29 న రౌండ్ టేబుల్ సమావేశం..

29 న రౌండ్ టేబుల్ సమావేశం

ఎంసిపిఐ (యు) డివిజన్ సహాయ కార్యదర్శి రాజమౌళి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T121408.236.wav?_=1

నర్సంపేట,నేటిధాత్రి:

రైతాంగ ఉద్యమాలు – ఓంకార్ పాత్ర అంశంపై ఎంసిపిఐ(యు),ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నర్సంపేట మండలం మాదన్నపేటలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంసిపిఐ(యు) పార్టీ నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు రానున్నట్లు తెలిపారు.

తుంకుంట పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..

తుంకుంట పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తుంకుంట పంచాయతీ కార్యదర్శి బీరప్ప సస్పెండ్ అయినట్లు తెలిసింది వివరాలకు వెళితే తుంకుంట గ్రామం లో కోర్టు పరిధిలో ఉన్న భూమి తప్పదు తీర్మానాలు చేసిన విషయం లో ఆయన సస్పెండ్ అయినట్లు అనుకుంటున్నారు. ఈ సస్పెండ్ గత 17 వ తేదీ న అయినప్పటికీ అధికారులు ఇట్టి విషయం లో అధికారికంగా తెలుపడం లో ఆలస్యం చేస్తుండడడంతో పలు అనుమానాలకు అవకాశం కనిపిస్తుంది. వారం రోజులు గడించిన ఇప్పటివరకు తుంకుంట గ్రామానికి కూడా కనీసం ఇంచార్జి గా పంచాయతీ కార్యదర్శి ని నియమించాకపోవడం ఏమిటని అనుకుంటున్నారు.

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జులై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మారపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్టుబడ్డిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాళ్లరాస్తున్నారన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్ లతో బలిచ్చే విధంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము.ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్.. రాజు.. పాల్గొన్నారు.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గౌడ్

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలం
లోని రబీ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేల మరిపెడ మండలంలోని అమాయకులైన రైతులను ఆసరాగా చేసుకుని బీటీ3పత్తి విత్తనాలను విచ్చలవిడిగా మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నారు అదేవిధంగా మరిపెడ మండలంలోని అనుమతి లేని ఫెర్టిలైజర్స్ అనుమతులు ఉండి రెన్యువల్ చేయని చేయని ఫెర్టిలైజర్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిషేధించినటువంటి క్రిమి సహారక రసానిక ఎరువులను అన్ని ఫెర్టిలైజర్ షాపులు నిల్వలు లేకుండా చూడాలని రైతులకు ఎమ్మార్పీ ధరలకు ఎరువుల బస్తాలు క్రిమి సారక మందులను అందించాలని వారు డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని మరిపెడ ఏవో గారికి సిపిఐ మరిపెడ మండలం తరపున కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ యాకన్న సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

 

 

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, మణెమ్మ,శంకర్,రాములు, సత్తన్న, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి

ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి.

మహదేవపూర్ -నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మతినుల్లా ఖాన్ నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు బీటీ కావడం జరిగింది.
గురువారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డ లోని మతిన్ ఖాన్ నివాసంలో కోట రాజబాబు భేటీ కావడం,రాబోయే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తుంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మతిన్ ఖాన్, మహాదేవపూర్ కాటారం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన నాయకుడుగా ఉండడం, రెండు మండలాల్లో ప్రజల్లో పలుకుబడి సంపాదించిన ఖాన్ సాబ్, కావడంతో పంచాయితీ ఎన్నికల్లో, సర్పంచ్ నుండి ఎంపీటీసీ ల పోటీలకు బి ఫాం నుండి, గెలుపు పొందె వరకు ఖాన్ సాబ్ అవసరం ఉంటుంది కనుక, ముందస్తుగా మతిన్ ఖాన్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో, పలు నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కోట రాజబాబు మతిన్ ఖాన్ గృహంలో కలవడం ఒక సాధారణ ప్రక్రియ లో భాగమేనని చెప్పడం జరుగుతుంది.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి
విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విల్సన్

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

ఎస్సీ గురుకులాల విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధులు నుండి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ప్రధన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ డిమాండ్ చేశారు.

మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
చిట్టు పాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ముందుకు సాగుతూ ఎస్సీ గురుకుల ను దేవాలయాల లాగా వుండాలని చెప్పారు.

కానీ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఒక ఐఏఎస్ అధికారిని అయి ఉండి దళిత విద్యార్థుల పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కుల అహంకారంగా భావించాల్సిన అవసరం ఉంది అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను దళితులు పక్షాన ఉన్నాను ఉంటాను అని ఎన్నో వేదికల పైన మనకు తెలపడం జరిగింది కానీ ఇటువంటి కులహంకార అధికారుల వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి వర్షిని మాట్లాడిన మాటలు మనము గమనిస్తే విద్యార్దులే వారి టాయిలెట్లు కడిగితే తప్పేముంది అనే మాట ఏంతో విషపూరిత మాట కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటేనే వారిని తొలగించండి .

వారి మీద రాష్ట్ర ఉన్నత పోలీస్ శాఖకేసును సుమోటోగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విచారణ జరిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలి గురుకులాల సెక్రటరీ పోస్టును అర్హులైన దళిత అధికారిని వెంటనే నియమించాలి అప్పుడే మా దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా చదువుకునే విసులుబాటు అందుతుందిఅని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ టి. ఎం. ఆర్. పి. ఎస్ తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి

సహకరించిన అందరికి ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి

 

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శి గా పాలకుర్తి తిరుపతి ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని.!

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని సస్పెండ్ చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రెటరీ మారేపల్లి మల్లేష్.

చిట్యాల నేటిధాత్రి :

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి 12 జూనియర్ కళాశాలను మూసివేయడానికి కుట్టలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేస్తున్నా ము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగులాంబ గద్వాల కరీంనగర్ చొప్పదండి ఖమ్మం మహబూబాద్ సిద్దిపేట సంగారెడ్డి కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జనగాం మేడ్చల్ మల్కాజిగిరి ఈ 12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరికాదన్నారు విషయం సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియపరుస్తాం అలాగే 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి తెలియక ఆందోళన చెందుతున్నారని వాపోయారు ఆమె నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్విత సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయన్నారు 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసివేయడం వల్ల సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరుపేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారన్నారు. ఈ విషయాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.

మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

 

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. నీలికుర్తి గ్రామంలో ప్యాక్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్నటువంటి 2500 మంది వరి ధాన్యం పండించే రైతుకు కనీస మద్దతు ద్వారా బోనస్ లభించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే నీలికుర్తి గ్రామంలో ఫ్యాక్ సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మార్వో గారికి డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని అందజేయడం జరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా నీలి కుర్తి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు జరిగింది గత రబీ కాలంలో ప్యాక్ సెంటర్ కొనుగోలు వ్యాపారులు దళారులు ప్రమేయాన్ని అరికట్టాలని నీరుకుర్తి గ్రామస్తుల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే దానిని సాకుగా చూసుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ సెంటర్ ని ఎత్తివేయడం వలన రైతులు కనీస మద్దతు ధర బోనస్ను పొందలేకపోతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే ఫ్యాక్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని వినపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్,యాకన్న,అంజి,వస్త్రం తదితరులు పాల్గొన్నారు

డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్.!

*డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ . . .

రాయికల్ .నేటిదాత్రి.తేదీ 11.04. 2025 

 

 

శుక్రవారం రోజున డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం లో భాగంగా డిపో మేనేజర్ కల్పన మేడం గారితో జగిత్యాల – బోర్నాపెల్లి బస్ కడెం వరకు కొనసాగించడం ద్వారా రామాజీపేట, భూపతిపూర్,లింగాపూర్,చింతలూరు, బొర్నపెల్లి గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులకు గురిఅవుతుంద్రు అని ప్రస్తావించగా, ప్రభుత్వ ఆదేశానుసారం కడెం వరకు బస్సు వేయడం జరిగింది అని మేడం తెలుపారు, కాబట్టి ఇక్కడున్న స్థానిక ఎంఎల్ఏ గారికి విజ్ఞప్తి, మన నియోజక వర్గంలో చివరి గ్రామం బోర్నపెల్లి,కావున ఇక్కడి ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి కొన్ని నెలల క్రితం పరిమితికి మించి ప్రయాణికుల ఎక్కడం ద్వారా రాయికల్ కు వచ్చే బస్ వెనక టైర్లు రెండు ఊడి పోవడం జరిగింది అదృష్ట వశాత్తూ ఆ సంఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, అన్ని రోజులు ఒక్కల ఉండవు కావున అలాంటి సంఘట మరొకటి జరుగకముందే బోర్నపెల్లి బస్ అక్కడి వరకే కొనసాగిస్తూ కడేంకు ఇంకొక బస్ వేయడం ద్వారా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వ స్పందించక ఇలాగే పరిస్థితి కొనసాగిస్తే ప్రజల సౌకర్యార్థం ఎలాంటి నిరసనలు ఉద్యమాలు చేయడానికి అయినా సిద్ధం అని మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ అనడం జరిగింది

