అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

హన్మకొండ, నేటిధాత్రి:

 

ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరొక ముందడుగు పడింది.శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కొత్తూరులో రూ.30 లక్షల వ్యయంతో, అలాగే 49వ డివిజన్ జూలైవాడా, రెవెన్యూ కాలనీల్లో రూ.1.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా పూర్తిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లు బాగుంటే ప్రజల దైనందిన జీవితం సులభమవుతుందని, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా సైడ్ డ్రైనేజీ పనులు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పనులు చేపడతామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రజల సహకారంతోనే సాఫీగా సాగుతాయని, అందరూ భాగస్వాములై పనుల పురోగతిని గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సొమ్మోకరిది సోకొకరిది

సొమ్మోకరిది సోకొకరిది
* ఎంఎల్ఏ మర్రి బీజేపీ నేతల ఫైర్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 6 :

 

సొమ్మోకరిది సోకొకరిది అన్నట్లుగా వ్యవహారిస్తున్న మల్కాజిగిరి ఎంఎల్ఏ మర్రి తీరే వేరని మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ మల్లికార్జున గౌడ్ ధ్వజమెత్తారు. అల్వల్ సర్కిల్ బీజేపీ నేతలు మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఆర్ యు బి పనులు తానే చేసినట్లు ఎంఎల్ఏ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ కృషి వల్లనే జరుగుతున్నాయని అల్వాల్ సర్కిల్ బిజెపి నాయకులు వెల్లడించారు. దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో శ్రీకారం చుట్టామని, కానీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి మొత్తం తానే చేసినట్టు ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవ చేశారు. ఒక రోజైనా ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి చర్చించినట్లు దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాణిక్య రెడ్డి, పరంకుశం మాధవ్, డివిజన్ ప్రెసిడెంట్ లు కార్తీక్ గౌడ్, అజయ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు దండుగుల వెంకటేష్, మురళి, వినయ్ శంకర్, గోపి, వర్మ, రవికిరణ్, మహేందర్ రెడ్డి, బన్సల్, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, సంజయ్, సుజాత, కరుణ శ్రీ ,పద్మిని, ముయ్యి సుజాత, అనురాధ కార్యకర్తలు పాల్గొన్నారు.

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి..

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి

స్వామి వారి పున:ప్రతిష్ఠ జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రానున్న సీఎం రేవంత్ రెడ్డి.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం
కొడవటంచ ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వివిధ శాఖల అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.బుధవారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బాలాలయంలో ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యవార్లు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. మరో 50 రోజుల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. ఫిబ్రవరి నెలలో జరిగే స్వామి వారి పున:ప్రతిష్ఠ శ్రీ స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అట్టి పనులన్నీ నాణ్యతతో పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. దాదాపు వందేళ్ల కిందట నిర్మించిన ఆలయాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రములోని మొట్టమొదటి సారిగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచ ఆలయ పున:అభివృద్ధికి పనులను కొరకు రూ.12.15 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆలయంలో విమాన గోపుర అర్ధ మండపం, మహా మండపం, అద్దాల మండపం, ఆళ్వార్ నిలయం, పాకశాల, క్యూలైన్లు, అన్నదాన సత్రం, కాంపౌండ్ మరియు తాగు నీటి సౌకర్యం తదితర పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులు, సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…

ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…

#అన్నీ డివిజన్ లలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి..

#శంకుస్థాపన చేసిన ప్రతి పని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నాం..

#ప్రజల భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి…

#నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న..

#కాజీపేట,హనుమకొండ లలో పలు డివిజన్ లలో సుమారు రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

హన్మకొండ, నేటిధాత్రి:

 

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.పేర్కొన్నారు.సోమవారం రోజున శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజవర్గ పరిధిలోని 47 వ డివిజ బోడగుట్ట,31 వ డివిజన్ శాయంపేట ఎస్సీ కాలనీ,8 వ డివిజన్ గుడి బండల్ లలో సుమారు రూ.1.70 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా డివిజన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీలో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.గతంలో పలు కాలనీల్లో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చాలా కాలనీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి జరుగుతున్నదని,రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు.
బోడగుట్ట గ్రామానికి ప్రధాన రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయాలని స్థానిక ప్రజలు కోరగా సంబధిత అధికారులకు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని సూచించారు.
శాయంపేట దళిత కాలనీలో చాలా వరకు నూతన రోడ్లు వేశామని మిగిలిన అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు,అధికారులు ఉన్నారు.

