ఝరాసంగం మండల కేంద్రంలోని జిర్లపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు తన గ్రామంలో శాలువా పూలమాలలతో సన్మానించి బాణా సంచలు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన గ్రామ నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి ఘనంగా నిర్వహించారు, ముఖ్యఅతిథిగా గోరేగావ్ గ్రామ సర్పంచ్ నాగేందర్ పటేల్ తమ కార్యకర్తలతో పాల్గొని వెంకట్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
*త్వరగా కోలుకుని పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించిన చిత్తూరు శాసనసభ్యులు…
*ఎమ్మెల్యే గురజాలకు ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ నీలకంఠం నాయుడు ,పార్టీ కార్యకర్త శోభన్ బాబు…
చిత్తూరు (నేటి ధాత్రి:
చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు మండలం, కుర్చివేడు పంచాయతీ, కుర్చీ వేడు గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇన్చార్జ్ శోభన్ బాబు అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కుర్చివేడు పంచాయతీ పర్యటనలో భాగంగా మాజీ వైస్ ఎంపిపి, మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నీలకంఠం నాయుడు ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా నీలకంఠం నాయుడు కుమారుడు, టిడిపి కార్యకర్త శోభన్ బాబును పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు.అలాగే వృద్దాప్యంలో ఉన్న పార్టీ కురువృద్ధుడు నీలకంఠం నాయుడు, ఆయన కోడలు, శోభన్ బాబు సతీమణి బిందు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు తెలుగు దేశం పార్టీకి ఎనలేని సేవలందించారనీ గుర్తు చేసిన ఎమ్మెల్యే,, భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి కోసం ఇదే వరవడితో పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారికి తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఈ క్రమంలో నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు, సతీమణి బిందు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కు ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.. తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గురిజాల జగన్ మోహన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసా వాచా కర్మణా దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు నీలకంఠం నాయుడు, శోభన్ బాబు, ఆయన సతీమణి బిందు తెలియజేశారు.
ఓటమి గెలుపుకు తొలిమెట్టు-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల,నేటిధాత్రి
ఓటమి గెలుపుకు తొలిమెట్టని మాజీ శాసనసభ్యులు చల్లధర్మ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీపడి ఓటమి చెందిన బిఆర్ఎస్ అభ్యర్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు.శనివారం పరకాల మండలం పోచారం,వెల్లంపల్లి,పైడిపల్లి,కామారెడ్డిపల్లి గ్రామాలలో వారు పర్యటించారు.ఈ సందర్భంగా ఓటమించేందిన పార్టీ అభ్యర్థులను కలిసి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాయ్ తాగుతున్న కేకే మహేందర్ రెడ్డి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక తాడూరు చౌరస్తాలో గల భాస్కర్ చాయ హోటల్లో చాయ్ తాగుతూ పార్టీ నాయకుల కార్యకర్తల తో. తంగళ్ళపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించుకోవడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా నాయకులు కార్యకర్తలతో మమేకమై టీ స్టాల్ వద్ద వారితో మాట్లాడుతూ సామాన్య వ్యక్తి లాగా నాయకుల కార్యకర్తలు అందరితో మమేకమై కలిసి తిరుగుతూ తాను కూడా సామాన్య కార్యకర్త ననిచెప్పగానే చెప్పినాడు. ఇలాంటి సామాన్యమైన వ్యక్తి మనకు ఏ ఆపాదవచ్చిన అందుబాటులో ఉండి మనల్ని సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఆయనను నాయకులు కార్యకర్తలు కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ తో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి టీ తాగి అందరూ అందుబాటులో ఉండి మన అనుకున్న దానికంటే మెజార్టీ ఎక్కువ స్థానాలు సాధించే దిశగా కష్టపడాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేశారు