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్.

లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్

 

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్ గౌడ్ విజయం సాధించారు..ఈ సందర్బంగా ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో &వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక తిరుమల ఫోటో స్టూడియో మందమర్రి పాత బస్టాండ్ లో శాలువా తో సన్మానించి పూలుబొకే అందించడమైనది
కార్యక్రమంలో. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకట స్వామి. ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్. కోశాధికారి బద్రి సతీష్. ఉపాధ్యక్షులు లక్కీరెడ్డి అనిధర్ రెడ్డి. గౌరవ సలహాదారులు. నక్క తిరుపతి. పట్టి సతీష్ బాబు జాడి ముకుందo కార్యదర్శి పసుల రవి. మాజీ ఉపాధ్యక్షులు విక్టరీ అశోక్. తాళ్లపల్లి రమేష్ చింతకింది రవి తదితరులు పాల్గొన్నారు

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడి జిల్లాలోని 12 మండలాలు గ్రామాలలో ప్రజాస్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తారీఖున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేష్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు తెలిపారు

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం.!

బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు.
. ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి
బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత ప్రాముఖ్యత కలదని,ప్రభావశీలమైనదని,ఈ వయసులో అలవడే శాస్త్రీయ దృక్పథం భవిష్యత్తును దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తుందని అన్నారు.భారత దేశానికి చెందిన సి.వి.రామన్ తాను తయారు చేసిన రామన్ ఎఫెక్ట్ కు గాను 1930 లోనే నోబెల్ బహుమతి గ్రహించిన విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలన్నారు.పాఠశాల దశలోనే సి.వి. రామన్ అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తి వాటి సమాధానాలకై అన్వేషించే తత్వమే తనను గొప్ప శాస్త్రవేత్తగా మార్చిందనే విషయాన్ని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తు చేశారు.

Scientific knowledge

ఆయన పుట్టినరోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులు తయారుచేసిన రెండు వందలకు పైగా వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఉత్తమ ఆవిష్కరణలకు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, సైన్స్ ఉపాధ్యాయులు జగదీశ్వర్, గౌతమ్, నాగరాజు, విజయ్, పూర్ణిమ, ప్రీతి, కనకరాజు, మహేందర్, రాజ్ కుమార్, సంపత్, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి, సహకరిస్తే..!

ముందస్తు అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదు-మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య, నారాయణ కళాశాలల ముందస్తు అడ్మిషన్లకు ప్రారంభం చేసిందని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే జిల్లాల్లో పిఅర్ఓలను పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారని, అధికారులు, ప్రభుత్వం కార్పొరేట్ కళశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ నాయకుల సమావేశంలో మచ్చ రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు తమ కళాశాలలో ప్రవేశం పొందాలని గ్రామాల్లో తిరుగుతున్నారని దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆకళాశాలల్లో విద్యార్థులు మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల కోసం తిరుగుతున్న కార్పొరేట్ కళాశాలకు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం కోసం త్వరలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రమేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు రామారావు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిడిపల్లి హేమంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కనకం రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం.

సదస్సును జయప్రదం చేయండి..
న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం..

మర్చి 9వేంకటాపురం మండలకేంద్రంలో న్యాయం నిపుణులతో.

గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.

