పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..

పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ హెచ్చరిక

నెక్కొండ, నేటి ధాత్రి

బీసీ నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండటం, బీసీ మంత్రులు ప్రభుత్వంలో ఉన్నా బీసీ బిడ్డలకు న్యాయం జరగకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు అధికార పార్టీ మౌన సమ్మతి ఇస్తోందని మండిపడ్డారు.నాగర్‌కర్నూల్ మండలం చాకలి ఐలమ్మ గారి సెంటర్ పరిధిలోని కుమ్మెర గ్రామంలో కుమ్మరి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన కుల అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. దైవ దర్శనానికి వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని తక్కువ కులం వారు అంటూ గుడిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, నోటికొచ్చినట్లు దుర్భాషలాడటం దొరల పాలన కొనసాగుతుందనే దానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రకళ జగ్గయ్య దంపతులపై కుల ఉన్మాదంతో దాడి చేసి, వెంట్రుకలు పట్టుకుని ఈడ్చి, జాతరకు వచ్చిన జనాలపైకి విసిరి కొట్టడం అత్యంత అమానుషమని తెలిపారు. విషయం ఏమిటని అడిగిన వారి చిన్న కుమారుడు గణేష్‌పై కూడా అధికార పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ సహా నలుగురు కలిసి పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు.
పసిపాపను చూసైనా వదిలేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా, కనికరం లేకుండా రెండు నెలల చిన్నారిని కాలితో తన్ని చంపడం కుల రాక్షసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ పసిపాప మృతికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలని, ఇది ప్రభుత్వ హత్యతో సమానమని గటిక అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.నిందితులను గుర్తించినప్పటికీ ఇప్పటికీ అరెస్టులు జరగకపోవడం వెనుక రాజకీయ అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. దోషులను కాపాడే ప్రయత్నం కొనసాగితే బీసీ, బహుజన సమాజం మౌనంగా ఉండదని హెచ్చరించారు. ఎంతటి వారైనా సరే దోషులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బహుజనులపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

మేడారం సమ్మక్క సారలమ్మ పాదయాత్ర ప్రారంభం

మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తజనులు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులపై అచంచలమైన భక్తితో వరంగల్ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత మానుకోట జిల్లా తొర్రూర్ నుంచి భక్తజనులు పాదయాత్రగా మేడారం వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్ర బృందం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రజలకు, భక్తి భావంతో దర్శనమిచ్చారు.ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ పాదయాత్రను ఈ సంవత్సరం కూడా గురువారం 22వ తేదీ నుంచి ప్రారంభించగా, సోమవారం 26వ తేదీన మేడారం చేరుకోనున్నట్లు పాదయాత్రకు సమన్వయం వహిస్తున్న కూరపాటి కామారాజు తెలిపారు.
ఈ పాదయాత్రలో స్త్రీలు, పురుషులు కలిపి సుమారు 300 మంది భక్తులు గ్రూపులుగా బయలుదేరగా, ఒక్కో గ్రూపులో సుమారు 45 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. పూర్వీకుల కాలం నుంచే తమ కుటుంబాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా ప్రతి జాతర సమయంలో పాదయాత్రగా వెళ్లి తల్లుల దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పాదయాత్రలో హస్తం వెంకన్న, తిరుపటి శ్రీనివాస్, కిన్నెర మోహన్, హస్తం వెంకటమ్మ, తిరుపటి శైలజ, లక్ష్మి, సారమ్మ, ధనమ్మ, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, యువకులు, యువత సమాన ఉత్సాహంతో మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ పాదయాత్ర భక్తుల హృదయాలను కదిలిస్తోంది.

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ…

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన డిసిఓ నీరజ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక సొసైటీ సహకార సంఘాల పిఎసిఎస్ మరియు ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ జిల్లా డిసిఒ నీరజ చేతుల మీదగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల అసోసియేషన్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు మోడం సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల సురేష్, కోశాధికారి రాచమల్ల రమణ చారి, కార్యదర్శి ప్రదీప్, దామోదర్ ,మురళి, ఈగ వెంకటేశ్వర్లు, రవి కిరణ్, రాజు, సోమశేఖర్, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

