జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్…

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ ఏబీఎన్ రిపోర్టర్ బుర్ర వేణు గౌడ్ కుమార్తె బుర్ర భువనేశ్వరి గౌడ్ దశ దిన ఖర్మ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ ఆమె చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా సలహాదా
రులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్, మోకుదెబ్బ జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,సీనియర్ జర్నలిస్ట్ లు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,ఉగ్గిడి శివుడు,రాష్ట్ర కార్యదర్శి కోండి రాము గౌడ్, తాళ్ల పెళ్లి చంద్ర మౌళి గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్,దొంతి సంతోష్ గౌడ్,కళ్లేపల్లి ప్రణయ్ దీప్,మద్దెల శ్రీనివాస్ గౌడ్,మచ్చిక నర్సయ్య గౌడ్, గౌడ్, బూర కుమార్ గౌడ్ గౌడ్,గోడిశాల గిరినాద్ గౌడ్, వేముల గోపి గౌడ్,సాంబరాతి మల్లేశం, పులి రాజేందర్,బూర సుధాకర్ గౌడ్, బూర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో జర్నలిస్టుల ఉపాధి, సంక్షేమం డిమాండ్

జర్నలిస్ట్ లకు ఉపాధి ఏది?

జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ లకు ఉపాధి లేని పరిస్థితి నెలకొంది.తమ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో జర్నలిస్ట్ ల బతుకులు ఉన్నాయి.ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిజం,ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్ లకు బతుకుదెరువు లేకుండా పోయింది.దేశ ప్రజల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలి.మండల,జిల్లా రిపోర్టర్ లను న్యూస్ కవర్ చేయడానికి ప్రభుత్వ అధికారులు,రాజకీయ నాయకులు ఫోన్లు చేసి మరి చెప్తారు.యాడ్ ఇవ్వమంటే ఇవ్వరు.చులకన చేసి మాట్లాడతారు.నిజాయితీగా బయట జరిగే అవినీతి బయటకు తీసుకొద్దాం అంటే బెదిరింపులు,కొట్టడం,చంపడం జరుగుతుంది.ప్రభుత్వం జర్నలిస్ట్ లకు నెలకు 10000 పెన్షన్ లా అందించాలి.లేదా ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో,సింగరేణి గనుల్లో, ఎన్ టి పి సి,సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లాంటి సంస్థల్లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలి.ఉండడానికి 250 గజాల భూములివ్వాలి లేదా సింగరేణి క్వార్టర్ లలో నివాసం ఉండేలా చూడాలి.ఇకనైనా జర్నలిస్ట్ జీవితాల్లో వెలుగు నింపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

నర్సంపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

నర్సంపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని డివిజన్ ప్రెస్ క్లబ్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు ఉగ్గిడి శివుడు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించగా, గత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కామగోని శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్,దీకొండ తిరుమల, పొన్నగంటి స్వామి, సత్య కుమార్, వడ్లకొండ పవిత్రన్,గట్ల అమర్,పిట్టల కుమారస్వామి, బుర్ర వేణు గౌడ్, మహాదేవుని జగదీష్, వడ్లకొండ రాజ్ కుమార్, ప్రశాంత్, శోభన్ , సిద్దు ఆకారపు స్వామి, శోభన్, కార్తీక్, నరేష్,కామిశెట్టి రంజిత్, ముత్తోజు కిరణ్, రమేష్,ఆకారపు మోహన్,గాదం రవి,మైలగాని సందేశ్, మహమ్మద్ ఇబ్రహీం, జట్టబోయిన సాంబమూర్తి, పోశాల రాంబాబు, జూలూరి నరేష్, జనగాం ప్రవీణ్, ఈదుల కృష్ణ, , బుద్ధరత్నం, పెండ్యాల రమేష్,ఇమ్రాన్,రానా,సునీల్, పాల్గొన్నారు.

పత్రికలపై అవమానాలకు కోడెల నరేష్ నిప్పులు చల్లి

పత్రికలపై బురద జల్లడం సరికాదు

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్

మంగపేట నేటిధాత్రి

 

తప్పుడు పనులకు పాల్పాడే వారి విషయంపై వార్తలు ప్రచురిస్తే పాత్రికేయులకై, పత్రికా యాజమాన్యంపై బురద జల్లడం సరికాదని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. నిర్భయంగా, నికార్సైన వార్తలు ప్రచురిస్తే అధికార పార్టీ అండతో పాత్రికేయులపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంటుందని కానీ కొందరు అధికార అహంకారంతో ఇతరుల హక్కులని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంకి ప్రజలకి వారదిగా ఉంటూ నిత్యం వాస్తవాలు ప్రచురించే పాత్రికేయులపైనే తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని బోర్ నరసాపురం సెంటర్ పై తగు విచారణ జరిపి తప్పు చేసిన వారు ఎవ్వరైనా వారిపై తగు చర్యలు తీసుకొని అన్యాయం గా అమ్ముకున్న ధాన్యం డబ్బులను రికవరీ చేయాలని అన్నారు.

కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాటియుడబ్ల్యూజే హెచ్ 143 జర్నలిస్టు నాయకులు.

కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాటియుడబ్ల్యూజే హెచ్ 143 జర్నలిస్టు నాయకులు.

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందే

భూపాలపల్లి నేటిధాత్రి

 

అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని టీయూడబ్ల్యూజే హెచ్ 143 జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు మంతెన సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 239 జీవో ఆధారంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ న్యాయబద్ధంగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 252 జీవో తీసుకువచ్చి అర్హులైన వారికి అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ జీవో మూలంగా డెస్క్ జర్నలిస్టులకు, నియోజకవర్గ జర్నలిస్టులకు అలాగే ఒక్కో పత్రికకు జనాభా ఆధారంగా ఆయా మండలాలకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కాగా వెంటనే 252 జీవో ను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు ముందు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబాల సంపత్, శేఖర్ నాని, బండ మోహన్, తిక్క ప్రవీణ్, విజయ్ ,రడపాక రమేష్, జగన్,రాజశేఖర్,దేవేందర్,మహేందర్,నరేందర్, మధు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.a

ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T171258.032.wav?_=1

 

ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

నూతనంగా ఎన్నికైన ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సత్కరించారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టులు గడ్డం రాజిరెడ్డి, వల్లాల వెంకటరమణ,తోట సుధాకర్,సంగోజు రవి,టీయూడబ్ల్యూజే ఐజేయూ వరంగల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన శ్రీరాం రాంచందర్,మట్ట దుర్గాప్రసాద్ లను శాలువాలతో సత్కరించి మెమోంటోలతో సన్మానించారు. యూనియన్ కు విశేష సేవలందించి నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్న నల్లాల బుచ్చిరెడ్డిని ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్యలు మాట్లాడుతూ
యూనియన్ బలోపేతం కోసం పనిచేస్తున్న నేతలకు పదవులు రావటం అభినందనీయమని అన్నారు. ఐజేయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే విరహత్ అలీ, రాంనారాయణ గార్ల నాయకత్వంలో రాష్ట్రంలో జర్నలిస్టుల అభ్యున్నతి కోసం కోసం పనిచేస్తున్న యూనియన్ టీయూడబ్ల్యూజే ఐజేయూ మాత్రమేనని అన్నారు. క్లబ్ లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్ల అమర్,ఉపాధ్యక్షుడు కొడిపెల్లి దుర్గాప్రసాదరావు, జాయింట్ సెక్రెటరీలు వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్థన్,కార్యవర్గ సభ్యులు ఎండీ నయీంపాషా,విజయరాజ్, ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, నేతలు సోమనర్సయ్య,
రాజేంద్రప్రసాద్,సంపత్ రావు,పాషా,తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి హరీష్ రెడ్డి..

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి హరీష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 37 మంది జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఇంటి స్థలం ఇవ్వలేదు ఈ సందర్భంగా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ నిరాహారదీక్షలకు మద్దతు తెలిపిన తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి
ఈ సంద్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాజం లో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని..అధికారులకు ప్రజా ప్రతినిధులకు జర్నలిస్టులు రోడ్డెక్కుతుంటే కనపడడం లేదా అని ప్రశ్నించారు.. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చీకటి గణేష్ నరేష్ నేత పొక్కూరి శ్రీనాథ్ గాజుల అరుణ్ సందీప్ గౌడ్ ఆదిత్య వినయ్ పటేల్ ప్రదీప్ ముదిరాజ్ వినయ్, రాజకుమార్ తది తరులు పాల్గొన్నారు

మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఐజేయు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T173751.343.wav?_=2

 

మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఐజేయు
జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3 వ తేదీన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర సమాచార కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాలో భాగంగా జిల్లా కేంద్రంలో మహా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించినట్లు టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్,రాష్ట్ర హెల్త్ సెక్రటరీ సామల శ్రీనివాస్ లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3 వ తేదీన టీయూడబ్ల్యూజే(ఐజేయు) యూనియన్ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నా లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ ఏట వీరభద్ర స్వామి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T123101.073.wav?_=4

