మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఐజేయు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T173751.343.wav?_=1

 

మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఐజేయు
జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3 వ తేదీన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద గల రాష్ట్ర సమాచార కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాలో భాగంగా జిల్లా కేంద్రంలో మహా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించినట్లు టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్,రాష్ట్ర హెల్త్ సెక్రటరీ సామల శ్రీనివాస్ లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3 వ తేదీన టీయూడబ్ల్యూజే(ఐజేయు) యూనియన్ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నా లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ ఏట వీరభద్ర స్వామి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కోసం ఓటింగ్..

సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ

కంపేటి రాజయ్య, బంద్ సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత రెండు రోజులపాటు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు.
ఈ మేరకు శనివారం స్థానిక శ్రామిక భవనంలో విలేకర్ల సమక్షంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పెట్టారు. ఈనెల 11, 12 తేదీలలో నిర్వహించిన ఓటింగ్ లో సొంతింటి కల నెరవేర్చాలని 3000 మంది కార్మికులు పాల్గొని వారీ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రంపై తెలియజేశారు. 21 మంది సొంతిల్లు, క్వార్టర్ కావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ రాజయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ… 40 వేల మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో సింగరేణి చెల్లిస్తూ ఉన్నదనీ, ఇంత శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికులకు మాత్రం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 వేల సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, 3200 క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నయని తెలిపారు. వేలాదికరాల భూమి సింగరేణి ఆధీనంలో ఉందని కార్మికులకు సొంతింటి నిర్మాణానికి ఇంటి స్థలం కేటాయించి, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చే వరకు కార్మిక సంఘాలు సంఘాల కతీతంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకోవాలని, మిగతా కార్మిక సంఘాలను ఏకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం దేవేందర్, దీకొండ ప్రసాద్, ఎం రాజేందర్, తోట రమేష్, బిక్షపతి, రవి కుమార్, రాజాకు, శంకరు తదితరులు పాల్గొన్నారు.

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161734.060-1.wav?_=2

 

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

వరంగల్, నేటిధాత్రి

 

వరంగల్ చౌరస్తాలో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వలన స్థానికులకు చాలా పెద్దగా భారం పడుతున్నది కావున
కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురి కార్మికులు మాట్లాడుతూ, వలస వచ్చినా కార్మికులు మేము మాట్లాడిన పనికి వాళ్ళు చానా తక్కువ ధరకు మాట్లాడి మాకు పనులు లేకుండా చేస్తున్నారు ఎందుకో మరి వాళ్లకు మా మీద కోపం మేము కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్నదే మా ఉద్దేశం వాళ్లు కూడా మాతో కలిసి పని చేస్తే వాళ్లకు మంచి జీవనోపాధి ఉంటది మాకు స్థానిక యూనియన్ నిర్ణయించిన ఉపాధి ఉంటది. వాళ్లు రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిండ్రు అని, మా స్థానిక యూనియన్ నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం నడవాలని కోరారు. కావున కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని, మా జీవనోపాధి పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉందనీ అన్నారు. అయితే, సరైన రీతిలో పనులు లేకపోవడం, తగిన అవకాశాలు కల్పించకపోవడం వలన మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాల నుండి వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ఐక్యంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మా సమస్యలను గమనించి తక్షణమే పరిష్కారం చూపకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల అసోసియేషన్ నేతలు అధ్యక్షులు సమీర్, జన్ను సునీల్, ఉపాధ్యక్షులు ఫిరోజ్, ఫయాజ్, తాజ్ ఫిరోజ్, అయూబ్, జలీల్, చెన్నూరి కిషోర్, రాజేందర్, నాసం హరీష్, సాదిక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ధర తగ్గించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T140516.191-1.wav?_=3

 

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ధర తగ్గించాలి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు గారి అధ్యక్షతన బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవన్ లో జరిగింది ఇట్టి సమావేశంలో జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక , మొరం ,మట్టి కొరత మరియు భాను నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వం అప్పజెప్పడం ద్వారా భువన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు జరిగే నష్టాలను చర్చించి జిల్లాలో స్థానిక సమస్యలపై ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మండ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక మొరం మట్టి కొరత వలన నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతోపాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రభుత్వము ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని దీనివలన జిల్లాలో భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.జిల్లాలో స్థానికంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ సోమవారం రోజున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అదేవిధంగా నిర్మాణరంగంలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇట్టి సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాపేల్లి రమేష్ , కోల శ్రీనివాస్ , ఈసంపేల్లి రాజెలయ్య , గుంటుక నరేందర్ , సావన పెల్లి ప్రభాకర్ , భూక్య వెంకట్ , దేవయ్య , శంకర్ , చంద్రయ్య , మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా.!

మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా సదానందం ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ కార్మికులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా సదానందం ఉపాధ్యక్షుడు కల్లేపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి రాజేందర్ బద్రిని భూపాలపల్లి మున్సిపల్ కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ కార్మికులు నామీద నమ్మకంతో నన్ను మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తాం అని వారు అన్నారు గౌరవ అధ్యక్షుడు బండారి బాబు ప్రకాష్ కమిటీ సభ్యులు జంపయ్య రాజయ్య మంజుల సునీత సతీష్ రాజేందర్ వెంకన్న రాజబాబు ఎన్నికైనారు కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు

బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 3 వ. మహాసభలు సిరిసిల్ల పట్టణంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర నాయకత్వం సమక్షంలో 21 మందితో నూతన కమిటీనీ ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికల్లో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా – ముశం రమేష్,అధ్యక్షులుగా, శ్రీరాముల రమేష్ చంద్ర,
ప్రధాన కార్యదర్శిగా,సూరం పద్మ,కోశాధికారిగా – జిందం కమలాకర్,ఉపాధ్యక్షులుగా దాసరి రూప , కావేటి సత్యం,లక్ష్మణ్ కార్యదర్శిలుగాబెజుగం సురేష్ ,బోనాల లక్ష్మి , కీసరి పుష్పల,కమిటీ సభ్యులుగా మాడుగుల మల్లయ్య , గట్ల సప్న , లింగంపల్లి జ్యోతి,గురజాల మమత, సులోచన,
వాణి,మానస తదితరులను ఎన్నుకోవడం జరిగినది.ఈ సందర్భంగా సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ నూతన కమిటీగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసి రాబోయే కాలంలో జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ₹4,000 పెన్షన్ అమలు కొరకై అదేవిధంగా బీడీ కంపెనీ యజమాన్యం బీడీ కార్మికుల శ్రమను విపరీతంగా దోపిడీకి పాల్పడుతుందని కార్మికులు పనిచేసినటువంటి బీడీల నుండి 2500 బీడీల కూలీని దోచుకోవడమే కాకుండా దీనితో పాటు అనేక రకాల కోతల పేరుతో కార్మికుల వేతనాల నుండి నెలకు దాదాపు ₹1000 రూ!! ల వరకు కట్ చేయడం జరుగుతుందన్నారు.
బీడీ పరిశ్రమ మరియు కార్మికుల పట్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బీడీ కంపెనీల యజమాన్యాలు చేస్తున్న దోపిడీపై కార్మికులను ఐక్యం చేసి రాబోయే కాలంలో నూతన కమిటీ పనిచేస్తుందని అన్నారు.కార్మికులందరూ కంపెనీ యజమాలకు,టేకేదారులకు భయపడకుండా ఐక్యం కావాలని సంఘం కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.

నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు..

నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T111941.908.wav?_=4

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనానికి బ్యాలెన్స్ పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని ఇటీవల మున్నూరు కాపు సంఘ నాయకులు పుల్లెల జగన్ మోహన్, పుల్లెల రాములు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ను కోరగా దానికి స్పందించిన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీని మున్నూరుకాపు సంఘ నాయకులకు అందజేయడం జరిగింది. తక్కువ సమయంలోనే నిధులు మంజూరు చేసిన బండి సంజయ్ కుమార్ కు దీనికి సహకరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్, బిజెపి నాయకులు పుల్లెల రాములకు మున్నూరు కాపు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు బొడ్డు బాలయ్య, డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, కటకం తిరుపతి, కొట్టే భూమయ్య, కొలుపుల మోహన్, పుల్లెల జగన్ మోహన్, పుల్లెల రాము, బొడ్డు భాస్కర్, గుండ వెంకటేశం, కొలుపుల వేణు, దొగ్గలి శ్రీనివాస్, దొగ్గలి నరేష్, పుల్లెల సాయి, పుల్లెల హిమాన్షు, తదితరులు పాల్గొన్నారు.

