గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న.

గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న అక్రమ లేఔట్ లు

నోటీసులకే పరిమితమైన అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 16:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో అక్రమాలకు అడ్డాగా మారిపోయింది, అక్రమ కట్టడాలు ఒకవైపు ఉంటే మరోవైపు అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, అధికారులు నోటీసులు ఇవ్వడం వరకే పరిమితమై పూర్తిస్థాయిలో అరికట్టడంలో విఫలమయ్యారు,ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమాలు చేస్తుంటే నోటీసులు ఇస్తుంటే ఉంటే లాభం ఏమిటి అని ఇప్పటికే ఎన్నో వార్తా కథనాలు రూపంలో అధికారుల నిర్లక్ష్యం చూపుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, ఇందుకు కారణం రాజకీయ ఒత్తుల్లా ? లేక ఏదైనా ప్రలోభాలకు లోబడి ఈ విధంగా చేస్తున్నారా అని సందేహాలు కూడా వస్తున్నాయి, ఇదే క్రమంలో భాగంగా గంగవరం మండలంలో దాదాపు 20 నుంచి 25 లేఔట్ లు అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమాలు పట్టించుకోకుండా వేశారు,
అయిన కూడా అధికారులు ఏ విధమైనటువంటి స్పందన లేదు అంటే ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది, ఇదే క్రమంలో భాగంగా ఈ విషయంపై గంగవరం పంచాయతీ కార్యదర్శి సుధాకర్ వివరణ కోరగా అక్రమ కట్టడాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అయినా కూడా నిర్లక్ష్యప్రయంగా నిర్మిస్తున్నారని వారిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామని
ఈ సందర్భంగా ఆయన
తెలిపారు,అదే విధంగా లేఔట్ విషయంలో కూడా నోటీసులు ఇచ్చామని వారిపై కూడా ప్రభుత్వ నియమాల పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు,ఏది ఏమైనా అగ్రికల్చర్ భూములను మార్చి ఎటువంటి అనుమతులు లేకుండా కమర్షియల్ గా మార్చుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకుంటే రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో అగ్రికల్చర్ భూములన్ని లేఔట్ గా మారి పూర్తిస్థాయిలో వ్యవసాయం దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు, మరి ఇన్ని జరుగుతున్నా కూడా గంగవరం మండలం పై అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోలేదంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి, అలాగే కొన్ని విద్యాసంస్థలు కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు నిర్మించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది,
మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది…

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు.

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు

చోద్యం చూస్తున్న అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 12:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో మదనపల్లి పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ప్రభుత్వ అనుమతులకు మించి అక్రమ కట్టడాల నిర్మాణం రోజు రోజుకు శృతి మించి పోతుంది, ప్రభుత్వ అనుమతులు ఉన్న లేకపోయినా రాజకీయ పలుకుబడితో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారా లేదా ప్రభుత్వ అధికారులు ఏదైనా ప్యాకేజీ తీసుకొని ఈ అక్రమ కట్టలు కట్టిస్తున్నారు అర్థం కావడం లేదు కానీ ప్రమాదకరస్థాయిలో అక్రమ కట్టాల నిర్మాణం రోజు రోజుకు జరుగుతూనే ఉంది జాతీయ రహదారిని ఆనుకొని ఈ విధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఇప్పటికే ఎంతోమంది మదిలో ఈ ప్రశ్న వెలిబడుతుంది, మరి ఇలాంటి
క్రమంలో అంతస్తులపై అంతస్తులు కట్టుకుంటూ వెళ్తున్నారు కొందరు మరి వీటి పట్ల గంగవరం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఎందుకు ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఉన్నారో అర్థం కావడం లేదు ఇప్పటికే గంగవరం మండలంలో ప్రభుత్వ భూములు సైతం పక్కదారి పట్టించి పెత్తందారి వ్యవస్థను తీసుకువచ్చిన ఘటనలు కూడా ఎన్నో వార్తా కథనంలో చూసాం అదేవిధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణా కూడా గంగవరం మండలంలోని అధికంగా ఉండడం కూడా చూశాం అక్రమ మట్టి మాఫియా కట్టి మాఫియా ఇంకా ఎన్నెన్నో అక్రమాలు గంగవరం మండలానికి పెట్టింది పేరుగా ముందుకెళ్తుంది అంటే అధికార వ్యవస్థ ఏ మాత్రం అక్రమాలకు అండగా ఉందో మనకు అర్థమవుతూనే ఉంది మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి మరి అక్రమ కట్టడాలకు
సకరిస్తున్నారు,
అలాగే
అధికారులు రాజకీయ ఒత్తుల్లో ఉన్నారా లేక ప్యాకేజ్ తీసుకుని సైలెంట్ అయిపోతున్నారా అని అర్థం కావడం లేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకొని ప్రమాదాలను అరికట్టాల్సి ఉంది, ఇదే విషయంపై ఒక దినపత్రిక ఈ అక్రమాలపై వార్తా కథనాన్ని ప్రచురించగా అధికారుల స్పందన కూడా ఏమాత్రం లేదంటే మరి జిల్లా అధికారులు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది..

గంగవరం మండలంలో రెచ్చిపోతున్న.!

*గంగవరం మండలంలో రెచ్చిపోతున్న
ఇసుక అక్రమ రవాణా దారులు..

*చోద్యం చూస్తున్న అధికారులు..

గంగవరం(నేటి ధాత్రి) మార్చి 06:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గంగవరం పంచాయతీ
చిన్నూరు గ్రామానికి చెందిన అధికార
పార్టీ నాయకుడు నడుం
పల్లి సమీపంలోని అప్పిరెడ్డి
చెరువులో స్మశాన వాటికను సైతం ఆక్రమించి జెసిబిలతో ఇసుకను తోడేస్తూ ట్రాక్టర్ల ద్వారా నింపి సొమ్ము చేసుకుంటున్నారు.సమీపంలోని మట్టిని సైతం ఫిల్టర్ చేసి ఇసుకను తయారుచేసి నిల్వ ఉంచి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుకను టిప్పర్ల ద్వారా ఆ అక్రమ రవాణా దారుడు15 కిలోమీటర్లు
సమీపంలో ఉన్న కర్ణాటకకు రాత్రికి
రాత్రే అధికారుల కన్ను సన్నుల్లో
ఈ అక్రమ రవాణా జరుగుతుందని
పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా గాని
భూగర్భ గనుల శాఖ,ఇరిగేషన్ అధికారులు, రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ సంపదను ప్రక్క దారి పట్టిస్తున్నా,
లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకుడికి అధికారులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..
రానున్న రోజుల్లో నడుంపల్లి గ్రామంలో ఎవరైనా మరణిస్తే మా శవాలను
ఎక్కడ వేయాలని ఆ గ్రామస్తులు సైతం
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇతనిపై ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఇందులో వారి చేతివాటం ఎంతో ఉందో అర్థం అవుతుంది. దాదాపుగా చెరువు నుండి నిత్యం 200 లోడ్లు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ఇతను పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version