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు…

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు

• గెలుపే లక్ష్యంగా ప్రచారం
* అన్ని వర్గాల పూర్తి మద్దతు నాకే ఉంది
* విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం
* పదవి లేకున్నా గ్రామానికి అనేక సేవలు

చేవెళ్ల, నేటిధాత్రి :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఏ గ్రామాల్లో చూసిన ఎన్నికల హడావిడి వాతావరణమే దర్శనమిస్తుంది. షాబాద్ మండలం పోతుగల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటిగా గడపగడపకు ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోతుగల్ పంచాయతీలో పంచాయతీ అనుబంధ గ్రామం చిన్న, పెద్ద తండాలు కలుపుకొని సుమారు 12వందల ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పామేనా నర్సిములు ముందంజలో కనిపిస్తున్నారు. బొట్టుపెట్టి ఓటు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్పంచిగా అవకాశం ఇచ్చి అభివృద్ధికి ఓటువేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సర్పంచిగా గెలిచినా వెంటనే గ్రామంలో అండర్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు చేపడతానని తెలిపారు.బీటీ రోడ్లు వేయిస్తానని అన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థిలో నీటి సమస్య ఏర్పడుతుంది ఈ సమస్యను అదిగమించడానికి పోతుగల్ గ్రామంలోని ప్రతి వార్డు లో బోరు వేసి, మిని ట్యాంక్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. హామీ ఇచ్చారు.గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేస్థానని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తొడ్పాటు అందిస్తానని తెలిపారు. గ్రామంలో ఫిల్టర్ వాటర్ సెంటర్ ను ఏర్పాటు చేసి గ్రామప్రజలకు ఉచితంగా ఫిల్టర్ నీళ్లను అందిస్తానని తెలిపారు. గ్రామంలో మృతిచెందిన కుటుంబానికి 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందేలా, గ్రామ అభివృద్ధికి అన్నివిదాల కృషి చేస్తానని తెలిపారు. గ్రామప్రజలకు ఓటర్లకు కత్తెర గుర్తుకు ఓటువేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

స్థానిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న చీర్ల రాజేష్…

స్థానిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న చీర్ల రాజేష్

విజయానికి అన్ని వర్గాల మద్దతు తనకే అని ధీమా వ్యక్తం

ఇంటింటికి బొట్టు పెట్టి ఓట్లు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారం

తాండూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి చీరల రాజేష్ స్థానిక ఎన్నికలలో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగడంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్తపల్లి గ్రామానికి చెందిన చిర్ల రాజేష్ తమ గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో బీసీ రిజర్వేషన్ రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది.చీర్ల రాజేష్ ఇదివరకే ఉపసర్పంచ్ పదవిలో కొనసాగి ప్రజా సమస్యలపై పట్టున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. తను గ్రామానికి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అంతేకాకుండా గ్రామస్తులతో తనకు తన కుటుంబానికి ఎనలేని ఆప్యాయత అనుబంధం ఉందని అన్నారు.తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని, తనే పోటీలో సర్పంచ్ అభ్యర్థి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

వార్డుమెంబర్ గా గెలిపించండి..

వార్డుమెంబర్ గా గెలిపించండి

* గ్యాస్ గుర్తుకు ఓటువేసి అభివృద్ధిని గెలిపించండి
* 1వ వార్డు అభ్యర్తి చేనిగల్ల వెంకటయ్య

చేవెళ్ల, నేటిధాత్రి :

 

ఆలూరు 1వ వార్డులో వార్డుమెంబర్ గా పోటీచేస్తున్న
చేనిగల్ల వెంకటయ్య ప్రచారంలో భాగంగా వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటువేసి గెలిపించాలని
ఓటర్లను కోరారు. వెంకటయ్య గతంలో ఎంపీటీసీ గా గ్రామానికి సేవలందించారు. సీసీరోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. ఇప్పుడు తనకు ఓటు వేసి అవకాశం ఇస్తే వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మధ్యానికి తలోగ్గి ఓటువేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీ అమూల్యమైన ఓటు గ్యాస్ సిలిండర్ కు వేసి అభివృద్ధిని గెలిపించాలని కోరారు.

