పోలింగ్ కేంద్రాల జనరల్ అబ్జార్వర్ పరిశీలన..

పోలింగ్ కేంద్రాల జనరల్ అబ్జార్వర్ పరిశీలన

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:

 

రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల పరిశీలకులు బాల మాయాదేవి వరంగల్ జిల్లాలోని సంగెం,గీసుగొండ, దుగ్గొండి,నల్లబెల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా గీసుగొండ, సంగెం, నందిగామ, దేశాయిపల్లె, నల్లబెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు

చేశారు.నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు వారివెంట ఉన్నారు.

పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీలించిన కలెక్టర్..

పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీలించిన కలెక్టర్

సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:

 

గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం
గీసుకొండ మండలంలోని గీసుకొండ, గంగాదేవిపల్లి పోలింగ్ కేంద్రాలు,దుగ్గొండి మండలంలోని వెంకటాపూర్, దేశాయిపల్లి పోలింగ్ కేంద్రాలు, నల్లబెల్లి మండలంలోని
నల్లబెల్లి సుమంగళి ఫంక్షన్ హాల్, నందిగామ పోలింగ్ కేంద్రాలు,సంగెం మండలం సంగెం జడ్పీ హై స్కూల్, మొండ్రాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరిత ( గ్రీన్) పోలింగ్ కేంద్రాలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలలో ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సిబ్బంది డ్యూటీల అమలు, పోలింగ్ సాగుతున్న విధానం, భద్రతా చర్యలు వంటి అంశాలను వివరంగా పరిశీలించారు.

సమర్థవంతమైన పోలింగ్ నిర్వహణకు సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఏ విధమైన నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన, అంతరాయం లేని వాతావరణం కల్పించడం సిబ్బందిపైనున్న ప్రధాన బాధ్యతఅని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల ఖచ్చితమైన అమలు అత్యంత ఔచిత్యం కలదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఎన్నికల సూచనల మేరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి మండలానికి రెండు చొప్పున హరిత (గ్రీన్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటి విడత లో హరిత పోలింగ్ కేంద్రాలలో మిగతా పోలింగ్ కేంద్రాల కంటే 2 నుండి 3 శాతం పోలింగ్ పెరిగిందని కలెక్టర్ తెలిపారు.
రెండవ విడతలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని, 82 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎప్పటికపుడు కలెక్టరేట్ లో
ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుండి కౌటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా వార్డుల కౌంటింగ్ , తర్వాత గ్రామపంచాయతీ లో సర్పంచ్ కౌంటింగ్ జరుగుతుందని వారన్నారు
మేజర్ గ్రామపంచాయతీలలో త్వరగా ఫలితాలు వచ్చేలా ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్వోలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.మొదటి విడతలో 585 వార్డ్ స్థానాలుండగా,ప్రస్తుతం రెండవ విడతలో 906 వార్డు స్థానాలను ఉన్నాయని, కౌంటింగ్ ఫలితాలు త్వరితంగా ఇచ్చుటకు
ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మరియు కౌంటింగ్ జరుగుటకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు.కలక్టర్ వెంట ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓ సుమా, నోడల్ అధికారులు, ఎంపిడీవోలు, తహశీల్దార్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన..

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణలో భాగంగా గురువారం సాధారణ ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి వర్ధన్నపేట మండలంలోని కట్రియాల, ఉప్పరపల్లి, నల్లబెల్లి గ్రామాలు, పర్వతగిరి మండలంలోని వడ్లకొండ, పర్వతగిరి కళ్ళెడం, అన్నారం షరీఫ్ గ్రామాలు, రాయపర్తి మండలంలోని రామన్నగూడెం, మైలారం, కొండూర్, తిరుమలయపల్లి, రాయపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని పరిశీలించారు.ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ బూతులను సందర్శించి పర్యావరణాన్ని పరిరక్షించుటలో భాగంగా హరిత పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడంపట్ల అబ్సర్వర్ అభినందించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పర్యావరణ హిత చర్యలు, ఓటర్లకు అందుబాటులో ఉంచిన సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించి, పోలింగ్ శాంతియుతంగా మరియు సజావుగా సాగేందుకు అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేశారు.
అబ్సర్వర్ వెంట జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version