నెక్కొండ గ్రామ సర్పంచ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ సర్పంచ్
#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన కొమ్ము ఉపేందర్ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాంపెల్లి నిరోషా శ్రావణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పదవ రోజు కార్యక్రమానికి తమ వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇడంపాక ప్రకాశం, బీసీ సెల్ అధ్యక్షులు కోలా నరేష్, రామాలయ కమిటీ వైస్ చైర్మన్ చీకటి సుమన్, వార్డు సభ్యులు చీకటి వెంకన్నతో పాటు సీనియర్ నాయకులు ఎడ్ల సురేందర్, చిదరాల నరేష్, రామస్వామి, బిక్షపతి, వేణు, హనుమంతు, అశోక్, యాకయ్య, శ్రీను తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
గ్రామ పాలకులు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

నెక్కొండ వ్యవసాయ కార్యాలయానికి పండుగ శోభ

నెక్కొండ వ్యవసాయ కార్యాలయానికి నూతన శోభ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం గత నాలుగు దశాబ్దాలుగా సున్నం కూడా చూడని స్థితిలో బూజు పట్టిన గోడలతో నిర్లక్ష్యానికి గురై ఉండేది. అలాంటి కార్యాలయంలోనే వ్యవసాయ అధికారులు విధులు నిర్వర్తిస్తూ రావడం గమనార్హం.
ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుత మండల వ్యవసాయ అధికారి నాగరాజు కార్యాలయానికి నూతన రూపు కల్పించారు. కార్యాలయానికి రంగులు వేయించి, లోపల నీటితో శుభ్రంగా కడిగి, సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పూలదండలతో అలంకరించి, గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయలు కొట్టి కార్యాలయాన్ని పండుగ వాతావరణంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు.
నూతన శోభతో కళకళలాడుతున్న కార్యాలయంలో వ్యవసాయ సేవలు అందించడం రైతులకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా శుభ్రత, ఆత్మీయతతో ఉంటే ప్రజలకు మరింత చేరువ అవుతాయనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది.

మండలంలో నామినేషన్లకు 14 క్లస్టర్ సెంటర్లు సిద్ధం..

మండలంలో నామినేషన్లకు 14 క్లస్టర్ సెంటర్లు సిద్ధం

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలంలోని
39 గ్రామపంచాయతీలకు 14 క్లస్టర్ల ఆధారంగా వార్డు, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు సిద్ధం చేసిన అధికారులు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన 14 క్లస్టర్ సెంటర్ల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 39 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు సంబంధిత క్లస్టర్ సెంటర్ల వద్ద స్వీకరించబడనున్నాయి. ప్రజలకు ఎలాంటి గందరగోళం లేకుండా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సాగేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ఎంపీడీవో యసం లావణ్య తెలిపారు.
క్లస్టర్ వారీగా గ్రామాలు – వార్డు సంఖ్యలు:
* అలంకానిపేట్ క్లస్టర్
అలంకానిపేట – 10 వార్డులు
బొల్లికొండ – 10 వార్డులు
రెడ్డియనాయక్ తండా – 8 వార్డులు
అమీన్‌పేట్ క్లస్టర్
అమీన్‌పేట్ – 8 వార్డులు
పనికర – 8 వార్డులు
రామన్నకుంట తండా – 8 వార్డులు
టేకులకుంట తండా – 8 వార్డులు
అప్పలరావుపేట క్లస్టర్
అప్పలరావుపేట – 10 వార్డులు
తోపనపల్లి – 10 వార్డులు
వెంకటాపురం – 10 వార్డులు
* బంజారపల్లి క్లస్టర్
బంజారపల్లి – 8 వార్డులు
లవుడియా వాగ్య నాయక్ తండా – 8 వార్డులు
చంద్రుగొండ క్లస్టర్
చంద్రుగొండ – 10 వార్డులు
గొల్లపల్లి – 10 వార్డులు
మూడుతండా – 8 వార్డులు
దీక్షకుంట క్లస్టర్
దీక్షకుంట – 10 వార్డులు
దేవుని తండా – 8 వార్డులు
సీతారాంపురం – 6 వార్డులు
ముదిగొండ క్లస్టర్
హరిచంద్ తండా – 8 వార్డులు
ముదిగొండ – 8 వార్డులు
గుండ్రపల్లి క్లస్టర్
గుండ్రపల్లి – 10 వార్డులు
కసాన తండా – 8 వార్డులు
మడిపల్లి – 8 వార్డులు
నాగారం క్లస్టర్
నాగారం – 10 వార్డులు
నక్కలగుట్ట తండా – 8 వార్డులు, కాగా నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ క్లస్టర్లు నెక్కొండ 14 వార్డులు నెక్కొండ తండా ఆరువార్డులు పత్తిపాక 8 వార్డులు, పెద్ద కొరుపొలు క్లస్టర్లో పెద్ద కొరుపొలు 10 వార్డులు, వెంకట తండా 8 వార్డులు, రెడ్డవాడ క్లస్టర్లు అజ్మీర మంగ్య తండ 8 వార్డులు, గొట్లకొండ ఎనిమిది వార్డులు, రెడ్లవాడ 10 వార్డులు, సాయి రెడ్డి పల్లి క్లస్టర్లో మహబూబ్ నాయక్ తండ 8 వార్డులు, పిట్ట కాలు బోడు తండా ఎనిమిది వార్డులు, సాయి రెడ్డిపల్లి ఎనిమిది వార్డులు, సూరిపల్లి క్లస్టర్ లో చెరువు ముందరి తండా ఎనిమిది వార్డులు, చిన్న కొరుపోలు 8 వార్డులు, సూరిపల్లి 10 వార్డులు. ఎంపీడీవో యసం లావణ్య మాట్లాడుతూ కేటాయించిన గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యాలని ప్రజల సౌకర్యార్థం క్లస్టర్లుగా నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. కేటాయించిన క్లస్టర్ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు వార్డు నెంబర్లుగ పోటీ చేసేవారు నామినేషన్ వేయాలని ఆమె అన్నారు.

నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు..

నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

మండలంలో వానాకాలం పంటల సాగు మొత్తం 26,956 ఎకరాలకు చేరినట్లు తహసిల్దార్ వేముల రాజ్ కుమార్ చైర్మన్ తెలిపారు. గురువారం లైన్ డిపార్ట్మెంట్లతో కలిసి పంటల విస్తీర్ణంపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగులోకి వచ్చాయని వివరించారు. సమావేశంలో యం పి యస్ ఓ హనుమంతు నాయక్, ఏ ఓ నాగరాజు, ఇరిగేషన్ ఏ ఈ ఈ చందన, ఏ ఈ ఓలు రాజేష్, రఘు పాల్గొన్నారు.

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి..

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంలో ఇంద్ర గాంధీ జయంతి సందర్భంగా ఇంద్ర గాంధీ విగ్రహానికి నర్సంపేట టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నేడు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే నాయకురాలు, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని దేశం స్మరించుకుంటూ దాని ప్రజాహితమే పరమ ధర్మంగా భావించి, కఠిన నిర్ణయాలు తీసుకున్న ఉక్కు మహిళగా ఆమె భారత రాజకీయాలకు చెరగని ముద్ర వేశారని గ్రీన్ రివల్యూషన్‌ నుండి పేదల సంక్షేమ పథకాల దాకా, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన శక్తి ఆమెదే.
దేశ ఐక్యత, భద్రత, మహిళ సాధికారత కోసం చేసిన ఆమె సేవలు నేటికీ ప్రజలకు ప్రేరణ ఇంద్ర గాంధీ సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయి కృష్ణ, కుసుమ చెన్నకేశవులు ,కొల్లు వెంకటసుబ్బారెడ్డి, రామలింగేశ్వర ఆలయ చైర్మన్, కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, మెరుగు విజయ్ ,గంధం సుధాకర్ ,మహమ్మద్ అన్వర్, ప్రభాకర్, రావుల మహిపాల్ రెడ్డి ,సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను, తదితరులు పాల్గొన్నారు.

కంట మహేశ్వర ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతుంది..

కంట మహేశ్వర ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతుంది

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంలో గౌడ కులస్తులు నిర్మించనున్న కంట మహేశ్వర స్వామి దేవాలయ భూమి పూజా కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, సమాజ అభ్యున్నతి కోసం దేవాలయాలు కేవలం ఆరాధనా స్థలాలు మాత్రమే కాదు, ఐక్యతను పెంపొందించే ఆధ్యాత్మిక కేంద్రాలని అన్నారు.
“గౌడ కులస్తుల శ్రద్ధ, శక్తి, సంకల్పంతో రూపుదిద్దుకునే ఈ ఆలయం నెక్కొండకు మరో ఆధ్యాత్మిక చిరునామా కానుందని. ఈ దేవాలయం ద్వారా యువతలో ఆచార సంస్కృతులు మరింత పటిష్టం అవుతాయని, ప్రభుత్వంగా మత సంస్థల అభివృద్ధికి కావలసిన సహాయాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని ఎమ్మెల్యే మాధవరెడ్డి పేర్కొన్నారు.
కంట మహేశ్వర స్వామి ఆలయం నిర్మాణం గౌడ సమాజ ఏకగ్రీవ ఆశయమని, వారి దీక్ష, భక్తి ఈ నిర్మాణానికి బలమని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి సాయికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, మాదటి శ్రీనివాస్, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘ నాయకులు, కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది…