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను..

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ముశం రమేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T130848.280.wav?_=5

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో బీడీ అండ్, సిగార్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఇట్టి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమా రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి గార్లు హాజరవుతున్నారు
ఈ మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంగా 4000 పెన్షన్ అమలు చేస్తానని ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోయింది
బీడీ కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్న కంపెనీ యజమానులపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో బీడీ కంపెనీలో బీడీ కంపెనీ యజమాన్యం విపరీతమైన దోపిడీకి పాల్పడతా ఉంది ప్రతి కార్మికుల నుండి కంపెనీ యజమానులు 2000 కూలీని దోచుకుంటున్నారు అనేక రకాల పేర్లతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో బీడీల నుండి ఆదాయం వస్తున్న కూడా బీడీ కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించడం లేదు రాబోయే కాలంలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని కనీస వేతనం 1000 బీడీలకు 600 రూపాయలు చెల్లించాలని ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని 2000 బీడీల కోత విధించకుండా చేయాలని 26 రోజుల పని కల్పించాలని బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాణ్యమైన ఆకు తంబాకు అందించాలని ము శం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర జిందo కమలాకర్, దాసరి రూప, బేజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక సంఘం అధ్యక్షుడికి సన్మానం.

కార్మిక సంఘం అధ్యక్షుడికి సన్మానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T115303.147.wav?_=6

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల అధ్యక్షలుగా సుకుమార్ ఎన్నికయ్యారు. వారిని జహీరాబాద్ బీజేపీ మహిళా నాయకురాలు జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు రాజేష్ ముదిరాజ్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

శ్రీసిటీని సందర్శించిన కేంద్ర గృహనిర్మాణ శాఖ

*శ్రీసిటీని సందర్శించిన కేంద్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ బృందం..

*కార్మికుల గృహ నిర్మాణాలు..

*సుస్థిర పట్టణాభివృద్ధికి హామీ..

తిరుపతి నేటి ధాత్రి

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ కటికితల, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి (అమృత్ పథకం)ఇషా కాలియా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎన్.మౌర్య, సాంకేతిక సలహాదారు రోహిత్ కక్కర్ తో కలసి బుధవారం శ్రీసిటీని సందర్శించారుశ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ఆయనకు సాదర స్వాగతం పలికి,శ్రీసిటీ ప్రణాళిక, ప్రస్థానం, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు.

 

 

 

చర్చల సందర్భంగా, శ్రీసిటీలో అభివృద్ధి చెందుతున్న సామాజిక వసతులపై ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. గృహ సముదాయాలు, విద్యా వసతులు, షాపింగ్ కేంద్రాలు, ఇతర కీలక సౌకర్యాల గురించి హైలైట్ చేశారు.
అలాగే ఇక్కడ అమలు చేస్తున్న సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణ, మురుగునీటి రీసైక్లింగ్,ఘన వ్యర్థాల నిర్వహణ, హరితహిత చర్యలు,ఇతర సుస్థిరత కార్యక్రమాలను వివరించారు. టౌన్‌షిప్ ల అభివృద్ధి ద్వారా “వాక్ టు వర్క్” ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, ఇందుకోసం అవసరమైన సహకారం అందించాలని కార్యదర్శికి విన్నవించారు.

 

 

 

ప్రస్తుత పారిశ్రామిక కార్యకలాపాలు,భవిష్యత్తు విస్తరణ వ్యూహాలు, మౌళిక సదుపాయాలు,నివాస గృహాల డిమాండ్ ముఖ్యంగా డార్మిటరీలు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన అద్దె గృహాలపై శ్రీనివాస్ లోతైన చర్చల్లో పాల్గొన్నారు. ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో విజయవంతమైన గృహ ప్రణాళికల నమూనాలను అధ్యయనం చేయాలని, కేంద్ర గృహ నిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన శ్రీసిటీ బృందానికి సూచించారు. అనంతరం, పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల్లో పాల్గొన్న ఆయన, ప్రధానంగా మహిళా ఉద్యోగులకు చౌకధర అద్దె గృహాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ సహకారం, ఇతర అంశాలపై చర్చించారు. సమగ్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణాల విషయంలో మంత్రిత్వ శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