 

37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని
ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం దుర్మార్గమని
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్… అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జర్నలిస్టుల న్యాయమైన
సమస్యను పరిష్కరించాలని మూడవరోజు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం 37 మంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి జర్నలిస్టులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యల పైన నిరంతరం కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం

రిపోర్టర్ సుమన్ పరామర్శించిన జర్నలిస్టులు…

రిపోర్టర్ సుమన్ పరామర్శించిన జర్నలిస్టులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఆర్ బి న్యూస్ రిపోర్టర్ రామగిరి సుమన్ కు మాతృమూర్తి రామగిరి సుజాత ఇటీవల అకాల మరణం చెందగా గురువారం వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు పరామర్శించి ఓదార్చారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ఉపాధ్యక్షులు గట్టు రవీందర్,జిల్లా సంయుక్త కార్యదర్శి కడపాక రవి.
టీయూడబ్ల్యూజే -143 జిల్లా టెంజు అధ్యక్షులు అంబాల సంపత్,తిక్క ప్రవీన్,బండ మోహన్ తదిరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి…

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి

•భౌతికకాయానికి నివాళిలు అర్పించిన భీంభరత్
* రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

షాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు శనివారం ఉదయం అకాల మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రాములు స్వగ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, తమిల్లి రవీందర్ షాబాద్ సర్పంచ్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు మల్లేష్ సర్పంచ్, తదితరులు రిపోర్టర్ రాములు భౌతికకాయానికి నివాళిలు అర్పించారు.

జయంతి వారి వివాహ వేడుకలలో ప్రముఖ న్యాయవాది…

జయంతి వారి వివాహ వేడుకలలో ప్రముఖ న్యాయవాది

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా రాజనగరం అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఆర్ జి గార్డెన్ లో శనివారం జరిగిన శ్రీమతి జయంతి సునిత శ్రీనివాసులు శెట్టి కుమారుడు మణిదీప్ లలిత సోనాలిక తో జరిగిన వివాహ వేడుకలలో వనపర్తి ప్రముఖ న్యాయవాది పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు అయిత కృష్ణ మోహన్ కుటుంబ సభ్యులు ప్రముఖ వ్యాపారి గోకారం రాజు జర్నలిస్ట్ లు పోలిశెట్టి బాలకృష్ణ పోలిశెట్టి సురేష్ ఈపూరి వెంకటేష్ 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నూతన వధూవరులను ఆశీర్వదించారు

పత్రిక కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం…

పత్రిక కార్యాలయం పై దాడిని ఖండిస్తున్నాం

బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

ఎర్రం సతీష్ కుమార్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడి సరికాదని,బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ,దాడి
యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జెఎఫ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా ఉన్న మీడియాపై బెదిరింపులకు దిగటం మంచిపద్దతి కాదని,సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్ఛ పత్రికలకు ఉంటుందని, పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటికి ఖండనలు ఇవ్వటం, వివరణలు ఇవ్వటం చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగటానికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. భావప్రకటనా స్వేఛ్ఛ పై దాడి సరికాదని, తక్షణమే పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు, దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మీడియాపై దాడులు హేమమైన చర్య…

మీడియాపై దాడులు హేమమైన చర్య

ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణం అని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం,పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్,రాజు పటేల్,రమేష్ రెడ్డి,రాజు,నరేష్ స్వెన్, రాయలింగు,వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్,పడాల సంతోష్,పార్వతి సురేష్, పార్వతి రాజేష్,సిద్దార్థ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

తోట సుధాకర్ కు పలువురి పరామర్శ…

తోట సుధాకర్ కు పలువురి పరామర్శ

నడికూడ,నేటిధాత్రి:

 

 

టియూడబ్ల్యూజేే జిల్లా ప్రధాన కార్యదర్శి,ప్రజాపక్షం ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ తోట సుధాకర్ మాతృమూర్తి తోట వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా గురువారం పలువురు సుధాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.ఈ సందర్భంగా హవ్రాను జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చేరుకుని తొలుత తోట వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకటమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో సీపీఐ,బీసీ హక్కుల సాధన సమితి నాయకులు, జర్నలిస్టు నాయకులు ఉన్నారు.పరామర్శించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రంలో కార్యదర్శి ఎన్. రాజమౌళి,వరంగల్ జిల్లా నాయకులు పనాస ప్రసాద్, ల్యాదెళ్ల శరత్,సీనియర్ జర్నలిస్టులు ఎస్.శోభన్ బాబు,వెంకట్,మారుతి, ముత్యాల రఘు, కనకరాజు,పి.కిషోర్ కుమార్,టి.రజినీకాంత్,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల రవి తదితరులు ఉన్నారు.