◆-: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, మొగుడంపల్లి మండల్, గుడ్పల్లి గ్రామంలో ఊరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మైనారిటీ కూడా సర్పంచ్ గా పోటీ చేసిన చరిత్ర లేదు కానీ టీఆర్పీ పార్టీ మొగుడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ లతీఫ్ గారు చరిత్రకి బిన్నంగా ధైరంగా ముందుకు వచ్చి సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది.అలాగే లతీఫ్ గారు గుడ్పల్లి గ్రామ సమస్యల పైన మంచి అవగాహన కలిగిన వ్యక్తి మరియు తనని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామం అభివృధి కోసం ఎంతవరకైనా మరియు ఏ లీడర్ తోనైనా పోరాడి గ్రామ అభివృద్ధి చేస్తాను అని చెప్పడం జరిగింది. లతీఫ్ నామినేషన్ వేసి బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థుల్లో దడ పుట్టించారు, అందుకే బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ వాళ్లు ఎన్ని ప్రలోభాలకు గిరి చేసిన కూడా, ప్రలోభాలను గడ్డి పోస లాగా పక్కన పెట్టి ముందుకు సాగడం చూస్తుంటే ధైర్యం లో తీన్మార్ మల్లన్న గారికి ఏ మాత్రం తీసిపోరు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.ఈ నెల 14-12-2025 రోజున బ్యాగ్ గుర్తుకే ఓటు వేసి లతీఫ్ గారిని గెలిపించాలని వారు ప్రజలను కోరడం జరిగింది.తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో ఉన్న నాయకులు గాని మరియు కార్యకర్తలు గాని ధైర్యానికి ప్రతిరూపమని లతీఫ్ మరొకసారి నిరూపించారు.సర్పంచ్ అభ్యర్థి లతీఫ్ గారికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్, సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి వరప్రసాద్, మొగుడంపల్లి మండల్ అధ్యక్షుడు శీను, మొగుడంపల్లి మండల నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,తెలంగాణ ఏర్పాటులో చారిత్రాత్మక పాత్ర పోషించిన సీనియర్ ఎఐసిసి నాయకురాలు సోనియా గాంధీ జయంతి సందర్భంగా, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆమె జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, పార్టీ నాయకులు దేశం తెలంగాణ కోసం సోనియా గాంధీ చేసిన సేవలకు సేవలందించారనరు కేక్ కట్ చేసి వేడుకను ప్రారంభించారు.తెలంగాణ ప్రజల మనోభావాలను మరియు యువత త్యాగాలను అర్థం చేసుకున్న సోనియా గాంధీ, రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని, ఇది ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో అన్నారు. పెద్ద సంఖ్యలో నాయకులు మరియు కార్యకర్తల భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, సీనియర్ కార్యకర్తలు మరియు యువ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరియు సోనియా గాంధీ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందాలీ మండల బిజెపి అధ్యక్షులు..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల బిజెపి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో పలు విషయాలపై చర్చించి వివరాలు వెల్లడించిన మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు సర్పంచ్ ఎన్నికల్లో మరియు వార్డ్ మెంబర్స్.పోటీ చేయడం కొరకు విధి విధానాల గురించి చర్చించడంతోపాటుప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించాలని అలాగే ప్రతి ఇంటికి వెళ్లి 420 హామీలు వాటి మోసాలను వివరించాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి. బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇతర పార్టీల అందరికీప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి సంస్కరణ గురించి ప్రతి ఇంటికి గడప.గడపన తెలియజేయాలని ప్రతి కార్యకర్త తమ కర్తవ్యం గా పనిచేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటిరాజు. మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోసినీ వినయ్ యాదవ్. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్.బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మోర్చా అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్చార్జులుమహిళా బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్
పరకాల,నేటిధాత్రి
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన సందర్బంగా పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి,స్వీట్లు పంచి సంబరాలను జరుపుకున్నారు.ఈ గెలుపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలుపుతూ గెలుపొందిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలే కాక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని ఎన్నిక ఏదైనా గెలుపు ఇకనుండి కాంగ్రెస్ పార్టీ దే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఎంసీ వైస్ చైర్మన్ బుజ్జన్న,రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను,సమన్వయ కమిటీ సభ్యులు,చిన్నాల గోనాథ్ ఈర్ల చిన్ని,పంచగిరి జయమ్మ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,సదానందం గౌడ్,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్ కుమార్,మంద నాగరాజు,రఘు నారాయణ,దార్నా వేణుగోపాల్,బొమ్మ కంటి చంద్రమౌళి,దుప్పటి సాంబశివుడు,బొచ్చు భాస్కర్,దావు పరమేశ్వర్,దుగ్గేల వినయ్,బాసాని సుమన్,సురేష్,బండారి కృష్ణ,మచ్చ సుమన్,నాగరాజు,సదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై
◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
◆:- కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సేన పార్టీ అధ్యక్షులు ఆవుల హన్మన్లు టీఆర్పీ పార్టీ లో విలీనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ప్రజా సేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సేన పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుని ఎన్నికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఈ విషయంగా పార్టీ వర్గాల అభిప్రాయసేకరణ కోసం పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. స్థానిక చంద్ర గార్డెన్స్ లో 17వ తేదీ శుక్రవారం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లాక్ ఏ, బ్లాక్ బీ గా రెండు దశలుగా సాగే ఈ సమావేశం ఒకేరోజు పూర్తవుతుందన్నారు. బ్లాక్ ఏ లో ఉన్న జడ్చర్ల, మిడ్జిల్, ఊర్కొండ మండలాల పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం ఉదయం 10 గంటల మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. భోజన విరామం అనంతరం బ్లాక్ బీ లోని నవాబుపేట, రాజాపూర్, బాలానగర్ మండలాల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుందని వివరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలను తీసుకొచ్చే బాధ్యత ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలదేనని స్పష్టం చేసారు. ఈ సమావేశానికి జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరై డీసీసీకి మంచి నాయకత్వాన్ని సూచించాలని అనిరుధ్ రెడ్డి కోరారు.
ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్,మంగళారపు లక్ష్మణ్,పుస్తె శ్రీకాంత్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఉప సర్పంచ్ గోపాల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు.
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు
ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.
రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.
ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.
స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో.. పల్లెలో సాగుతున్న ఆప్యాయత పలకరింపులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో నోటిఫికేషన్ విడుదల కంటే ముందే పల్లెలో నెలకొంటున్న ఎన్నికల వాతావరణ సందడి, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో 33 సర్పంచ్ స్థానాల రిజర్వేషన్, 13 ఎంపీటీసీ స్థానాలకు 4 ఎస్సి,6 బీసీ 3 జనరల్ గా ఖరారు చేయగా ఎంపీపీ బీసీ మహిళకు కేటాయించారు. జడ్పీటిసి బీసీ జనరల్ ఖరారు చేసినట్లు చేయడంతో ఎప్పుడెప్పుడా ఆశావహులు ఎగిరి గంతేశారు. అని అధికారులు స్పష్టం ఎదురుచూస్తున్న పల్లెలో మొదలైన ఏం తమ్మి, ఏం అన్న అంత కుశలమేనా ఇంట్లో అందరూ ఎట్లున్నారు ఊరికి సరిగ్గా దర్శనిమిచ్చుడే లేదు అప్పుడప్పుడు ఊరికి రావాలి అందరూ వస్తు పోతూ ఉంటేనే బాగుంటుంది.. రా చాయి తాగుదాం అంటు పలకరిస్తూ జీవనాధారం కొరకు పట్నంలో ఉంటూ పండగకు వచ్చిన ప్రజలకు, మర్యాదలు కురిపిస్తున్నారు.ఇక గ్రామాల్లోనే ఉన్న ప్రజలకు ఫోన్లు చేసి మరి కనిపిస్తాలేవు ప్రొద్దున నుంచి అంటూ ఫోన్లో సంభాషణలు చేస్తున్నారు..ఇది ఇలా ఉండగా ఇన్నాళ్లు ఎదురుచూసిన ఆశావాహుల్లో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి ఝరాసంగం మండలంలో స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ తో పల్లెలో ఎన్నికల వాతావరణ సందడి నెలకొంది.. ఇరుపార్టీల నాయకులు పోటీలో నెగ్గేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామాల్లో కొత్త రాజకీయ ట్రెండ్.. కార్యకర్తలకు హెచ్చరికలు
పార్టీ కోసం కష్టపడని వారు, పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలవని వారు ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ వంటి స్థానాలకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారు కార్యకర్తలను పట్టించుకోకుండా, పార్టీ పేరుతో తమ పెత్తనం చూపాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్థాయిలో చర్చ నడుస్తోంది.