భారత్ ముందు పాకిస్థాన్ దిగదుడుపే..

భారత్ ముందు పాకిస్థాన్ దిగదుడుపే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యల

 

 

ఆసియా కప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా సులభంగా ఓడించింది. ఈ రోజు మరోసారి ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి.

ఆసియా కప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి (India vs Pakistan). గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా సులభంగా ఓడించింది. ఈ రోజు మరోసారి ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. సూపర్-4 మ్యాచ్‌కు ముందు, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ (Bazid Khan) ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ కంటే భారత జట్టు చాలా మెరుగ్గా ఉంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. భారత్ ముందు పాకిస్థాన్ జట్టు చాలా చిన్నగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పాక్ బౌలర్లు త్వరగా వికెట్లు తీయగలిగితే ఏదైనా అవకాశం ఉండొచ్చు. ప్రకృతి సహకరిస్తే తప్ప పాక్ గెలుపు కష్టం’ అని బాజిద్ ఖాన్ వ్యాఖ్యానించారు (Asia Cup 2025 Super 4,).

గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 128 పరుగులు చేసింది (IND vs PAK analysis). టీమిండియా కేవలం 3 వికెట్లు కోల్పోయి సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరి, ఈ రోజు జరగబోయే మ్యాచ్ మరెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి.

 రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

 రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి.

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి పదవికి షిగేరు ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయనున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో చీలకను నిరోధించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇషిబా ధ్రువీకరించినట్టు జపాన్ ప్రభుత్వరంగ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఇషిబా సారథ్యంలోని ఎల్‌డీపీ ఎగువ సభ, దిగువ సభ రెండింటిలోనూ మెజారిటీని కోల్పోయిన క్రమంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఎగువ సభలో 248 సీట్ల మెజారిటీని సాధించడంలో ఎన్‌డీపీ విఫలమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో ఓటమికి బాధ్యత వహించాలంటూ పార్టీలోనే అసంతృప్తులు పెరిగాయి. ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామా నిర్ణయానికి వచ్చారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version