మెట్ పల్లి‌లో జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కోసం బిజెపి డిమాండ్…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్నేని రఘు విలేకరుల సమావేశం
మెట్ పల్లి సెప్టెంబర్ 27 నేటి దాత్రి

కోరుట్ల నియోజకవర్గం ప్రజలందరికీ దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డుల వెంటనే ప్రభుత్వం జారీ చేయాలని
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న జర్నలిస్టు అక్రిడేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది
ఎలక్షన్ ముందు జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం కాంగ్రెస్ జర్నలిస్ట్ లకు ఎన్నో హామీలు ఇచ్చింది కనీసం ఒక్క హామీ కూడనెరవేర్చలేదుజర్నలిస్టులకు వెంటనే కొత్త అక్కడేషన్ కార్డు ఇవ్వాలి జర్నలిస్టుల హెల్త్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలతో ఉన్నవి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ఒకే ఒక్క అవకాశం అక్రిడేషన్ మాత్రమే అది కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం జర్నలిస్టుల కుటుంబాలకు అందరికీ బస్సు పాస్ లు స్టేట్ పాస్ ఇవ్వాలి వెంటనే హెల్త్ కార్డులు జారీ చేసి హెల్త్ కార్డులో ఉన్న సమస్యలు అన్నీ తీర్చాలి ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శిలు సుంకేటి విజయ్ కుడుకల రఘు బీజేవైఎం నాయకులు గోపనవేని రమేష్ యాదవ్ చెక్కల శ్రీకాంత్ కోసగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*కుటుంబాన్ని పక్కనబెట్టి సమాజం కోసం కృషి చేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులు..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
10:

 

 

 

వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, పక్కనబెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యం గా భావించి పనిచేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులని తుడా చైర్మన్, టిటిడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ఆధునికరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఆధునికరించడం సంతోషంగా ఉందన్నారు. మొదటినుంచి మీడియా మిత్రులు తన సోదరులుగా భావించి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నానని ఇకపై కూడా వారితో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. యువత చెడుదారి పట్టుకున్న వారిని మంచి మార్గంలో నడిపే బాధ్యతను మంచి కథనలతో మీడియా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగల్లో భారత దేశంలో మొదటి స్థానంలో నిలపడానికి మీడియా కృషి చేయాలని సూచించారు. తిరుపతి మీడియా మిత్రులకు ప్రెస్ క్లబ్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు,
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు..

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

V6 రిపోర్టర్ అయ్యుబ్ ఖాన్ సోదరుడు అహ్మద్ ఖాన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పట్టణంలోని ఈద్గా వద్దకు వెళ్లి వారి మృతదేహాన్నీ సందరర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు,మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా,ఆతార్ అహ్మద్ ఏఐఎంఐఎం నాయకులు, జర్నలిస్ట్ లు మహబూబ్, కరీం,తదితరులు ఉన్నారు,

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు…

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో మహతి కళాశాలలో మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గెంట్యాల భూమేష్ తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా కళాశాలలోని విద్యార్థులకు తెలంగాణ భాష దినోత్సవం పురస్కరించుకొని కాళోజి జయంతి వేడుకను పురస్కరించుకొని తాను మాట్లాడుతూ తెలంగాణ యాస భాష మన కాళోజీ అని నిజాం, నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన కవితల యోధుడని, మా భాష,మన అస్తిత్వం, మన నేల భూమి మన తెలంగాణ పోరాటం అని తెలిపారు.అందులో భాగంగా ఆడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు మన భాష మన ఆస్తిత్వం ఎంతో ఉపయోగమని అలాంటి ఈరోజున తెలుగు భాషా దినోత్సవం కాళోజి జయంతి వేడుక మనకెంతో గర్వకారణం అని తెలిపారు.
కవి రచయిత బూర దేవానందం కాళోజి పై కవిత గానం చేశారు. ఈ కార్యక్రమంలో మానేరు రచయితల సంఘం గౌరవ సలహాదారులు, అధ్యక్షులు జర్నలిస్టు టీవీ నారాయణ,చిటికెన కిరణ్ కుమార్, అల్లే రమేష్, కామవరపు శ్రీనివాస్, పోకల సాయికుమార్, ఎండి ఆఫీస్, అధ్యాపకులు వేణు,అంకారపు రవి కవులు,రచయితలు మరియు మహతి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version