అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం..
#నాడు పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం…
#ఇచ్చిన మాట ప్రకారం 80% పనులను పూర్తి చేయగలిగినం..
#4,53 వ డివిజన్ లలో 92.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
హన్మకొండ, నేటిధాత్రి:
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతు నాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు.
ఈ కార్యక్రమలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ పల్లకొండ సతీష్,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,ఎర్రం మహేందర్ ఆయా డివిజన్ ల అధ్యక్షులు శ్రీధర్ యాదవ్,బాబాయ్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు,అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
