వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి
చౌటుప్పల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలోఏర్పాటుచేసినటువంటి నక్కలగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సంఘ పి ఐ సి చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున రైతులు తమ ధాన్యరాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డులకు తమ పాన్ నెంబర్లకు లింక్ చేయించుకోవాలని తెలిపారు .కొనుగోలు ప్రారంభం అయినందున రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని తాలు పట్టుకోవాలని సూచించారు. అధికారులు సూచించిన పరిమితులు లోబడి ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సంఘం డైరెక్టర్ కృష్ణ, ఏఈఓ సౌమ్య, రైతులు జంగయ్య, వై బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి ,శ్రీశైలం ,కార్యదర్శి వై రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.