జోరుగా సాగిన కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-10T123925.821.wav?_=1

 

జోరుగా సాగిన కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ కు ఓటు వేస్తే… అభివృద్ధికి ఓటేసినట్లే

అభివృద్ధి ఒక్క కాంగ్రెస్కే సాధ్యం

ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు

కాంగ్రెస్ విస్తృత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఎన్నికల నియమ నిబంధన ప్రకారం చివరి రోజు పార్టీల ప్రచారం జోరుగా సాగింది. కేసముద్రం మండలంలోని సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని మరియు భూక్యరాం తండా గ్రామపంచాయతీ గ్రామాలలో చివరి రోజు ప్రచారం జోరుగా సాగింది ఈ ప్రచార కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో ప్రతి గడపగడపకు , ప్రతి చేను తిరుగుతూ సప్పిడి గుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోత్ బద్రు నాయక్ వెన్నంటే ఉండి. మరియు భూక్య రామ్ తండా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జాటోత్ సోమి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సప్పడిగుట్ట తండా పంచాయతీ లో ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రత్యేక చొరవతో అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇక ముందు కూడా అభివృద్ధి ఇదేవిధంగా జరుగుతుందని వివరిస్తూ సప్పిడి గుట్ట తండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న బానోత్ బద్రు నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇంకా మరిన్ని అభివృద్ధి పనుల ఫలాలు అందిపుచ్చుకోవాలని ఓటర్లను అభ్యర్థిస్తూ అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని అందుకు ఈ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులనే నిదర్శనంగా తీసుకోవాలని గతంలో ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం లక్షల రూపాయల నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేసిందని ఇకముందు అభివృద్ధి ఇదేవిధంగా జరుగుతుందని తండాలోని ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధికంగా ఓట్ల మెజారిటీతో గెలిపించాలని తండా ప్రజలను కోరారు.

తంగళ్ళపల్లి గ్రామపంచాయతీకి సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన అoకారపూరవి….

తంగళ్ళపల్లి గ్రామపంచాయతీకి సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన అoకారపూరవి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ అహంకారపురవి తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మేజర్ గ్రామపంచాయతీ ఆయన సందర్భంగా ఇదివరకు గ్రామపంచాయతీకి చేసిన సేవలను గుర్తిస్తూ సర్పంచిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాననిగత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో గ్రామంలోని ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఎంతోఅభివృద్ధిగా తీర్చిదిద్దామనిఅలాగే గ్రామ ప్రజలకు ఏ ఆపతిఅవసరం వచ్చిన ముందుండి నడిపించామనిఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా గ్రామ ప్రజలందరూ తను చేసిన అభివృద్ధిని గుర్తించి ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలనిఓటర్లందరూ అభివృద్ధి వైపు చూసి ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకముందు కూడా గ్రామ అభివృద్ధి చేయడానికి నన్ను గెలిపించవలసిందిగాకోరుచు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మాజీ ఎంపీపీ పడిగెలమానస రాజు. మాజీ సర్పంచ్ అనిత రవి మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. Pacs వైస్ చైర్మన్ ఎగుమామిడివెంకట రమణారెడ్డి. కందుకూరి రామ గౌడ్. గ్రామస్తులు తదితరులు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎన్నికల కోసం బిజెపి తపన

రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందాలీ మండల బిజెపి అధ్యక్షులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల బిజెపి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో పలు విషయాలపై చర్చించి వివరాలు వెల్లడించిన మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు సర్పంచ్ ఎన్నికల్లో మరియు వార్డ్ మెంబర్స్.పోటీ చేయడం కొరకు విధి విధానాల గురించి చర్చించడంతోపాటుప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించాలని అలాగే ప్రతి ఇంటికి వెళ్లి 420 హామీలు వాటి మోసాలను వివరించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి. బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇతర పార్టీల అందరికీప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి సంస్కరణ గురించి ప్రతి ఇంటికి గడప.గడపన తెలియజేయాలని ప్రతి కార్యకర్త తమ కర్తవ్యం గా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటిరాజు. మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోసినీ వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్.బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మోర్చా అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్చార్జులుమహిళా బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T164720.602.wav?_=2

 

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలోని దుబ్బ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను సోమవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలకు మేరకు మంచిర్యాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద డ్రైనేజ్ పనులకు 22 లక్షల రూపాయలు మంజూరు అవడంతో డ్రైనేజీ లకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

రామంతపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T171342.556.wav?_=3

 

 

రామంతపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనులను కార్పొరేటర్, ఎమ్మెల్యేతో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు.

ఉప్పల్ నేటిదాత్రి

 

రామంతపూర్ డివిజన్‌లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహాయ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా

ఇంద్రనగర్ కమిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం & రిపేర్లకు రూ. 35 లక్షలు

ఇంద్రనగర్ వి ఎన్ హెచ్ స్కూల్ లేన్ సీసీ రోడ్ నిర్మాణానికి రూ. 12.50 లక్షలు

ఆర్టీసీ కాలనీ సీసీ రోడ్లు నిర్మాణానికి రూ. 35 లక్షలు

బాలకృష్ణ నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ పనులకు రూ. 55 లక్షలు.
ఎం పీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూ మల్కాజ్గిరి నియోజకవర్గానికి అదనపు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా కార్పొరేటర్ల తో కలిసి పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో HMWSSB జీఎం సంతోష్ కుమార్, జిహెచ్ఎంసి డీఈ నాగమణి, ఏఈ మౌనిక, స్థానిక ప్రజలు, బీజేపీ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రాజీవ్ పార్క్ అభివృద్ధి పనుల పర్యటన…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T165727.839.wav?_=4

