బిట్స్ కళాశాలలో మాక్ ఎలక్షన్ ల సందడి..

బిట్స్ కళాశాలలో మాక్ ఎలక్షన్ ల సందడి

ఓటు హక్కుతో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి

పాఠశాల ప్రిన్సిపాల్ పిండి.యుగేందర్

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో మాక్ ఎలక్షన్ల సందడి బిట్స్ పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించి తద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించారు.విద్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు.పాఠశాల ఎస్పీఎల్,ఏఎస్పీఎల్ గా విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేశారు.ఉపాధ్యాయులు ఎన్నికల అధికారులుగా ఉంటూ అభ్యర్థులకు గుర్తులను కేటాయించి విద్యార్థులందరినీ ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొనేటట్లు చేశారు.విద్యార్థులు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం చాలా బాగుందని తెలియజేశారు.మాక్ ఎలక్షన్ లో భాగంగా గెలుపొందిన ఎస్పీఎల్ గా సూర.చాందిని,ఏ ఎస్పీఎల్ గా తంగళ్ళపల్లి,యశస్విని అభ్యర్థులను బిట్స్
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ ఓటు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని భవిష్యత్తులో ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలియజేశారు.పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది. మెట్ పల్లి బీజేపి కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు..
మెట్ పల్లి ఆగస్ట 1 నేటి దాత్రి
రాబోయే స్థానిక సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు అన్నారు .మెట్పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేసిందని, వర్షాకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో దోమల బెడదతో పాటు ఇతర సమస్యలతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండడంతో పోటీ చేసిన ప్రతి వద్ద గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు, అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సంవత్సర కాలంలోనే వ్యతిరేకత వచ్చిందని అందుకు ఉదాహరణ గాని రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు కాంగ్రెస్ బిజెపి మధ్యనే పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలు గమనిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఎంతో ముందు చూపుతో బిజెపి ఎన్నికలలో గెలిపిస్తారని అన్నారు స్థాయి నాయకులు భాజపా పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పసుపు బోర్డు రావడం రైతుల్లో ఆనందం వెల్లులిసిందని రానున్న రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అటు ప్రజలకు రైతులకు అందిస్తామని ఆయన అన్నారు అత్యధిక మెజార్టీలతో అత్యధిక స్థానాలు భాజపాటి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బిజెపి నాయకులు సుఖేందర్ గౌడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భీమారం స్థానిక ఎన్నికల బీజెపి కార్యచరణ…

భీమారం స్థానిక ఎన్నికల బీజెపి కార్యచరణ

జైపూర్,నేటి ధాత్రి:

భీమారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల కార్యచరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే మండల అధ్యక్షుడు కాసెట్టి నాగేశ్వర్ రావ్ ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని,అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిదిగా జాడి తిరుపతి,భీమారం మండల ఎన్నికల కన్వీనర్ మాడెం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్,కొమ్ము దుషాంత్,కత్తెరసాల కార్యదర్శి తాటి సమ్మగౌడ్,దుర్గం జేనార్ధన్,అవిడపు సురేష్, మంతెన సుధాకర్,మేడి విజయ కామెర జెనార్ధన్, కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్ పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎవరో!

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎవరో!

స్థానిక సమరం.. ఎవరికి అనుకూలం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T162915.948.wav?_=1

శాయంపేట నేటిధాత్రి:

తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాం టి అంచనాలు ఉన్నాయని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తు న్నారు. పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడితే గెలిచిన అనం తరం తమను పట్టించుకో కుండా పార్టీ ఫిరాయింపు దార్లకే పెద్ద పీట వేస్తున్నారని చాలా రకాలుగా పార్టీ నాయకులు మండిప డుతున్నారు.

పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాం

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను కాదని గత బిఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుపట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపో వడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.

ముందుగా సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించాలి

ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే. మండల కేంద్రంలో ఉన్న పలు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సంక్షేమా నికి పెద్దపీట.అయితే అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికా రంలో ఉందిరానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రె స్ పార్టీ ముందున్న లక్ష్యం. మండలం లోని పలు గ్రామాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుని ఏ రాజకీయ పార్టీకి వరిస్తుందోనని ప్రజల ఆలోచ నలు! అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహ రచనలు చేస్తున్నారా!

