`కాంగ్రెస్ ఖాతాలో పడుతున్న మెజారిటీ పంచాయతీలు
`ఇప్పటికే ఏకగ్రీవాలా పేరుతో కాంగ్రెస్ జెండా రెపరెపలు.

`అధికార పక్షం వైపే చూస్తున్న పల్లెలు.
`అధికారికంగా పార్టీ గుర్తులు లేకపోయినా కాంగ్రెస్ నాయకులు ముందంజలో వున్నారు.
`బీఆర్‌ఎస్ నుంచి పంచాయతీ లలో స్పందన కరువు.
`అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టలేని స్థితిలో బిఆర్‌ఎస్.
`తూతు మంత్రంగా పేర్లు ప్రకటిస్తున్నారు.
`అభ్యర్థులు ఎంపిక తలనొప్పి వద్దనుకున్నారు?
`ఆయా గ్రామాలకే వదిలేశారు.
`అందుకే పేర్లు వెల్లడిరచడానికి బిఆర్‌ఎస్ సిద్దపడడం లేదు.
`గెలిచినా వాళ్ళు బిఆర్‌ఎస్ లో ఉంటారన్నా నమ్మకం లేదు.
`ఇంకా మూడేళ్లు సమయం ఉంది.
`అధికార పార్టీ నాయకుల మాటే చెల్లుతుంది.
`బీఆర్‌ఎస్ పార్టీ ఆశలు నెరవేరా లేదు.
`జనం కాంగ్రెస్ మీద వ్యతిరేకత చూపిస్తున్న సందర్భం కనిపించడం లేదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ పల్లెపోరులో ఏం జరుగుతోంది. పాలక, ప్రతి పక్షాల మధ్య పోరు ఎలా సాగుతున్నది? పై చేయి ఎవరు సాదిస్తున్నారు? అనే ఉత్కంఠ అందరిలోనూ వుంది. కాని క్షేత్ర స్దాయిలో ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేదు. ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేదు. ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను నమ్మి ఆ పార్టీ అభ్యర్దులను గెలిపించుకునే పరిస్దితి పెద్దగా కనిపించడం లేదు. ఇది అంతు పట్టని వ్యహారంలా మారింది. నిన్నటి దాక బిఆర్‌ఎస్ చెప్పుకున్నదానికి ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తున్నదానికి సంబధం లేకుండా వుంది. గత ఏడాదిన్న కాలంగా పంచాయితీ ఎన్నికలు పెట్టండి? మా తడాఖా చూపిస్తామంటూ బిఆర్‌ఎస్ రంకెలేసింది? అంతెందుకు ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్‌లో ఓటమి తర్వాత కూడా బిఆర్‌ఎస్ పల్లె మాదే. అక్కడ గెలుపు మాదే. పల్లెల్లో పంచాయితీలు మావే. కాంగ్రెస్‌కు చోటు లేకుండా చేస్తాం. కాంగ్రెస్‌ను తుడిచేస్తాం. పల్లెల్లో కాంగ్రెస్ జెండా కనపడకుండా గెలుస్తాం. అంటూ చెప్పుకున్న గొప్పలకు లెక్కే లేదు. కాని క్షేత్రస్దాయిలో చూస్తే అలాంటి పరిస్దితులు చూస్తే మచ్చుకు కూడా కనిపించడం లేదు. బిఆర్‌ఎస్ చెప్పుకున్నంత సులుగా ఆ పార్టీకి పరిస్ధితులు అనువుగా లేవు. పల్లె పోరులో వరుస విజయ పరంపరలను కొనసాగిస్తున్న కాంగ్రెస్ కూడా ముందంజలో వుంది. ముఖ్యంగా ఏకగ్రీవాలలో కాంగ్రెస్ దూసుకుపోయింది. చాల వరకు కాంగ్రెస్ పార్టీ ఏక గ్రీవాలను సాధించింది. ఇంకా మిగిలిన ఎన్నికల పోరులో సత్తా చూపిస్తామని కాంగ్రెస్ అంటోంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పల్లె పోరులో కూడా దూసుకుపోతోంది. విజయాలు సొంతం చేసుకుంటోంది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు వుండకపోవచ్చు. కాని పార్టీల అభ్యర్దులుగానే రంగంలో వుంటారు. సహజంగా అందరూ ఇండిపెండెంట్లుగానే పోటీ చేస్తారు. కాని అందరూ ఏదో ఒకపార్టీకి అనుబంధ సభ్యులై వుంటారు. అందుకే ఒక ఊరిలో ఒకే పార్టీకి చెందిన