పత్రికలపై బురద జల్లడం సరికాదు
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్
మంగపేట నేటిధాత్రి
తప్పుడు పనులకు పాల్పాడే వారి విషయంపై వార్తలు ప్రచురిస్తే పాత్రికేయులకై, పత్రికా యాజమాన్యంపై బురద జల్లడం సరికాదని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. నిర్భయంగా, నికార్సైన వార్తలు ప్రచురిస్తే అధికార పార్టీ అండతో పాత్రికేయులపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంటుందని కానీ కొందరు అధికార అహంకారంతో ఇతరుల హక్కులని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంకి ప్రజలకి వారదిగా ఉంటూ నిత్యం వాస్తవాలు ప్రచురించే పాత్రికేయులపైనే తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని బోర్ నరసాపురం సెంటర్ పై తగు విచారణ జరిపి తప్పు చేసిన వారు ఎవ్వరైనా వారిపై తగు చర్యలు తీసుకొని అన్యాయం గా అమ్ముకున్న ధాన్యం డబ్బులను రికవరీ చేయాలని అన్నారు.