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి..

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

డా వన్నాల వెంకటరమణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు నాయిని అనూష అశోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటరమణ హాజరయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటికి సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకటరమణ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి మండల ఎన్నికల ప్రభారి కుడికాల శ్రీధర్ హాజరైనారు.ఈ సందర్భంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుండి మండల అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అద్భుతమైన పాలన, అమృత కాల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాలు, అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వన్నాల వెంకటరమణ అన్నారు. ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికుడిలా పనిచేయాలని, నెక్కొండ మండలంలో ప్రతి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దామచర్ల రామారావు, సుధానపు సారయ్య, ప్రధాన కార్యదర్శి రాంపల్లి రాజగోపాల్, కార్యదర్శులు సూత్రపు శీను, మల్లం మల్లేష్, సీనియర్ నాయకులు శ్రీరంగం శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సింగారపు సురేష్, సురేతాలూరి లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ పింగిలి మోహన్ రెడ్డి, లౌడియా శ్రీనివాస్, భరతం రాజు, ఉల్లెంగుల రాజు, కందుకూరి వెంకన్న, బొమ్మనపల్లి జయప్రకాష్, తౌడుశెట్టి శ్రీనివాస్, గుగులోతు వెంకన్న, అనిల్, యువ నాయకులు కుడికాల సుధీర్, తేజావత్ వంశీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

భారతీయ జనతా పార్టీ మద్దూర్ మండలం, అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి

మద్దూరు నేటిధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో నిర్వహించిన “స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల” లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ . పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. అని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ అన్నారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అన్నారు బిజెపి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. అని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుండి, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి కైవసం చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ కూరెళ్ల కిరణ్ గౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కొండా నాగమణి, ప్రధాన కార్యదర్శులు బొంగోని బాలు, బియ్య రమేష్,సోగాలా మనోజ్,కృష్ణా రెడ్డి, మేక సుదర్మ, చింతల రాజు, చందు, శ్రీకాంత్, బాలకృష్ణ, రాజు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి.

