ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )న్యూస్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్ డీవైఎస్ఓ రామ్ దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, అన్సర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.