 

 

రాజీవ్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి గ్రీనరీ ఏర్పాటు పనులను పరిశీలించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

కాప్రా నేటిధాత్రి

 

మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి గ్రీనరీ ఏర్పాటు పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు వీలైనంత త్వరలో పార్కుల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా, నాణ్యమైన నిర్మాణాలను చేపట్టి.. పదికాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేసుకున్నామని అన్నారు. ఇటీవలే ఈ పార్కులో పాడైనటువంటి జిమ్ పరికరాల స్థానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, చెట్ల చుట్టు కూడా ఉన్నటువంటి కొమ్మలు తొలగించి శుభ్రం చేయడం జరిగిందని, పూర్తి పచ్చదనం కళ్ళకు కనువిందుగా ఉండేలా చర్యలు చేపట్టామని, పార్కును పూర్తిగా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకు అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హార్టికల్చర్ అశోక్, సాయి కుమార్, పూస రమేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-19T144639.363.wav?_=5

 

మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…

రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో భాగంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి వనం వద్ద 20 లక్షల నిధులతో ఓపెన్ జిమ్, 30 లక్షల నిధులతో ఆర్కే వన్ డంపింగ్ యార్డ్ సమీపంలో స్మశాన వాటిక ఏర్పాటుకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెన్నూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, నియోజకవర్గంలో సుమారు 600 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 40 కోట్ల నిధులతో అమృత్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వంతెన పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్మశాన వాటిక నిర్మాణానికి మరో 20 లక్షలు కేటాయించి మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ ఆశీస్ సింగ్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, బత్తుల వేణు, కట్ల రమేష్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ మార్కెట్ అభివృద్ధికి 1.83 కోట్ల రూపాయల నిధుల మంజూరు…

నెక్కొండ మార్కెట్ అభివృద్ధికి 1.83 కోట్ల రూపాయల నిధుల మంజూరు

#నెక్కొండ, నేటి ధాత్రి :

 

నెక్కొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం 1.83 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇందులో రూ.99 లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ.84 లక్షలతో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ నిధుల మంజూరీకి స్థానిక శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి చేసిన కృషి అమూల్యమని ఆయన ప్రశంసించారు. రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డ్ అభివృద్ధి దిశగా తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమైనదని తెలిపారు. మార్కెట్ అభివృద్ధి పనులు పూర్తయితే రైతులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
ఈ నిధుల మంజూరీ కోసం కృషి చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మార్కెట్ పాలకవర్గం, అధికారులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్, కార్యవర్గ సభ్యులు కందిక సుమలత, మామిండ్ల మల్లయ్య, దూదిమెట్ల కొమురయ్య, తాళ్లూరి నరసింహస్వామి, కొత్తపల్లి రత్నం, జమ్ముల సోమయ్య, బొమ్మరబోయిన రమేష్, రావుల మహిపాల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి 15 అవార్డు బాలాంజనేయ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం…

వనపర్తి 15 అవార్డు బాలాంజనేయ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో పిసి రోడ్డు నిర్మాణం ప్రారంభమైందని 15వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు . శనివారం నాడు భూమి పూజ నిర్మాణం సిసి రోడ్ నిర్మాణం కార్యక్రమంలో పాపిశెట్టి శ్రీనివాసులు సాయి కుమార్ న్యాయవాది టి శ్రీనివాసులు దానల్ అభిషేక్ మున్నూరు సురేందర్ ముంత మన్యం సూర్య కుమార్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అని బండారు కృష్ణ చెప్పారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం…!

◆:- ” డీసీసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించడం ఖాయమని డీసీసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని, విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి మద్దతుగా షేక్ పేట్ డివిజన్ లోని 67 బూత్ నెంబర్ లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 67వ బూత్ ఇంచార్జి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్దాం. ఉజ్వల్ రెడ్డి, ఆదేశాల మేరకు షేక్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తూ.. సంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూరుస్తారు. కాంగ్రెస్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు మద్దతు ఇస్తున్నారు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కుడ కనిపించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో జూబ్లీహిల్స్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికీ మరో బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు. జూబ్లీహిల్స్ తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ స్విప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిదంగా కేవలం షేక్ డివిజన్ కీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇప్పటికే 95 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టడం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు గెలిపియడానికి సిద్దంగా వున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో జహీరాబాద్ నియోజకవర్గంకు చెందిన మాజీ ఎంపీటీసీ మహేందర్, ఆఫీస్, మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి, ఝరాసంగం మండల యువ నాయకులు అభిలాష్ రెడ్డి, న్యాల్కల్ మండల ఆశభావ జడ్పీటీసీ అభ్యర్థి మొహమ్మద్ యూనూస్, అశ్విన్, తదితరులు స్థానికలు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

మిషన్ భగీరథ మంచినీటి పంపిణీ వ్యవస్థలో ఆటంకాలు తొలగించండి..

