ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని…

ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలనిజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి మొత్తం 41 దరఖాస్తులు స్వీకరించామని, వాటిని సంబంధిత శాఖాధికారులకు తక్షణ పరిష్కారానికి ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకోవాలని, సమయానికి చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, పారదర్శకంగా సేవలు అందించాలని అన్ని శాఖల అధికారులను ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, ట్రైని ఉప కలెక్టర్ నవీన్ రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి…

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తారని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్డిసి రమేష్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు శిక్షణ…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు శిక్షణ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పిఓలు, ఏపీవోలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పిఓలు, ఏపీవోలుకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సర్వం సన్నదంగా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనదని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా న నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఆర్ ఓ, ఏఆర్వోలు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరో విడత రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు నిర్వహించిన శిక్షణపై ఎన్నికల సంగం సూచనలు మేరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికలు ఉంటాయని పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్లు సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారని, ఏదేని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ శ్రీనివాస్, సిపిఓ బాబురావు, భూపాలపల్లి ఎంపీడీవో నాగరాజు, ఆర్వోలు, ఏ ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

సాహిత్యం ద్వారా సమాజ మార్పుకు కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజి నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు.
తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న నిర్వహించడం ద్వారా కాళోజి సాహిత్య సేవలను స్మరించుకోవడం గర్వకారణమని, కాళోజి కవిత్వంలో మన భాష, మన భూమి, మన సంస్కృతి ప్రతిబింబించాయని పేర్కొన్నారు. కాళోజి కవి మాత్రమే కాదని, సామాజిక చైతన్యానికి మార్గదర్శకులని కొనియాడారు.
కాళోజి చూపిన మార్గంలో సాగితే మన భాష, మన సంస్కృతి మరింత వెలుగొందుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version