వాజేడు (నేటి ధాత్రి ):-
ములుగు జిల్లా – వాజేడు మండలం కేంద్రంలో ఇప్పగూడెం గ్రామంలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి, పూనెం,సాయి హాజరై భద్రాచలం కేంద్రంగా ఆదిమ జాతుల కోసం,న్యాయ కళాశాల కోసం మరో న్యాయ పోరాటంలో భాగంగా మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రం కాపేడ్ గ్రౌండ్ లో ఆదివాసి న్యాయ నిపుణులు,ఆదివాసీ సంఘాల నాయకులతో సదస్సును ఏర్పాటు చేసి జయప్రదం చేయాలని, కరపత్రాలు విడుదల చేశారు . తదనంతరం, పూనం సాయి మాట్లాడుతూ .ఏజెన్సీ ప్రాంత అడవి బిడ్డల విద్యారంగంలో ముందుకు రాణించాలని,ప్రత్యేక దృక్పథంతో సుమారు నాలుగు దశాబ్దాలుగా అడవి బిడ్డలుగా ఆలు పెరగని పోరాటాలు కొనసాగించిన ఘనత గొండ్వాన సంక్షేమ పరిషత్ దకిందని,ప్రత్యేక ఉద్యమ సంఘంగా ఆదిమ జాతులకు సేవలు అందించిన చరిత్ర జిఎస్పి కి ఉందని అన్నారు. ఆదిమ జాతుల సంక్షేమాన్ని అభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించిచారని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్, ఐ ఏ ఎస్ జి.ఎస్.పి పోరాటాలను గుర్తించి ఆదిమ విద్యార్థులను మరింత విద్య రంగంలో వెన్ను దన్నుగా నిలిచారని గుర్తుచేశారు.ఉద్యోగ రంగంలో ఆదివాసులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 3 అమలు పరచాలి ప్రత్యేక కృషి చేసిన ఘనత ఆనాటి కలెక్టర్ శ్రీ ఏ గిరిధర్ కి తగ్గిందని వారి వల్లే భద్రాచలంలో జూనియర్ డిగ్రీ కాలేజీలలో 6%శాతం రిజర్వేషన్ నుండి జీవో నెంబర్ 267 ద్వారా 100% అమలుకు నోచుకుందని ఆయన అన్నారు.అప్పటి ఐటీడీఏ పీ వో ప్రవీణ్ ప్రకాష్,ఐ ఏ ఎస్ అప్పటి జిల్లా కలెక్టర్ వారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల భద్రాచలం కేంద్రంలోని టి టి సి బి.ఎ డ్ కాలేజీలు వచ్చాయని అన్నారు.విద్యార్థుల స్వయంపాలన హాస్టల్స్ కూడా 1996,2017 కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.ఇదే తరుణంలో ఆదిమ జాతులకు మరింత చైతన్య రాణించేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లా తీర్చిదిద్దేందుకు,భూభాగంలో భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాలను మంజూరు చేయాలని, ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు కారం,రాజబాబు పదం, సుధాకర్ కారం, గణపతి వెంకటేశ్వర్లు ఆనంద్, మోడెం నవీన్ ,శ్రీనాద్, శ్రీకాంత్, రవి, మడకం ప్రశాంత్, విష్ణు, ఇప్పగూడెం గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

టీ.ఎస్.జే.యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగపూరి నాగరాజ్ నియామకం

వరంగల్, నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రజర్నలిస్ట్స్ యూనియన్ (టి.ఎస్. జే.యూ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వరంగల్ కి చెందిన రిపోర్టర్ నాగపురి నాగరాజు (వి6 టీవీ) ను నియమిస్తూ టి.ఎస్. జే.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. జర్నలిజానికి వృత్తి విలువలు, సూత్రాలను నిలబెట్టడంలో అచంచలమైన నిబద్ధతకు గుర్తింపుగా ఈ పదవి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగపూరి నాగరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం తో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినందుకు టి ఎస్ జె యు రాష్ట్ర అధ్యక్షులు నారగాని పురుషోత్తం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి తోకల అనిల్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించి న వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండామోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి అవునూరి కుమారస్వామి, వైస్ ప్రెసిడెంట్స్ కృష్ణ, గంగరాజు, యూనియన్ కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని, తెలంగాణలోని జర్నలిస్టులందరికీ మద్దతు ఇచ్చే టీ.ఎస్.జే.యు సంఘాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తానని నాగపూరి నాగరాజ్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version