత్మకు చంటి యాదవ్. ఉపాధ్యక్షులుగా మెడ కొక్కుల చరణ్ యాదవ్. కోశాధికారిగా మోతే మహేష్ యాదవ్. కార్యదర్శిగా చె న్నవనేని తిరుపతి యాదవ్. సహాయ కార్యదర్శులుగాబో ల్ల వేణి ఎల్లం. ప్రచార కార్యదర్శులుగా గుట్ల ఐలయ్య. దొంతుల ఆంజనేయులు. అరకుటి మహేష్. కొత్తపల్లి శ్రీనివాస్. వినవేని మల్లేశం. కార్యవర్గ సభ్యులుగా.. ఉడతల కుంటయ్య. దొంతుల ఆంజనేయులు చంద్రము. దొరగొ రాజేశం. త్యాగ దేవయ్య. జగ్గాని రాజేశం. తిరుపతిలు. ఏకగ్రీవంగా నీ ఎన్నుకున్నారని ఈ కార్యక్రమం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని యాదవ సంఘం కార్యాలయంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన ప్రకటించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి ముందర తిరుపతి యాదవ్ మాట్లాడుతూ. యాదవ సంఘం బలోపేతానికి అభివృద్ధికి. నిరంతరం కృషి చేస్తామని పేర్కొంటూ యాదవులందరూ. ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు అనంతరం. తేదీ. 20వ . 07.2025. రోజున నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని. దీనికి మండలంలోని యాదవ కురుమ సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.

కరకగూడెం,,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామంలో మహా జననేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ కరకగూడెం మండల ఇన్చార్జి బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. మహా జననేత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 7వ తేదీన సోమవారం నాడు ఎమ్మార్పీఎస్31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ పతాక ఆవిష్కరణ, మంద కృష్ణ మాది జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మందకృష్ణ మాదిగ ఏ పిలుపు ఇచ్చిన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఇల్లందుల సత్యం మాదిగ. ఉపాధ్యక్షులుగా ఇల్లందుల కృష్ణ మాదిగ. కార్యదర్శి ఇల్లందుల యేసు మాదిగ. ప్రధాన కార్యదర్శి ఇల్లందుల నరేష్ మాదిగ. సహాయ కార్యదర్శి వెంకటేష్ మాదిగ. ట్రెజరర్ ఇల్లందుల సమ్మయ్య మాదిగ. కమిటీ సభ్యులు సోమిడి వినోద్ మాదిగ. ఇల్లందుల శ్రీను మాదిగ. ఇల్లందులో నరసయ్య మాదిగ. ఇల్లందుల అర్జున్ మాదిగ. ఇల్లందుల సుకుమార్ మాదిగ. ఇల్లందుల సంతోష్ మాదిగ లను ఎన్నుకోవడం జరిగింది.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే సభను విజయవంతం చేయాలి.

‌గ్రామ శాఖ అధ్యక్షులు క్యాతరాజు రమేష్

* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ‌.

 

 

 

 

జులై 4న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ‌ దేశంలోనే తొలిసారిగా గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున కరిగే నేరుగా ముఖాముఖి సమావేశం కానున్నారని మొగుళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సభను విజయవంతం చేయాలని తెలిపారు ఇదే మొదటి ప్రయత్నంగా ఈ ఈ వినూత కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రాన్నే తొలి గౌరవం దక్కినట్లు అని ఆయన తెలిపారు ఈ తరహా కార్యక్రమాలను అనంతరం దేశవ్యాప్తంగా విస్తారించనున్నట్లు వివరించారు ఇంతటి ముఖ్యమైన సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని తెలిపారు ముఖ్యంగా గ్రామ శాఖ అధ్యక్షులు మొగలపల్లి మండల పరిధిలోని గ్రామ శాఖ అధ్యక్షులు మండల సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు సమన్యాయంతో సభకు హాజరై విజయవంతం చేయాలని ఖర్గేతో ప్రత్యక్షంగా మాట్లాడే అరుదైన అవకాశం ఇది అందరి బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు.!

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు ఇవ్వాలి

మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి

 

 

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్ల లకు 25% సీట్లు కేటాయించి, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించారు.విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 121సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను
కేటాయించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చొరవతిసుకొని ప్రైవేట్ స్కూల్ లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాలరావుపేట వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగినది. అధ్యక్షులుగా రాంపల్లి శ్రీనివాస్ కార్యదర్శిగా పాకాల మోహన్, కోశాధికారిగా గొడుగు అంజయ్యలను ఎన్నుకున్న అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర బద్రేషం, రీజియన్ చైర్మన్ కొల్లూరి జితేందర్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ మైక్రో కాబినెట్ మెంబెర్ గోలి మధుసూదన్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ కర్ర శ్యాంసుందర్ రెడ్డి, కోచైర్మన్ కొడిమ్యాల వెంకటరమణ, రీజియన్ సెక్రెటరీ యం.మల్లేశం, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, మచ్చ గంగయ్య, మోర కేత, శారద, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం.

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం

సిరిసిల్ల టౌన్(నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిని గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ శాఖ నూతన బిజెపి కార్యవర్గం నియమించడం జరిగినది. ఇందులో భాగంగా ఉపాధ్యక్షులుగా మోర శ్రీహరి మరియు అంకారపు రాజు, కాంభోజ శ్రీధర్, పల్లికొండ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండ సురేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులుగా కోడంతవి సురం వినయ్ పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోశాధికారిగా ఇoజపురి మురళి బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖగా నియమితులయ్యారని జిల్లా బిజెపి అధ్యక్షుడు తెలిపారు.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బీసీ హక్కుల సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు టి వెంకట్ రాములు తెలిపారు అధ్యక్షులుగా భీమనాథుని సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా క్యాతరాజు సతీష్ అస్లాం
జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్ గోలి లావణ్య.
జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి…

 

Election

 

జిల్లా కార్యవర్గ సభ్యులుగా
రమేష్ చారి,మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version