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి

అఖిల భారత పద్మశాలి యువజన సంఘ మండల అధ్యక్షులు బాసాని సాయితేజ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం స్థానిక ఎన్నికల్లో పాటు చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి. అఖిలభారత పద్మశాలి యువజన సంఘం మండల అధ్యక్షుడు బాసని సాయితేజ మాట్లాడుతూ గత 7 సంవత్స రాల నుండి చేనేత సంఘము ఎన్నికలు జరుగకా ఇంచార్జి లతో సంఘము నడుస్తుంది. సంఘలో సరైన ఉపాధి లేక చేనేత వస్త్ర పరిశ్రమ మరు గున పడుతుందని నాడు వస్త్ర పరిశ్రమల్లో అగ్రగామిగా ఉన్న శాయంపేట వస్త్ర పరిశ్రమనేడు మరుగున పడటం బాధాకరo ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించి పద్మశాలి కార్మికు లకు అండగా ఉండాలి. ఇప్ప టికైనా వెంటనే ఎన్నిక జరిగితే శాయంపేటను రాష్టంలో అగ్ర గామి వస్త్ర పరిశ్రమగ తీర్చిది ద్దచ్చు .త్వరగా ఎన్నికలు నిర్వ హించి పద్మశాలి కార్మికులను ఉపాధి కలిపించాలి అలాగే సంఘలో నూతన సభ్యతలు ఇవాలి మరియు పద్మశాలి యువతకి ఉపాధి కల్పిం చాలని కోరడమైనది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెబుతాం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెబుతాం… కాషాయ జెండా ఎగరవేస్తాం – బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ లోగడ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని, నేడు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ కొత్త రాజకీయ డ్రామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిందని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి రామడుగు మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాశాల సమావేశం రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్ నందు జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరు గ్యారంటీలతో, 420 హామీలతో ప్రజలను ఆదుకుంటామని కాంగ్రెస్ మాయమాటలు, అబద్ధాలు చెప్పి ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. పథకాల అమలు కోసం దాదాపు రెండేళ్ల కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన పేరిట ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అరకోరపథకాలను అమలు చేస్తూ, ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి సక్రమంగా అమలైంది తప్ప, మిగతా ఏఒక్కటీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. రైతు రుణమాఫీ అరకోర చేసిందని, పింఛన్లు అందించడం లేదని, నిరుద్యోగ భృతిని అటకెక్కించిందని, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ చెప్పిన లెక్కలేనన్ని హామీలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీవన్నీ ఉద్దెర ముచ్చట్లనే విషయం ప్రజలందరికీ అర్థమైందని, మాటల గారడితో ప్రజలను మోసగించడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసానికి ప్రతిఫలం లభించిందని , అందుకే లోగోడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆప్రభుత్వానికి ఉద్యోగులు, పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ కాంగ్రెస్ సర్కార్ లబ్ధి పొందడానికి కుటిలప్రయత్నాలు, రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశంతో రాజకీయ నాటకాలు మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు వర్తించే విధంగా బీసీ రిజర్వేషన్ ను చేపట్టిందన్నారు. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. జరగబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు దిమ్మదిరిగే ఫలితాలు అందిస్తారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం లభిస్తుందన్నారు. ప్రజలంతా బిజెపి మోదీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉన్నారన్నారు. గ్రామాల్లో మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటేలా తగిన కార్యాచరణలతో ముందుకు కొనసాగడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండలశాఖ అధ్యక్షులు మోడీ రవీందర్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, ఎన్నికల ప్రభరి జాడి బాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి,వివిధ మోర్చాల అధ్యక్షులు, నాయకులు, శక్తి కేంద్రం ఇంఛార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-64.wav?_=2

నర్సంపేట,నేటిధాత్రి;

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎంపీటీసీ పరిధి బిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కందిపల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్,ఎంపిటిసి పరిధి ఇన్చార్జ్ శానబోయిన రాజ్ కుమార్ పాల్గొని ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నెమరువేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ జిల్లాఆసుపత్రిగాఏర్పాటు అలాగే జిల్లా కేంద్రంలో ఉండే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించారని అన్నారు.మండల కేంద్రాలకు లింకు రోడ్లు వేయడం ప్రతి గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు 100 శాతం నిర్మించడం,రైతులకు సరిపడ యూరియా, రైతు బందు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలో అందించడంలో నర్సంపేట ముందు వరుసలో ఉందన్నారు.కేసీఆర్ హామీలు ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని గుర్తుకు చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలన
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పట్ల ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల పట్ల ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాజ్ కుమార్ తెలిపారు. వచ్చే స్థానిక జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలలో గ్రామంలో అభ్యర్థి గెలుపు కొరకు అందరు కంకణ బద్దులమై ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహమ్మదాపురం పిఎసిఎస్ చైర్మన్ ఊరటి మహిపాల్ రెడ్డి,డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్,వ్యవసాయ కమిటీ అధ్యక్షులు రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయ మోహన్,మండల నాయకులు ఊరటి రవి,తాళ్లపల్లి వీరస్వామి,మాజీ సర్పంచ్ దారావత్ రాజు, మాజీ ఉపసర్పంచ్ ఉరటి జయపాల్ రెడ్డి, గుండెబోయిన రవి, కక్కర్ల సాంబయ్య, ఏడాకుల రమణరెడ్డి,దుగ్గొండి మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్కటి రాజు కుమార్, గ్రామ పార్టీ సభ్యులు ఉప అధ్యక్షులు ఊరటి రామచంద్రు,మంద రాజు,అదర్ సండే రాజు, గోర్కటి రఘుపతి,కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు.!

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?

