ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ..

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

ఈవీఎంలను పరిశీలించిన సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసేందుకు ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి సీఈఓ సుదర్శన్ రెడ్డి చేరుకోగా, జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఈఓ.. ఇంచార్జి కలెక్టర్ తో పలు అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి సీ ఈ ఓ నేరుగా సర్దాపూర్ లోని ఈవీఎం గోడౌన్, ఈవీఎంలను ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేష్ కుమార్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

 హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..

 హై అలర్ట్.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు..

 

తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. CMO, లోక్ భవన్‌ను పేల్చేందుకు కుట్ర చేస్తున్నారని గవర్నర్ కార్యాలయానికి ఖాన్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ భవన్, సీఎంవోను వెంటనే ఖాళీ చేయించాలని మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటినా బాంబు స్క్వాడ్‌‌తో సీఎంవో, లోక్ భవన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. అలాగే, బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ…

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ

 

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ ఒకటి బయటపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ద్వారా వాహన తనిఖీల్లో గుర్తించారు అక్కడి పోలీసులు.

శ్రీశైలం టోల్‌గేట్(Srisailam Toll gate) వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్(9mm Pistol) ఒకటి బయటపడింది. దీంతో సదరు తుపాకీ(Revalver)ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

కాగా.. రివాల్వర్ తీసుకువచ్చిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) వాసిగా గుర్తించారు శ్రీశైలం ఆలయ అధికారులు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ(Cyber Crime SI) అని ఆయన పోలీసులకు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై విచారణలో భాగంగా.. సదరు వ్యక్తి నుంచి రివాల్వర్ సహా ఐడెంటిటీ కార్డు(ID Card)ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్టు శ్రీశైలం సీఐ ప్రసాదరావు(CI Prasada Rao) పేర్కొన్నారు.

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్…

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకోసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version