గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై
◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
