జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమ్మక్క–సారలమ్మ మినీ మేడారం దర్శనం

శ్రీ సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం భూపాలపల్లి మండల పరిధిలోని గుర్రంపేటలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ మిని మేడారం జాతరను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం చెల్లించారు.


జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, పారిశుధ్యం, త్రాగునీరు, వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. జాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఎంపిడిఓ తరుణ్ ప్రసాద్ తదితర అధికారులు, ఆలయ సిబ్బంది, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version