 

 

 

కేంద్ర గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు శ్రీసిటీ పర్యటనకు రావడం తాము గౌరప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. వారి విలువైన సూచనలు శ్రీసిటీ అభివృద్ధికి మరింత దోహదపడతాయని, ముఖ్యంగా సామాజిక మౌళిక సదుపాయాలుగృహ వసతులను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో చర్చల ద్వారా మౌళిక సదుపాయాలు మరియు కార్మిక నివాసాలకు సంబంధించి వారు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం దక్కిందన్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్ శ్రీసిటీ పరిసరాలతో పాటు ఆల్‌స్టోమ్‌ పరిశ్రమలో తయారు అవుతున్న మెట్రో కోచ్ ల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడ పరిశ్రమ పనితీరు, ఇతర పారిశ్రామిక మౌళిక వసతులను పరిశీలించారు. అద్భుత ప్రణాళిక, కార్యాచరణతో రూపుదిద్దుకున్న శ్రీసిటీ పారిశ్రామిక మరియు ఆర్థిక కేంద్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందంటూ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఇక్కడి ప్రజలు,ఈ ప్రాంతం,దేశ శ్రేయస్సుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. శ్రీసిటీ మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శితో పాటు ఇతర సీనియర్ అధికారులు, సూళ్లూరుపేట
ఆర్ డి ఓ,
కిరణ్మయి పాల్గొన్నారు.

కాకతీయ ఆటో యూనియన్ అధ్యక్షునిగా రెంటాల మోష.

కాకతీయ ఆటో యూనియన్ అధ్యక్షునిగా రెంటాల మోష ఎన్నిక

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలోని కాకతీయ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లను నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో ప్రెసిడెంట్ గా రెంటాల మోషన్ వైస్ ప్రెసిడెంట్ గా బొనగాని రాజశేఖర్ కాకతీయ ఆటో యూనియన్ డ్రైవర్ల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి యూనియన్ బాధ్యతలప్పగిస్తూఎన్నుకున్నందుకు ఆటో డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఎండి హుస్సేన్ జి శ్రీనివాస్ ఆర్ సంపత్ పి గోపి కే రాహుల్ కే జానయ్య బి ప్రవీణ్ ఎస్ వెంకట్ కె రమేష్ డి అశోక్ డి గణేష్ ఎస్ రాజు టి రమణ పాల్గొన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్.

 సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్…

 

ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కాస్తా ఘాటుగా స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోదీని చూసి తెలుసుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరి నువ్వు సిద్ధమా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడితే.. ఎలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీరు, మీ క్యాబినెట్ సహాచరులు ఇలా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై మంగళవారం క్లారిటీ వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందన్నారు. సోమవారం నామినేషన్లు వేస్తారన్నారు. మంగళవారం నూతన అధ్యక్ష పదవిపై ప్రకటన వస్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్న సునీల్ బన్సల్, శోభా కర్లందాజ్లే సోమవారం రాష్ట్రానికి రానున్నారని వివరించారు. వారి సమక్షంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.అయితే సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు. తాము తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తామని.. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డి కోసం.. కాంగ్రెస్ పార్టీ కోసం తాము పని చేయబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెట్రో డీపీఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు.