కార్యకర్తలు మరియు ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీరిని ప్రోత్సహించడం అంటే మనకే మనం నష్టం చేసుకోవడం అవుతుందని సూచనలు వెలువడుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ నిజమైన కార్యకర్తలకే ప్రజల మద్దతు లభించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ మండల అధ్యక్షులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఈదులపల్లి రచ్చయ్య స్వామి కుమారుడు బసవరాజ్ జన్మదినాన్ని శుభాకాంక్షలు పురస్కరించుకుని, టీజీఐడిసి మాజీ చైర్మన్, మహమ్మద్ తన్వీర్ ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతు రావు పటేల్ శాలువా పూలమాలలతో సన్మానించి కప్ కేక్ కట్ చేసి,ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎంపీటీసీ జడ్పిటిసి శంకర్ పటేల్, నర్సింలు పటేల్ మల్లన్న పటేల్, బాలభాయ్ బాలరాజ్ తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తొర్రూరు మండలం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
చీకటయపాలెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాండవుల బిక్షం, బూర్గుల వెంకటమ్మ అలాగే తొర్రూర్ మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల పుల్లయ్య, శమంతుల వేణు అలాగే కంటయపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త గోనె చిరంజీవి మరియు చింతలపల్లి గ్రామానికి చెందిన కొండం నరసింహారెడ్డి గారి తండ్రి గారు కొండం వెంకట్ రెడ్డి గారు ఇటీవల మరణించగా ఆయా కుటుంబాలను పరామర్శించి వాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించడం జరిగింది.
వీరి వెంట మండల మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య తొర్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ లు పాకనాటి సునీల్ రెడ్డి, శ్రీరామ్ సుధీర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాళ్లు నాయక్, రాయిశెట్టి వెంకన్న, ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, కర్నే నాగరాజు, ధరావత్ జై సింగ్, తూర్పాటి రవి ,పేర్ల జంపా, లేగల వెంకటరెడ్డి, మంగళంపల్లి ఆశయ్య, నిమ్మల శేఖర్,పయ్యావుల రామ్మూర్తి, మహిళా నాయకురాలు కనకపూడి సుచరిత ,తొర్రూర్ బి ఆర్ స్ సోషల్ మీడియా అధ్యక్షులు యర్రం రాజు, ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం
◆:- యువ నాయకులు మహ్మద్ హఫీస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల చిల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మహ్మద్ హఫీస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్న లను పొందింది అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో, పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు. జరగబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి,రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీలు, వార్డులలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ఓట్లను అడిగి ఎంపీటీసీ జెడ్పిటిసిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు వేడుకలు * పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వర్దన్నపేట (నేటిధాత్రి) వర్ధన్నపేట మండల ప్రభుత్వ ఆసుపత్రిలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి వందమంది పేషెంట్స్ కి పండ్లుపంపిణీ చేయడం జరిగింది. జాతీయ యువజన అవార్డు గ్రహీత వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ వర్ధన్నపేట నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు ఆపద కాలంలో పార్టీని కాపాడి ప్రజా సేవే ఏకైక లక్ష్యంగా జీవిస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు గార్ల నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అర్హత నైపుణ్యం కలిగిన యువ నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా నిలిచారు..
ఈ కార్యక్రమంలో , తెలంగాణ అంబేద్కర్ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య,వర్ధన్నపేట పట్టణ మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుబ్బ యాకయ్య, ఎండీ షాబీర్, పోలుసనీ దేవేందర్ రావు,దుబ్బ ఎల్లన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ జంగిలి భాస్కర్, వర్దన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు నందిపక భాస్కర్, చేరిపల్లి బాబు, సమ్మెట రాంబాబు, యువ నాయకులు మంద రవీందర్, కుమారస్వామి, రాములు, రమేష్, శ్రీనివాస్ , రాజు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియమితులయ్యారు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి నియమాకాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి నాగపూర్ రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డికి మండల అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భూపాలపల్లి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలవడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.