కార్మిక సంఘాల నాయకులను గనుల పైన నీలదీయండి

కార్మికులకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పిలుపు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?అని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నిలదీశారు. గురువారం నస్పూర్ కాలనీలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి రీజినల్ సెక్రెటరీ సమ్ము రాజయ్య ఆధ్వర్యంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ,సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలలో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ,ప్రాతినిత్య ఐఎన్టియుసి కార్మిక సంఘాలు ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలలో కార్మిక సమస్య చేర్చి మా సంఘానికి ఓట్లు వేసి గెలిపించండి మీకు ఇస్తున్న హామీలు తూచ తప్పకుండా కంపెనీతో కొట్లాడి పోరాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికుల ఓట్లు దండుకొని గెలుపొందిన ఏఐటీయూసీ,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల నాయకులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిష్కరింపబడలేదని గుర్తింపు ప్రాదీనీత్య సంఘాలు కార్మిక హక్కులు సాధించడంలో విఫలం చెందాయని,కేవలం ఈ రెండు సంఘాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల కోసం కాదని కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలకై కంపెనీతో గుర్తింపు ప్రాతీనిద్య సంఘాలు పోరాడాలని గత ఏడు సంవత్సరాల కాలం నుండి సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని,కార్మికులకు 300 గజాల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలలో కేటాయించాలని,శరీరక శ్రమ మీద ఆధార పడి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని అన్నారు.బొగ్గు గనుల ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. డిపెండెంట్ ఉద్యోగాల ఇన్వల్యూషన్ విషయంలో కొనసాగుతున్న కుంభకోణంపై ధర్యాప్తి జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుల వారసునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.బొగ్గు తట్ట పనిని కూడా సింగరేణి సంస్థ నిర్వహించాలి.ఎట్టి పరిస్థితులలో ప్రవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించరాదని డిమాండ్ చేశారు.సింగరేణిలో అక్రమంగా తొలగించిన డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనులను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఆపాలి.సింగరేణి పబ్లిక్ రంగ సంస్థల కొనసాగించాలి. కేంద్రం బొగ్గు గనులను బహిరంగంగా వేలం వేసే పద్ధతిని ఆపి తెలంగాణకే సింగరేణి సంస్థలను అప్పజెప్పాలి. 2024-2025 కంపెనీకి వచ్చిన లాభాల నుండి 40 శాతం లాభాలను కార్మికులకు పంచాలి.సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న,గోదావరిఖని రీజినల్ కార్యదర్శి ఎం ఎఫ్ బేగు, పి.చంద్రశేఖర్,గుంపుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మండలాల వారిగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపిదేయంగా ఎన్నికల బరిలో నిలుస్తామని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేస్తామని ఇందుకు అనుగుణంగా క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్లు నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దేనమిది నెలలు గడుస్తుందని అటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడం పేదల పట్ల ఆపార్టీలకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుందన్నారు. తక్షణమే జమ్మికుంట మండలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ఇండ్లను పంపిణీ చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకొని అర్హులైన వారందరికీ సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈవిలేకరుల సమావేశంలో జమ్మికుంట, ఇల్లందకుంట సిపిఐ మండల కార్యదర్శిలు గజ్జి ఐలయ్య, మాదారపు రత్నాకర్ నాయకులు బొజ్జం రామ్ రెడ్డి, సారయ్య, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కలిసి, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మీడియాతో మాట్లాడారు.

Congress party.

సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ తెర మీదకు తీసుకోవచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలోప పట్టణ అధ్యక్షుడు దేవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీను కురిమిళ్ళ శ్రీను రమణాచారి కోమల స్వామి కేతిరి సుభాష్ పద్మ చల్లూరు సమ్మయ్య కడారి మాలతి మాజీ కౌన్సిలర్లు, బిసి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

◆: ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం

◆: జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు మహమ్మద్ షౌకత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని జహీరాబాద్ యువనాయకులు రాంజోల్ మండలం మహమ్మద్ షౌకత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు నావంతు కృషి చేస్తానాని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి, ఖాళీ పోస్టుల భర్తీ తదితర పథకాలు అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తునదని స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించి పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా మంత్రి గారి మద్దతు ఉంటుందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

మాటేడు ఎంపీటీసీ పరిధి లో
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని బిఆర్ఎస్ తొర్రూర్ మండల పార్టీ ఇన్చార్జ్ శ్రీరామ్ సుధీర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మరియు మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ గార్లు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

