కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె విజయవంతం
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక ఉద్యోగ రైతాంగ సంఘాలు ఇచ్చిన సమ్మె బుధవారం గుండాల మండలంలో విజయవంతం అయిందని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు,సిఐటియు జిల్లా నాయకులు ఈసం వెంకటమ్మ,ఏఐయుకేఎస్ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం( ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తిసత్యం అన్నారు.
సమ్మె సందర్భంగా గుండాలలో గ్రామపంచాయతీ కార్యాలయం నుండి బొడ్రాయి సెంటర్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాని ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్నఅధ్యక్షత వహించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నాలుగు కోడులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతాంగం తమ రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించి చట్టాలను వెనక్కి కొట్ట గలిగారని అదే స్ఫూర్తితో కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా కార్మిక వ్యతిరేక నాలుగు కోడులను వెనక్కి కొట్టగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కార్మిక వర్గం సంగటితం కావలసిన అవశ్యకతను గుర్తు చేశారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నారని వారు అన్నారు. గుండాల మండలంలో అంగన్వాడి,ఆశ,హమాలి, భవన నిర్మాణం గ్రామపంచాయతీ,మోటార్ వర్కర్స్ తదితర అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు గడ్డం నగేష్, వానపాకుల లాలయ్య,చింత నరసయ్య,బానోత్ చంద్యా, తాటి కృష్ణ,మెంతిని నాగేష్, ఏఐకేఎంఎస్ నాయకులు గడ్డం లాలయ్య,కొమరం సీతారాములు,బానోతు లాలు, పాయం ఎల్లన్న,టియుసిఐ నాయకులు కొమరం శాంతయ్య,కోడూరి జగన్, మొక్క నరి, సిఐటియు నాయకులు పాయం సారమ్మ, వట్టం పూలమ్మ,వాగబోయిన కౌసల్య,ఎస్.కె నజీమా తదితరులు పాల్గొన్నారు.