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది.
పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు.
నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు.
తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
“వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.”
అని అన్నారు.
పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు.
సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.

జిల్లా కలెక్టర్ నెక్కొండలొ పర్యటన…

జిల్లా కలెక్టర్ నెక్కొండలొ పర్యటన

పంట నష్టం, కూలిపోయిన గృహాల పై సమీక్ష

రైతులకు ధైర్యం చెప్పిన కలెక్టర్

#నెక్కొండ, నేటి ధాత్రి:

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం నెక్కొండ మండలంలో పర్యటించారు. వర్షాల ప్రభావంతో నష్టపోయిన పంటలను, కూలిపోయిన గృహాలను, గోడలను ఆమె స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రెడ్లవాడ, పెట్టకాలు బొడు తండా, నాజీ తండా, గ్రామాల్లో పంటలను కలెక్టర్కు చూపించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కొమురయ్య తదితరులు. వెంకటాపురం, తోపనపల్లి గ్రామాల మధ్య తెగిపోయిన కల్వర్టులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ—ఈ కల్వర్టు గత సంవత్సరం కూడా ప్రమాదానికి గురైందని, ఆ సమయంలో తానూ అదే ప్రాంతాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.
పంట నష్టం సర్వేను వేగంగా పూర్తి చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు రెండు రోజుల్లోగా సర్వే ముగించాలని ఆమె ఆదేశించారు. పంట కోతకు సిద్ధంగా ఉండి వర్షంతో నిటమునిగిన వరి పంటను ప్రభుత్వం బైల్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
అలాగే గ్రామాల్లో కూలిపోయిన గృహాలు, కూలిపోయిన ఇంటి గోడలపై రెవెన్యూ శాఖ సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో తహసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో యసం లావణ్య, ఎంపీడీవో కార్యాలయ సుపరింటెండెంట్ దయాకర్, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్ బీభత్సం…

తుఫాన్ బీభత్సం

నెక్కొండ మండలంలో భారీ నష్టం

#నెక్కొండ,నేటి ధాత్రి :

మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెక్కొండ, నర్సంపేట, కేసముద్రం, చంద్రుగొండ పరిసర గ్రామాలు వాగులు, వరదలతో చుట్టుముట్టి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులు చెరువుల్లా మారిపోగా, పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పనికర రైతులు వట్టేవాగు వెంబడి సుమారు 500 ఎకరాల పైన పంట నీట మునిగింది .ఈ పంట మొత్తం పది రోజుల్లో చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్రమైన ఆవేదన అవుతున్నారు. పనికర గ్రామానికి చెందిన బుర్ర సమ్మిరెడ్డి సంజీవ గర్నెపల్లి రామిరెడ్డి ,సుదర్శన్ రెడ్డి, రాజనర్సింహారెడ్డి, రేగుల ప్రతాపరెడ్డి పైండ్ల రాములు, మధు ,లక్ష్మయ్య, కమలమ్మ,సింగం సమ్మయ్య ఒగ్గుల దేవేందర్ ,ప్రభాకర్, దూదిపాల బాబు, బిక్షపతి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గడ్డ బోయిన కుమారస్వామి, కాశబోయిన కుమార్, కొత్త మోహన్ రెడ్డి, రైతుల
పంటలు పూర్తిగా నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనికర గ్రామానికి చెందిన రైతు బుర్ర సమ్మిరెడ్డి, భార్య సరోజన ,దంపతులు వేదనతో చెబుతూ “నాలుగు రోజులైతే కోయాల్సిన పంట వట్టే వాగులో కొట్టుకుపోయింది. లక్షల్లో నష్టం జరిగింది. కొద్ది నెలల క్రితం చనిపోయిన మా చిన్నకొడుకు చేసిన అప్పులు తీర్చే అవకాశం ఈసారి వస్తుందని అనుకున్నాం, కానీ మళ్లీ దెబ్బతిన్నాం” అని కన్నీటి స్వరంతో తెలిపారు.
పంట నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైందని చెబుతున్నారు. అధికారులు గ్రామాల పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేయాలని ప్రజలు కోరుతున్నారు.