 

గౌరవ శ్రీ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు* చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది
తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు చేసింది ఏమీలేదు అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలలో కోతలు ఎగవేతలు తప్ప చేసింది ఇచ్చింది శూన్యం అన్నారు..
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన బుద్ధి చేపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రైతు బంధు రెండు పంటలకు ఎగనామం పెట్టారని రైతు రుణమాఫీ 60% రైతులకు కూడా జరగలేదని తెలిపారు.
మహిళలకు తులం బంగారం మరియు 2500 రూపాయలు ఇస్తానని మోసం చేసారు. భూమి లేని పేదలకు 12000 ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు.
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదలు పెట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయలేదని స్థానిక ఎంఎల్ఏ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరింది.తప్ప పేద ప్రజలకు వచ్చింది శూన్యం అన్నారు…
ఈ కార్యక్రమంలో తొర్రూర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్ ,తొర్రూర్ పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్ ,తొర్రూర్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాలు నాయక్ ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సముద్రాల శీను, బిక్షపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..

గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ

రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో 28 లక్షల నిధులతో సిసి రోడ్డు, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజీ, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియాలకు శంకుస్థాపన చేశారు.

రైల్వే గేటు పై నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై 15 లక్షల నిధులతో నిర్మించిన మెట్లను ప్రారంభించారు.

అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.

 

Congress

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలనను అందిస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీలో అభివృద్ధి శూన్యమని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు.

మున్సిపాలిటీ లోని ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి 25 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చానని గుర్తు చేశారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించాలని పట్టణ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు మారేపల్లి నరేష్ మంత్రి కి వినతిపత్రం అందించారు.

Congress

 

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, వేల్పుల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాస రాజు, సంఘ రవి, మేకల రమేష్ మహిళా నాయకురాళ్ళు పుష్ప , నాయకులు, యూత్ లీడర్లు ,ప్రజలు పాల్గొన్నారు.

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి.

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి

◆ జట్గొండ మారుతి డిమాండ్ చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలలో
న్యాల్కల్ మండల మల్గి గ్రామానికి చెందిన మాజీ తాజా సర్పంచ్ తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని
స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యం.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యం

◆  ఒకవైపు 2024 జనాభా లెక్కలు  42% బిసి రిజర్వేషన్ల ప్రక్రియ కీలకం.

◆  ఒక నెలలోపే నిర్వహించాలని హైకోర్టు. రెండు నెలల సమయం కావాలన్న ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ వివరి వారంలో జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు సూత్ర ప్రయకంగా ఆదేశించారు, రైతు భరోసా డబ్బులు వారి రైతుల ఖాతాలో జమ చేసినందున ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి కలిసి వస్తు వస్తుందని భావించారు. కాని స్థానిక సంస్థల ఎన్నికలనిర్వహణకు పలు సాంకేతిక కారణాలు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు తమకు రెండు నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ రెండు నెలలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ చేయడం అంత సాధ్యమయ్యే పని కనిపించడం లేదు.

ఎందుకంటే 2024 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ అధికారంలోకొస్తే 2024 లో జనాభా లెక్కలు తెలుస్తామని…

దాని ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటిస్తామంటూ హామీ ఇచ్చారు.

కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జనాభా లెక్కలు నిర్వహించినప్పటికీ అందులో చాలా లోపాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు సైతం ఆధారాలతో సహా బయటపెట్టాయి.

మరోసారి జనాభా లెక్కలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ లెక్కనా ప్రభుత్వం కొత్తగా జనాభా లెక్కలు చేయాలంటే కనీసం నెల రోజుల సమయం అయినా పడుతుంది. ఇప్పట్లో జనాభా లెక్కలు చేయడం అనేది కూడా సాధ్యమయ్యే పని కాదు.

ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న కుటుంబాలు అధికంగా ఉంటాయి.

