మున్సిపల్ ఎన్నికలు సక్సెస్: అధికారుల సంబరాలు…

మున్సిపల్ ఎన్నికలు సక్సెస్: అధికారుల సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా ముగిశాయి. ఈ విజయంతో మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్, ఎమ్మార్వో దశరథ్ సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాలతో ఫోటోలు దిగారు. విధులను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని అధికారులు అభినందించారు. అందరి సమిష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని వారు పేర్కొన్నారు.ఈ ఎన్నికలు 2026 ఫిబ్రవరి 17న సాయంత్రం దాకా జరిగాయి.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి…

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కేటాయించబడిన సిబ్బందికి పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశం తెలిసి ఉండాలని,ఓటింగ్ కంపార్ట్మెంట్ గోప్యత నిర్వహణ సక్రమంగా చేయాలని తెలిపారు.ఇతరులకు బదులుగా ఓటు వేయడం, ఒకటికి మించి ఓటు వేయడం జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని,పోలింగ్ ముగిశాక తీసుకోవలసిన జాగ్రత్తలు,పాటించవలసిన నియమాలపై శిక్షణలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.పోలింగ్ అధికారులకు కేంద్రాలలో త్రాగునీరు,మూత్రశాలలు, లైటింగ్,ఫ్యాన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు,బాలింతలు మినహాయింపు కోరినట్లయితే ఆమోదించడం జరుగుతుందని,మిగతా వారికి అత్యవసర ఆరోగ్య పరిస్థితులు,ఇతర ఇబ్బందులు తలెత్తితే తప్ప పోలింగ్ విధులలో మినహాయింపు ఉండదని తెలిపారు.11వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,12 రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే),13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ అన్వేష్, మాస్టర్ ట్రైనర్ హరిప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష..

ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష

జైపూర్,నేటి ధాత్రి:

 

ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో మండల అధికారులు సమన్వయ సమీక్ష నిర్వహించారు.శనివారం నిర్వహించిన ఈ సమీక్షలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.రెండవ సాధారణ ఎన్నికలు 2025 సంవత్సరానికి గాను సర్పంచ్ వార్డు సభ్యుల పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా పంచాయతీ కార్యదర్శులను,జిపిఓ సిబ్బందిని ముందస్తు ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గుర్రం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లో స్థానిక ఎన్నికల పోరంటే ఆశామాషిగా ఉండదని అధికారులకు సూచించారు.ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా విధులు నిర్వహించాలన్నారు.నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,ప్రజలకు నామినేషన్ కేంద్రాల గురించి విస్తృత ప్రచారం చేయించాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజ రెడ్డి,సీఐ నవీన్ కుమార్, ఎస్సై శ్రీధర్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version