మోడీ జీఎస్టీ తగ్గింపుకు పాలాభిషేకంతో స్వాగతం…

దేశ ప్రజల సంక్షేమమే బిజెపి లక్ష్యం. జీఎస్టీ స్లాబ్ లను తగ్గించి..దేశ ప్రజలకు ముందే పండుగ వాతావరణాన్ని కల్పించిన మోడీ

-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి

-మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు జీఎస్టీ స్లాబ్ లను భారీగా తగ్గించి దేశ ప్రజలకు ముందే దీపావళి పండుగ వాతావరణాన్ని కల్పించారని బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి& బిజెపి రాష్ట్ర నాయకులు చెవ్వ శేషగిరి ప్రజలను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ప్రపంచంలోనే వికసిత్ భారత్ గా మార్చే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత దేశ అభివృద్ధి, దేశానికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి అగ్రరాజ్యమే వణికిపోతుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. భారతదేశానికి వివిధ దేశాల నుంచి వస్తున్న మద్దత్, ఆదరణను చూసి అమెరికా వంటి దేశాలు కూడా ఈర్ష్య పడుతున్నాయన్నారు. మన దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల పెంచుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయన్నారు. జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారస్తులకు, ఆరోగ్య పరికరాల కొనుగోలు అమ్మకం దారులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమ్మరి లచ్చమ్మ సారయ్య దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి రవీందర్ జిల్లా నాయకులు పోతుగంటి సాయిలు మండల ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు రాస బిక్షపతి మండల కోశాధికారి వంగరవి మండల కార్యదర్శి పులి భాస్కర్ రెడ్డి చిలక మారి రాజేంద్రప్రసాద్ బూత్ అధ్యక్షులు పొడి శెట్టి రవి సామల తిరుపతిరెడ్డి రేపల శ్రీనివాస్ మధుకర్ ముక్క రవీందర్ తదితరులు పాల్గొన్నారు

సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

స్వతంత్రం భారతంలో వచ్చిన విప్లవాత్మక పన్ను సంస్కరణలు నిత్యావసరాలు ఆహార పదార్థాల పై పన్ను 18%,12% నుంచి 5% 0% తగ్గింపు తీసుకురావడం అనేది గొప్ప ఆశించదగ్గ విషయమని చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూవ్యవసాయ యంత్రాలు , స్ప్రే పార్ట్స్, ఎరువుల పై 18% 12% నుంచి 5% కి తగ్గింపు*ఆరోగ్య భీమా, జీవిత భీమా ప్రీమియం పై పన్ను 18% నుండి 0% కి తగ్గింపు*దేశ ప్రజలకు దసరా దీపావళి కానుకగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి*
ప్రధానమంత్రి మోదీ ఆగస్ట్ 15 న స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సూచనప్రాయంగా జి ఎస్ టి సంస్కరణల గురించి మాట్లాడటం జరిగింది. కానీ ప్రజలు ఊహించిన దానికంటే తొందరగా ఊహించిన దానికంటే గొప్పగా జి ఎస్ టి పన్ను తగ్గింపులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అని ,ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ పన్ను తగ్గింపులు స్వతంత్ర భారతంలో వచ్చిన గొప్ప పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలబడుతుంది. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు కూడా మధ్యతరగతి వేతన జీవులకు ఒక వరం లాంటిదనీ
ఈ పన్ను సంస్కరణల వల్ల వచ్చే 5-6 నెలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో కొంత కోత పడినా ఆ మొత్తం ప్రజలకు ఆదా అయి ఇతర అవసరాల కోసం వెచ్చించే అవకాశం ఉంటుందనీ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం తద్వారా దేశంలో తయారీ రంగాన్ని , వ్యవసాయ రంగాన్ని, నిర్మాణ రంగాలను బలపరిచే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ పన్ను సంస్కరణలు దేశ ఆర్ధిక వృద్ధికి దోహద పడతాయనడంలో సందేహం లేదనీ,ఈ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోడీ గారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు ,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ మార్తా అశోక్ పెరుమాండ్ల రాజు అనుప మహేష్ చింతల రాజేందర్ కేంసారపుప్రభాకర్ తీగల వంశీ సేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version