అధికారులు వచ్చిన సమయంలో ఇళ్ల వద్ద ఇంటి యజమానులు కానీ, ఇతరులు ఎవరు లేకపోవడంతో వాలంటీర్లు డోర్ లాక్ పేర్తో వెళ్ళిపోతున్నారు. గతంలో జరిగిన తప్పిదంలో కూడా ఇదే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఈ లెక్కన 2025 డిసెంబర్ నాటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని చెప్పవచ్చు.

రిజర్వేషన్ల ను ఎలా ప్రకటిస్తారు..?

జనాభా లెక్కలను తేల్చిన ప్రభుత్వం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా తెలుస్తారనేది ప్రధాన ప్రశ్న ముందుగా జిల్లాను యూనిటీగా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తారా…

గ్రామ పంచాయతీల ఆధారంగా ఉన్న జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను కేటా ఇస్తారా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేని కారణంగా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకుండా ఎన్నికలకు పోవడం సాధ్యమయ్యే పని కాదు.

అందుకే పంచాయతీ కానీ, ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ జరగాలంటే జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను

ప్రకటించవలసి ఉంటుంది, ఉమ్మడి మెదక్ పంచాయతీలు 1140…

ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యాప్తంగా 1140 గ్రామ పంచాయతీలు ఉండగా 3358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో రెండు కోట్ల 46 లక్షల 32 వేల ఓటర్లు ఉన్నారు.

ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. 2024 జనాభా లెక్కల ప్రకారం తీస్తే 25 శాతం మేర ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు సుమారు ఐదు నుంచి 1000 గ్రామపంచాయతీలో కొత్తగా ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఈ లెక్కన రిజర్వేషన్లను ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యేది. కాదు. రిజర్వేషన్లు ప్రకటించాలంటే జనాభా లెక్కలను తేల్చవలసి ఉంటుంది. దాని తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఏది ఏమైనాప్పటికీ డిసెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదనేది స్పష్టం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

వేలకోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా

రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టా.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటిధాత్రి:

 

 

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి మార్పు వస్తుందని ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని. 18 నెలలోనే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకించడం దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన ఎద్దేవ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలంలో ప్రతి తండాకు, గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి 40 కిలో మీటర్ల పొడవున కంకర వేసి తారు రోడ్డు వేసే సమయంలో నోటిఫికేషన్ రాగా అట్టి పనులను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే పనులను రద్దు చేయడం విడ్డూరంగా ఉంది. మండలంలో పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, పైపులు మోటార్లు ఇవ్వడం జరిగిందని అలాగే అకాల వర్షాలతో రైతులకు పంట నష్టం జరగగా ప్రతి రైతుకు పదివేల చొప్పున నష్టపరిహారం ఇప్పించి మరికొంతమంది కి రాలేదని నా దృష్టికి రావడంతో ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మరల 3000 మందికి నష్టపరిహారం మంజూరు చేయించి అప్పటి కలెక్టర్ వద్ద మంజూరు నిధులను ఉంచడం జరిగిందని.

 

BRS

 

ఇప్పుడున్న ఎమ్మెల్యే దానిపై ఎందుకు దృష్టి పెడుతలేరని దానితోనే రైతులపై మాధవరెడ్డికి ఎంత ప్రేమ ఉందో రైతన్నలు గమనించాలని అన్నారు. ఒకప్పుడు రాజకీయ కక్షలకు నిలయంగా మారిన నర్సంపేట నియోజకవర్గం వర్గాన్ని శాంతియుతంగా అన్ని రాజకీయ పార్టీలు, కులాల మతాలకు అతీతంగా ఎలాంటి గొడవలుకు తావు లేకుండా శాంతి సామరస్యాన్ని నెలకొల్పితే మళ్లీ దురదృష్టవస్తు ఒక దుర్మార్గున్ని గెలిపించుకోగా ఊర్లలో రౌడీ రాజకీయం మళ్ళీ మొదలైంది ఇలాంటి వాటికి చరమగీతం పాడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త చెమటోర్చి కసిగా పనిచేస్తేనే విజయం దిశగా పరుగులు తీస్తారని ఆయన కార్యకర్తలకు సూచన చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానంతో తెలిసి తెలియక ప్రాజెక్టులపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియని అజ్ఞాన వ్యక్తి రేవంత్ రెడ్డి. దేవదుల ప్రాజెక్టు గోదావరి నదిపై ఉన్నదా లేదా కృష్ణా నదిపై ఉన్నదా తెలియక పోయినా ప్రాజెక్టులపై మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రతి పైసా ప్రజలకు అందే విధంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే దిశగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హరినాథ్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, మామిళ్ళ మోహన్ రెడ్డి, ఇంగ్లీ శివాజీ, వైనాల వీరస్వామి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నాన బోయిన రాజారాం యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు గోనె శ్రీదేవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఖ్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం.