పలువులు వ్యక్తులు పోటీచేస్తారు. అందులో ఏదొ ఒకరిని పార్టీ గుర్తించినట్లు మాత్రమే చెప్పుకుంటారు. అందులో గెలిచిన వారిని కూడా తమ పార్టీయే అని చెప్పుకుంటారు. ఇది సహజం. అలా పోటీ చేసే అభ్యర్ధులలో కూడా కాంగ్రెస్‌కు చెందని వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముందు బిఆర్‌ఎస్ చెప్పిన విధంగా ఆ పార్టీ నుంచి పోటీచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్‌తో పోలిస్తే బిఆర్‌ఎస్ అభ్యర్దులు ఎక్కుగా బరిలో లేరు. వున్నదల్లా ఎక్కువగా కాంగ్రెస్‌కు చెందిన నాయకులే ఎక్కువగా వున్నారు. ఇక్కడే కాంగ్రెస్ విజయాలు దాగి వున్నాయని చెప్పడంలో సందేహంలేదు. అందుకే ఏక గ్రీవాలతో కాంగ్రెస్ ఇప్పటికే గెలుపు ఖాతాలు బాగానే తెరిచింది. గెలిచిన వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్ధులే కావడం గమనార్హం. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం బిఆర్‌ఎస్ అభ్యర్దులు ఏకగ్రీవం అయ్యారు. వారిని చూపించుకొని బిఆర్‌ఎస్ పెద్దగా షో చేస్తోందని చెప్పొచ్చు. కాంగ్రెస్‌కు అలా చూపించుకోవాల్సిన అసవరం లేదు. ఒక దశలో మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసేందుకే సమయం ఇవ్వని కేసిఆర్ ఇప్పుడు ఏకగ్రీవమైన ఓ నలుగురు సర్పంచ్‌లను కూడా కలుసుకునే స్ధితికి చేరింది. ఒక రకంగా ఇది ప్రచారంలో ఓ భాగమని చెప్పుకునే పరిస్దితి వచ్చింది. లేకుంటే గతంలో ఏనాడైనా కేసిఆర్ కనీసం తన నియోజకవర్గ సర్పంచ్‌లను కలిసిన సందర్భం ఒక్కటైనా వుంది. కనీసం ఆయన ఫామ్ హౌజ్ దరిదాపులకు రానిచ్చినట్లు వార్తలేమైనా వున్నాయా? ఇప్పుడు ఏకగ్రీవమైన సర్పంచ్‌తో కలవాల్సిన పరస్దితులు ఎదురౌతున్నాయి. అదే ప్రజాస్వామ్యం. అదే ప్రజాస్వామ్య గొప్పదనం. ఆ ఏకగ్రీవమైన నాలుగు సర్పంచ్‌లు కూడా కేవలం కేసిఆర్ పామ్ హౌజ్‌కు పక్కనే వున్న గ్రామాలు కావడం కూడా విచిత్రం. లేకుంటే ఆ నాలుగు కూడా బిఆర్‌ఎస్ ఖాతాలో పడేవి కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎక్కడ పరువు పోతుందో అన్న ఆందోళనతోనే ఆ నాలుగైదు గ్రామాలను ఏకగ్రీవం చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అదే తెలంగాణ మొత్తం వున్నట్లు చెప్పుకోవడానికి బిఆర్‌ఎస్ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. కాని క్షేత్ర స్దాయిలో ఆ పరిస్దితులు అసలే లేవు. బిఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటున్నట్లు కూడా కనిపించడం లేదు. ఇక ఘట్టం ముందుంది. నిజం చెప్పాలంటే సాదారణ ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల గడువుంది. ఈ మూడు సంవత్సరాలు పంచాయితీలకు నాలుగు రూపాయలు విడుదల కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వాలి. అదే బిఆర్‌ఎస్ సర్పంచ్‌లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లలేరు. నిదులు అడగలేరు. సహజంగ వచ్చే నిధులు గ్రామాభివృద్దికి సరిపోవు. ఎమ్మెల్యే నిధుల నుంచి ఎన్నో కొన్ని నిదులు తేవాల్సి వుంటుంది. తాను సర్పంచ్‌గా వున్న సమయంలో చేసిన అభివృద్ది ఇది అని చూపించుకోవడానికి