రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

 రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి.

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి పదవికి షిగేరు ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయనున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో చీలకను నిరోధించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇషిబా ధ్రువీకరించినట్టు జపాన్ ప్రభుత్వరంగ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఇషిబా సారథ్యంలోని ఎల్‌డీపీ ఎగువ సభ, దిగువ సభ రెండింటిలోనూ మెజారిటీని కోల్పోయిన క్రమంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఎగువ సభలో 248 సీట్ల మెజారిటీని సాధించడంలో ఎన్‌డీపీ విఫలమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో ఓటమికి బాధ్యత వహించాలంటూ పార్టీలోనే అసంతృప్తులు పెరిగాయి. ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామా నిర్ణయానికి వచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బిజెపిలో చేరికలు.

#రాబోయే స్థానిక ఎన్నికల్లో యువతకే పెద్దపీట.

#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకే మొదటి ప్రాధాన్యత దక్కుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు సోమవారం మండలంలోని రంగాపురం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ముల్క రాజేష్ తో పాటు 50 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి రాణా ప్రతాపరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం గ్రామ కూడలిలో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ. ఈరోజు పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి పల్లెకు నేరుగా నిధులను విడుదల చేసి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా పథకాలను రూపొందించి గ్రామాలు దృశ్యశ్యామలంగా ఈరోజు ఇలా ఉన్నాయంటే దానికి కారణం మోడీ ప్రభుత్వం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం, రైతులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు పెట్టుబడి సహాయం, ప్రతి గ్రామాలలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, సిసి రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటు, పి ఎం జి ఎస్ వై,, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా తారు రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి మరెన్నో అభివృద్ధి పనులకు మోడీ ప్రభుత్వం నిధులను సమకూర్చుతున్నది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం లో ఎక్కువ స్థానాల్లో యువకులకే అవకాశం కల్పించి ప్రజా ప్రతినిధులను చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి ,జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి ,సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు ,మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version