పల్లె పోరుకు సిద్ధం…..

◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు

◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం

◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి

◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు

◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20

◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.

సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.

Elections

పంచాయతీ గుర్తులివే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్‌ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్టు, స్పానర్‌(పానా), చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, క్రికెట్‌ బ్యాటర్‌, పడవ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ వికెట్లు

వార్డు సభ్యుల గుర్తులు

గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీ స్టిక్‌ మరియు బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కెటిల్‌.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్‌ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్‌ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం

రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు

జిల్లా గ్రామపంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు

ఆదిలాబాద్‌ 473 166 20

భద్రాద్రి కొత్తగూడెం 478 236 22

హన్మకొండ 210 129 12

జగిత్యాల 385 216 20

జనగాం 280 134 12

భూపాలపల్లి 248 109 12

జోగులాంబ గద్వాల 255 142 13

కామారెడ్డి 536 237 25

కరీంనగర్‌ 318 170 15

ఖమ్మం 579 288 20

అసిఫాబాద్‌ 335 127 15

మహబూబాబాద్‌ 482 193 18

మహబూబ్‌నగర్‌ 423 175 16

మంచిర్యాల 306 129 16

మెదక్‌ 492 190 21

మేడ్చల్‌ మల్కాజిగిరి 34 19 3

ములుగు 174 87 10

నాగర్‌కర్నూల్‌ 460 214 20

నల్లగొండ 868 352 33

నారాయణపేట 276 136 13

నిర్మల్‌ 400 157 18

నిజామాబాద్‌ 545 307 31

పెద్దపల్లి 266 140 13

రాజన్న సిరిసిల్ల 260 123 12

రంగారెడ్డి 531 232 21

సంగారెడ్డి 633 276 27

సిద్దిపేట 508 230 26

సూర్యాపేట 486 235 23

వికారాబాద్‌ 594 227 20

వనపర్తి 268 133 15

వరంగల్‌ 317 130 11

యాదాద్రి భువనగిరి 428 178 17

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉందా..

గోదారి జలాలపై తెలంగాణ నీటివాటా కోల్పోయే ప్రమాదం.

చంద్రబాబుతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి.

బిఆర్ఎస్ రాష్ట్ర నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

నర్సంపేట నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఉన్నదా అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు. నర్సంపేట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడిపై రైతులు,ప్రజలు చైతన్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.తన గురువు చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై ఆంధ్ర ప్రాజెక్టులకు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి కాలేశ్వరంపై అవినీతి కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వినియోగించకుండా రైతుల పొలాలను ఎండబెడుతూ ఆంధ్రాలో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కోసం గోదావరి నీటిని లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు రామప్ప పాకాల రంగాయా చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్టులను ఎండబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వలన గోదావరి జలాలపై తెలంగాణ నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఉందని, నిన్న తెలంగాణ జాతిపిత కెసిఆర్ ను గోష్ కమిషన్ ముందు పిలిపించి రాక్షసానందం పొందిన రేవంత్ సర్కార్ కు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న నేపంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.నేడు
గ్రామాలలో,పట్టణాలలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదని ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.ఈ సమావేశంలో రాయుడి రవీందర్ రెడ్డి,నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,వేములపల్లి ప్రకాష్ రావు,సుకినే రాజేశ్వర్ రావు, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బానోతు సారంగపాణి, గందె శ్రీనివాస్ గుప్త, చెట్టుపెళ్లి మురళిదర్ రావు, కామిశెట్టి ప్రశాంత్, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version