సింగూర్ డ్యాం మరమ్మత్తు సమయంలో ప్రతి గ్రామానికి మంచినీరు అందించేలా ప్రత్యేక ప్రణాళిక..

త్వరలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతన అభివృద్ధి పనులకు ప్రణాళిక..

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

పఠాన్ చేరు, నేటి ధాత్రి :

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు..బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, బండ్లగూడ పరిధిలోని దోషం చెరువులలోకి మురుగనీరు చేరకుండా చేపడుతున్న ప్రత్యేక పైప్ లైన్ పనుల పురోగతిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పైపులైన్ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని.. త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించాలని జిహెచ్ఎంసి ఇరిగేషన్ విభాగం ఈఈ మల్లేష్ ను ఆదేశించారు. పటాన్చెరు సాకి చెరువు, రామచంద్రాపురం రాయసముద్రం చెరువుల సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకొని రావాలని.. ఉన్నతాధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని అధికారులకు సూచించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం రెవిన్యూ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు త్వరలోనే భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందని తెలిపారు. భవనాల నిర్మాణాలకు సైతం నిధులు కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని..ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్ ను ఆదేశించారు. పరిశ్రమలకు మంచినీరు అందించడం ఎంత ముఖ్యమో.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి అందించడం అంతకంటే ప్రాధాన్యత అంశమని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలకు సైతం మంచినీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మంచినీటి పంపిణీ అంశంలో అలసత్వం వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. వచ్చేనెల 10వ తేదీ లోపు పంపిణీ అంశంలో గల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.

 

Mission Bhagiratha

డిసెంబర్ నెల నుండి సింగూర్ డ్యాం మరమ్మత్తులు చేపడుతున్న సందర్భంగా సంవత్సరం పాటు మంచినీటి పంపిణీ ఆపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సింగూరు ద్వారా పంపిణీ జరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని భానూరు, క్యాసారం, నందిగామ, గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం, కానుకుంట, కొత్తపల్లి, మంబాపూర్, నాగిరెడ్డిగూడెం, నల్లవల్లి, రామిరెడ్డి బావి, వీరారెడ్డిపల్లి, తదితర గ్రామాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను సంబంధిత ఎంపీడీవోలు, కార్యదర్శులతో చర్చించారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిధులు కొరత మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత కార్యదర్శులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సి ఎస్ ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలని కోరారు. గుమ్మడిదల నుండి కానుకుంట మీదుగా నూతనకల్ వరకు రహదారి నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నూతన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని.. ప్రభుత్వంతో చర్చించి నిధులు కేటాయిస్తానని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్దనూరు, ఘనాపూర్, వెలిమెల, కొల్లూరు, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ పరిధిలో 6 కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వచ్చే వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అభివృద్ధి పనుల్లో లసత్వం వహించవద్దని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, పటాన్చెరు ఎమ్మార్వో రంగారావు, పటాన్చెరు ఎంపీడీవో యాదగిరి, గుమ్మడిదల ఎంపీడీవో ఉమాదేవి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ విజయ లక్ష్మి, డీఈలు హరీష్, శ్రీనివాస్, ఏఈ మౌనిక, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తా…

సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తా

– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

కాప్రా నేటిరాత్రి

 

 

ఉప్పల్ నియోజకవర్గంలోని
సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.
బుధ వారం కాప్రా డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ లో రోడ్డు నీ అలాగే స్టీమ్ వాటర్ డ్రైన్ నీ 44 లక్ష రూపాయల నిధులతో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ నాయకులు భైరీ నవీన్ గౌడ్, సాకేత్ కాలనీ అధ్యక్షులు జిఎస్‌రావు, జాయింట్‌ సెక్రటరీ రవీందర్‌రావు, కోశాధికారి చంద్రశేఖర్‌, రాజేశ్వర్‌రావు, నిరంజన్‌రావు, జగన్‌నాథరావు, శ్రీనివాసరావు, సాకేత్‌ స్వర్ణ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, కళ్యాణ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version