వుంటుంది. లేకుంటే ఐదేళ్లు చేయడానికి ఏమీ వుండదు. ఆ ఊరికి సర్పంచ్ వున్నారా? అంటే వున్నారు. అనే విధంగా గ్రామ పాలన సాగుతుంది. ఆ సర్పంచ్ పాలన మీద వ్యతిరేతక మొదలౌతుంది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సంక్లిష్ల పరిస్ధితులు ఎదురైనప్పుడు తప్పని పరిస్దితుల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినా పాలక పక్షం తీర్దం పుచ్చుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ఈ మూడు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోవున్నా, సాదారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు వద్దన్నా ఈ సర్పంచ్‌లంతా కాంగ్రెస్‌లో చేరుతారు. చాలా మంది గెలిచిన వెంటనే గ్రామాభివృద్ది కోసం కాంగ్రెస్‌లో చేరుతారు. ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గం అభివృద్ది కోసమంటూ పార్టీలు మారుతున్న సమయం. అలాంటిది సర్పంచ్‌లు మారడం అనేది పెద్ద సమస్య కాదు. అసలు విషయమే కాదు. ఇక బిఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌లు మళ్లీ ఆపార్టీ నాయకులు పెద్దగా పోటీకి ఆసక్తి చూపకపోవడానికి మరో బలమైన కారణం వుంది. గత రెండుసార్లు బిఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌లుగా గెలిచిన వారికి లక్షల రూపాయలు బకాయిలున్నాయి. బిఆర్‌ఎస్ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని నమ్మి పెద్దఎత్తున నిదులు వెచ్చించి గ్రామాభివృద్ది కోసం సొంత నిదులు ఖర్చు చేశారు. అభివృద్ధి పనుల కోసం మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టారు. ఆ పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఆ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ప్రజా ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బకాయిలు చెల్లించలేదు. దాంతో వారి రాజకీయం ఏనాడో తలకిందులైంది. వారిని కదిలిస్తే బోరున ఏడ్వడం తప్ప మరేమీ వుండదు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలంటే కలలో కూడా భయపడే పరిస్దితి వచ్చింది. ఎన్నికంటేనే భయపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పార్టీలకో దండం, పదవికో దండం అని అంటున్నారు. గతంలో మేం చేసిన పనులకు బకాయిలు వస్తే అదే మాకు చాలు అంటున్నారు. ఒక్కసారి సర్పంచ్ అయిన పాపానికి చేసిన అప్పులకు ఆస్ధులు అమ్ముకున్నాం. ఇక చాలు ఈ రాజకీయాలు. ఇక చాలు సర్పంచ్ పదవులు అని చెబుతున్నారు. అందుకే బిఆర్‌ఎస్ నాయకులు సర్పంచ్ ఎన్నికలు అంటేనే దండం పెడుతున్నారు. మమ్మల్ని పార్టీ ఉద్దరించింది చాలు అంటూ ఆ పార్టీ నాయకుల ముఖం మీదే మాజీ సర్పంచ్‌లు చెబుతున్నారు. అంటేనే బిఆర్‌ఎస్ పరిస్దితి అంచానా వేయొచ్చు. ఆ పార్టీ దుస్దితిని అర్దం చేసుకోవచ్చు. ఇది కూడా కాంగ్రెస్‌కు వరమైపోయింది. పల్లెలన్నీకాంగ్రెస్ ఖాతాలో పడేందుకు దారి చూపింది. కాగల కార్యం గందర్వులే తీర్చినట్లైంది. పోటీలో వుంటారనకున్న బిఆర్‌ఎస్ నాయకులు పక్కకు తప్పుకోవడంతో కాంగ్రెస్ గెలుపుకు అడ్డు లేకుండాపోయింది. పల్లెల్లో కాంగ్రెస్ పండుగ చేసుకుంటోంది.