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం…

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

పలు గ్రామాలలోని కాలనీలలో చేరిన వరద నీరు

వేల ఎకరాలలో మునిగిన వరి పంట

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో భారీ ఎత్తున పంట నష్టం తో పాటు పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు, పాలకులు, అప్రమత్తమై పలు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట , పత్తి పంటలు తుఫాన్ దాటికి నేలకొరకగా, కొన్ని ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి.

ముఖ్యంగా నెక్కొండ మండలం నుండి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం లో లెవెల్ కొట్టుకుపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వట్టే వాగు ప్రభావంతో భారీగా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎస్సై మహేందర్ రెడ్డి, తాసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో లావణ్య వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు గ్రామాలలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నాగారం గ్రామంలో నీట మునిగిన ఎస్సీ కాలనీ

నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుఫాన్ దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులను స్థానిక తహసిల్దార్ వేముల రాజకుమార్, నాగారం పలు పార్టీలకు చెందిన నాయకులు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందించారు. అంతేకాక నాగారంలోని తుఫాన్ దాటికి ఓ భారీ వృక్షం కింద పెట్టిన పల్సర్ బైక్ పై వృక్షం కూలడంతో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది.

ఎవరు కూడా బయటికి రావద్దు

భారీ తుఫాన్ ప్రభావంతో నెక్కొండం మండలంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని రాబోయే 48 గంటల వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయటికి రావద్దని స్థానిక తాసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో లావణ్య, ఎస్సై మహేందర్ రెడ్డిలు తెలిపారు.

పోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన….

పోలీస్ వ్యవస్థ పై విద్యార్థులకు అవగాహన

#నెక్కొండ ,నేటి ధాత్రి:

పోలీస్ అమరవీరుల వార్షికోత్సవాల సందర్భంగా నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెక్కొండ మండల కేంద్రంలోని విద్యోదయ హై స్కూల్ విద్యార్థుల పాల్గొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ వ్యవస్థ పని చేసే పనితీరును ఎస్సై మహేందర్ రెడ్డి తో పాటు కానిస్టేబుళ్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పోలీస్ సిబ్బంది, విద్యోదయ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

అకాల వర్షాలకు పొంగిపొర్లుతున్న ప్రధాన రహదారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T114530.034.wav?_=1

 

అకాల వర్షాలకు పొంగిపొర్లుతున్న ప్రధాన రహదారులు

పిడుగుపాటుకు రెండు పాడి గేదెల మృతి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

అకాల వర్షాలకు నెక్కొండలోని పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలగగా ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం వర్షానికి కొట్టుకపోవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు ప్రధానంగా నెక్కొండ నుండి కేసముద్రం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై తోపనపల్లి వెంకటాపురం గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు కు వరద నీరు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అంతేకాక మొక్కజొన్నలు రోడ్లపై ఆరబెట్టడంతో సోమవారం తెల్లారిజామున హఠాత్తుగా ఒక్కసారిగా కురిచిన వర్షానికి ధాన్యం కొట్టుకపోవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లనే చెప్పవచ్చు. చంద్రుగొండ గ్రామంలోని దాసరి సంపత్ అనే రైతు కు సంబంధించిన రెండు పాడి గేదలు పిడుగుపాటుతో మృతిచెందగా రైతు కుటుంబ సభ్యులు బోరుణ విలపించారు. అనంతరం రెండు పాడి గేదెల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం…

