ప్రజాధనాన్ని కాంటా వేస్తూ ఎమ్మెల్యే సిసిరోడ్ల వ్యాపారం…

ప్రజాధనాన్ని కాంటా వేస్తూ ఎమ్మెల్యే సిసిరోడ్ల వ్యాపారం

కాంట్రాక్టర్ అవతారంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్

నేను తెచ్చిన నిధులతోనే నర్సంపేటలో రోడ్లు పోస్తున్నడు.

అభివృద్ధి జరిగేది బిఆర్ఎస్ తోనే..రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.

29 వ వార్డులో నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ను గెలిపిస్తే.. మరో కుర్చీవేస్తా..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

29 వ వార్డు బిఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి,నన్నపనేని నరేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

మహిళల పథకాలతో వారిని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలను మోసం చేస్తున్నదని. ఇదే క్రమంలో నర్సంపేట పట్టణంలో ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్ అవతారంతో ప్రజాధనాన్ని కాంటావేస్తూ నకిలీ సిసి రోడ్ల వర్కులు చేస్తున్నారని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్ ఆరోపించారు.

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఇంటింటీ ప్రచారం చేపట్టగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్ పాల్గొని ప్రచార చేపట్టారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులుతోనే నేడు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్ గా

అవతారంతో క్రషర్ మిల్లుతో సహా అన్ని సొంత వస్తువులతో నాణ్యత లేని రోడ్లను పోసి ధనాన్ని దోచుకుంటున్నాడని, ఇప్పటికిప్పుడే రోడ్లకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, నెలకు 2500 మహిళా పథకంలాంటి మరెన్నో మహిళా పథకాల ఆశలతో ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఈ మోసం చేసిన ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేందుకు మహిళలకు ఇదే సదవకాశం అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయి గోసపడుతున్నాం..వడ్డించే వాళ్ళు మనవాళ్ళు ఉంటే అభివృద్ధి మనదే.. అని నరేందర్ వివరించారు.గతంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ముందు..తర్వాత సుదర్శన్ రెడ్డి వచ్చాక నర్సంపేట అభివృద్ధిని పరిశీలన చేసుకోవాలని కోరారు.కరోనా సమయంలో ప్రజలను విడిచిపెట్టి పోయిన వ్యక్తి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..ప్రజల కోసం నిత్యం పనిచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు. నర్సంపేట పట్టణం టిఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి జరిగిందని.. ఇక నుండి అభివృద్ధి జరిగేది బిఆర్ఎస్ తోనే..రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం 42 కోట్ల రూపాయల నిధులు తెచ్చానని.. ఆ నిధులను రద్దుచేసి మరల అవే నిధుల కోసం జీవోలు మార్చి రూ.42 కోట్ల నిధులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శ్రీ మాత కన్స్ట్రక్షన్ పేరుతో కాంట్రాక్టర్ రూపంలో ఎన్నికల ముందు హడావుడిగా పనులు చేస్తున్నారు.ఈ నిధులు నావి కాదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కేసీఆర్ ప్రభుత్వ హయంలో నర్సంపేట మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తే ఇటీవల నర్సంపేటలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ నిధులు ఏమి ఇచ్చామని ఒక రాయి వేసి శంకుస్థాపన చేశారని ఎద్దేవ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాధవ రెడ్డికి రెండు సంవత్సరాలుగా ఎలాంటి సత్సంబంధాలు లేనప్పటికీ సీఎంకు.. ఎమ్మెల్యేకు నెల రోజుల్లోనే మాటలు కలిసి పనులు వెంటనే ఎలా ప్రారంభం. చేశారు. ఆ నిధులు ఎక్కడివి అని పెద్ద సుదర్శన్ రెడ్డి అడిగారు. పట్టణంలోని నిరుపేద ప్రజలకు శుభకార్యాల కోసం ఏసీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తే నేటికీ ప్రారంభం చేయలేదని ఆరోపించారు.మహిళా పథకాలతో కాంగ్రెస్ పార్టీకి తలొగ్గిన ప్రజలకు మోసం జరిగింది. నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి..మరో గౌరవ పదమైన మెట్టుపై నిల్చుపెడుతానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, వార్డు బాధ్యులు, పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

సింగరేణి నిధులను దుర్వినియోగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

సింగరేణి నిధులను దుర్వినియోగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు ఉండే సంస్థ సింగరేణి సంస్థ దానిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిలో ఉన్న నిధులు అన్నిటిని వాడుకొని సంస్థను నిర్వీర్యం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మెస్సితో కలిసి ఫుట్ బాల్ గేమ్ ఆడటానికి సింగరేణి సంస్థ నుండి 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొని ఆటలు ఆడాడు కానీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరపడానికి నిధులు లేవు అంటున్నారు సింగరేణి ఉద్యోగులు కార్మికులు కార్మికుల కుటుంబాలు ప్రతి సంవత్సరం ఘనంగా సింగరేణి ఆవిర్భావ నిర్వహించుకునేటివి కానీ నేడు వాటికి నిధులు కేటాయించకుండా తూతూ మంత్రంగా ఆవిర్భావ దినోత్సవాలను జరపడం జరిగింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ సిద్దు పట్టణ అధ్యక్షుడు జనార్దన్ బీబీచారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

“ప్రలోభాలకు లొంగొద్దు: ఆంజయ్య పిలుపు”

ఓటర్లు డబ్బు మద్యం ప్రలోబాలకు లొంగొద్దు

• నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలి
•సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెక్రటరీ మంగలి ఆంజయ్య

చేవెళ్ల, నేటిధాత్రి :

 

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెసెక్రటరీ మంగలి ఆంజయ్య అన్నారు. ఈ సందర్బంగా మండలంలో సర్పంచి, వార్డు నెంబర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులు డబ్బులతో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ముందుగా ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, విందు కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బులు గెలిచిన తరువాత ప్రభుత్వం గ్రామపంచాయతీకి విడుదల చేసే నిధుల నుండి ఖర్చును పూడ్చుకునే అవకాశం సాధ్యం కాదనీ సమాచార హక్కు వికాస సమితి ముందుగా హెచ్చరిక తెలియజేస్తుందని అన్నారు. గ్రామానికి వచ్చిన నిధులను పనులు నిమిత్తం మాత్రమే పారదర్శకంగా ఖర్చు చెయ్యాలని సమాచార హక్కు చట్టం ప్రకారంగా పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240
ప్రకారంగా ప్రతీ విషయం ప్రజలందరూ తెలుసుకునే హక్కు ఉందని ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240 ను ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో సూచిక బోర్డు పై ప్రజలందరికీ తెలిచేలా ఏర్పాటు చెయ్యాలని అన్నారు .
నిధులను పక్కదారి పట్టించిన దుర్వినియోగం చేసినా,
సొంతానికి వాడుకున్న, తప్పుడు లెక్కలు చూపిన ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి, నిధులను రికవరీ చేసి, పదవి నుండి తొలగించె అవకాశం ఉందని, కాబట్టి ఎన్నికల్లో అధిక ఖర్చులు పెట్టి అప్పుల పాలు కావద్దని సూచించారు. ఓటర్లు డబ్బు, మద్యం, ప్రలోబాలకు లొంగి ఓటు వేయొద్దని, నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలని ఓటర్లకు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version