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం

మాట నిలబెట్టుకున్న సొంటి రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

క్కొండ మండల కేంద్రంలోని నవత ఆటో యూనియన్ సభ్యులందరికీ తన సొంత ఖర్చులతో ఉచితంగా ప్రమాద బీమా చేపిస్తానన్న మాట ప్రకారం. 160 మంది డ్రైవర్లకు సంవత్సరం పాటు ఉచితంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ చేపించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ సెంటర్లో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ భీమ పత్రాలను నవత ఆటో యూనియన్ డ్రైవర్లకు అందించిన సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, ఈ సందర్భంగా సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరమే కాకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ బీమా అందరికీ చెల్లిస్తానని ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే వాళ్ల పేర్లు కూడా పంపించాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని యూనియన్ బాధ్యులకు తెలిపారు. డ్రైవర్ల అందరూ ప్రభుత్వానికి పరోక్షంగా సేవ చేస్తున్నారని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుటలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వీరి కుటుంబాలు వీరిపై ఆధారపడి ఉన్నాయని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా చట్టప్రకారం ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఇలాంటి ఇన్సూరెన్స్ లను వినియోగించుకోవాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కి చిరు సన్మానం చేశారు .కార్యక్రమంలో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్, శ్రీరంగం శ్రీనివాస్, ఉల్లేరావు ప్రభాకర్, పెండ్యాల రాజు, బద్రు నాయక్, మోడెం రాజు, మహమ్మద్ అమీర్, నవత ఆటో యూనియన్ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక బ్యాంకుకు తాళం వేసిన అధికారులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T151739.068.wav?_=2

 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక బ్యాంకుకు తాళం వేసిన అధికారులు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

నెక్కొండ మండలంలోని అలంకానిపేట లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవలు కరెంటు సరఫరా లేకపోవడంతో మంగళవారం నిలిచిపోయాయి. బ్యాంకుకు వచ్చిన వినియోగదారులను లోనికి రానివ్వకుండా బ్యాంక్ అధికారులు బ్యాంకుకు తాళం వేసి బయటనే ఉంచడం హేయమైన చర్యగా వినియోగదారులు బ్యాంకు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. బ్యాంకులో కరెంటు సరఫరా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇన్వర్టర్ లేదా ఏదో ఒకటి ప్రతి బ్యాంకులో ఉంటుంది కానీ ఇక్కడ లేకపోవడం అధికారులు నిర్లక్ష్యం కాదా అని పలువురు ఖాతాదారులు ప్రశ్నించారు. కొందరు ఈ ఎం ఐ, మహిళా సంఘాల పొదుపు, రుణాలు, చివరి రోజు బ్యాంకులో చెల్లించాల్సి వస్తే వారందరూ నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బ్యాంకు వినియోగదారులు ఖాతాదారులు పత్రిక విలేకరులతో అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం…

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హత పొందిన పనులను ఎమ్మెల్యే మాధవరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందని ఈ పథకం ద్వారా ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, పంట సాగులు, గొర్రెల గేదెల షెడ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతో తోడ్పడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, అడిషనల్ పీడీ రేణుక, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, డిసిసి కార్యదర్శి హరిప్రసాద్, సాయి కృష్ణ, ఆవుల శ్రీనివాస్, తిరుమల్, బండి శివకుమార్, రావుల మైపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, ఉడుగుల అశోక్, వడ్డె ఏకాంబరం, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేద్దాం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T134225.060.wav?_=3

 

రాజకీయాలకు అతీతంగా నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేద్దాం

మాజీ ఎంపీపీ ఘటిక అజయ్ కుమార్

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంలో నాడు అన్ని రాజకీయ పార్టీలు హామీలు కురిపించాలని నెక్కొండను మున్సిపాలిటీగా చేయడంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నెక్కొండ మాజీ ఎంపీపీ ఘటిక అజయ్ కుమార్ ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ నెక్కొండ మండలం రాష్ట్రంలోనే 39 గ్రామపంచాయతీ లతో పెద్ద మండలం గా ఉందని కేవలం నెక్కొండ జనాభా 7700 పైచిలుకు కలిగి ఉన్న నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి అన్ని విధాల అర్హతలు పొందిన మండలం నెక్కొండ అని మున్సిపల్ యాక్ట్ 2018 ప్రకారం ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామపంచాయతీలను నెక్కొండ మున్సిపాలిటీ లోకి పరిగణిస్తే నెక్కొండ తో పాటు నెక్కొండ తండా, గుండ్రపల్లి, పత్తిపాక, అప్పలరావుపేట్, అమీన్ పేట, పనికర, టీకే తండాలతో 176 64 జనాభా విస్తీర్ణం కలిగి మున్సిపాలిటీగా ఏర్పడేందుకు అనుగుణంగా ఉందని వెంటనే స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి, ఉన్నత అధికారులకు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పడేందుకు తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పలరావుపేట మాజీ సర్పంచ్ వడ్డే రజిత సురేష్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version