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు

డి.ఎస్.పి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ను ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ బ్యాంకులో 80,000 మంది ఖాతాదారులు ఉండగా ముగ్గురు మాత్రమే సిబ్బంది వారికి తోడుగా ఒకరిద్దరు సహా సిబ్బంది ఉన్నారు రోజుకు మండలంలోని 17 గ్రామాలు కాకుండా పక్క గ్రామాలను కలుపుకొని 80,000 మంది ఖాతాదారులు ఉన్నారు వీరందరికీ సరిపడా స్టాఫ్ లేరు రైతు భరోసా పైసలు వడ్ల పైసలు ఏకకాలంలో పడడం వల్ల రైతులు ఖాతాదారులు బ్యాంకుకు వస్తున్నారు వారి డబ్బులను వారికి సకాలంలో చెల్లించడంలో ఈ ప్రభుత్వం మరియు బ్యాంకు విఫలమైంది గంటల తరబడి ఖాతాదారులంతా లోపల నిలబడుతున్నారు కనీస సౌకర్యాలు బ్యాంకులో లేవు బిపి షుగర్ ఉన్న పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు కూర్చోడానికి కుర్చీలు లోపల ఉండవు మూత్రం పోదా పోద్దాం అంటే బయట టాయిలెట్ గది ఉండదు ఖాతాదారులకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినప్పుడు ఒక్కొక్క రైతు చెప్పులు అరిగేలా ఎనిమిది రోజులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు ఒక పేద రైతుకు చెక్ బుకు ఎందుకు చెక్ బుక్ ల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు సరైన సెక్యూరిటీ లేక ప్రజలు గుంపులుగాడుతున్నారు స్థానిక ఎస్ఐ సహకరించాలని కోరుతున్నాం ఒక రెండు నెలలు ఈ సమస్య పైన బ్యాంకు మేనేజర్ స్థానిక ఎస్సై ఆర్ అశోక్ స్పందించాలని కోరుతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం కాదు దళారి ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎట్లా అయితది అని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం ఇక ముందు ఇలా కొనసాగితే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బ్యాంక్ ఖాతాదారులు అందరితో కలిసి ధర్నా రాస్తారోకోలు చేస్తాం ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ గాంధీనగర్ గ్రామ అధ్యక్షులు ఇంజపల్లి విక్రమ్ నరసన్న మొగిలి వినయ్ శ్రీ కరణ్ బ్యాంకు ఖాతాదారులు  పాల్గొన్నారు

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర్, గౌరవ అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

సివిల్ సప్లై హమాలి యూనియన్.!

సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా మహాసభల కరపత్రం విడుదల

కేసముద్రం నేటి ధాత్రి:

మే 18న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్లో జరిగే సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎఐటియుసి మండల కార్యదర్శి మంద భాస్కర్, సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంద భాస్కర్ , చొప్పరి శేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను సంస్కరణ పేరుతో చట్టాలను సవరించి కార్మికుల శ్రమను అప్పనంగా దోచుకునేందుకు కుట్ర పండుతుందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. కేసముద్రంలో జరిగే జిల్లా మహాసభలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని ఐదు ఎం ఎల్ ఎస్ పాయింట్ నుండి హమాలీ కార్మికులతో పాటు ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజయ్ సారధి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ బిక్షపతి హాజరవుతారన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్డే బోయిన లక్ష్మీనరసయ్య, రాజబోయిన శ్రీను, నరముల యాకయ్య, బిచ్చు, రాజు, యాకయ్య, రెంటాల వెంకన్న, నగేష్, తాటికాయల యాకయ్య, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

కులగణన పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

కులగణన పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో
దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ,దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ,బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని ,కేంద్రంలో బీసీలకు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాలుగా బీసీలుగా ఉద్యమిస్తున్నామని అన్నారు. దేశంలోని అనేకమైన ఓ బి సి సంఘాలు, ప్రజాసంఘాల పోరాటo, ఉద్యమాల వల్ల కేంద్ర ప్రభుత్వం తలోగ్గి బీసీ కులగనన నెరవేరుస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగనన డిమాండ్ ను జాతీయస్థాయిలో ఒక ఎజెండా అంశంగా తీసుకొచ్చారని అందుకు రాహుల్ గాంధీ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
11 సంవత్సరాల నుండి బీసీల కొరకు ఒక్క మంచి పని కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేయలేదని, ఏ గణనా బీజేపీ చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయమని,కేంద్ర ప్రభుత్వానికి, పి ఎం నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం సామాజిక రిజర్వేషన్లపై 50% రిజర్వేషన్ ఎత్తివేయాలని, తెలంగాణలో 42 శాతం, బీహార్లో 65 రిజర్వేషన్ కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేష్ యాదవ్,పట్టణ అధ్యక్షుడు కమలాకర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బోప్పదేవయ్య ,సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడ్క కమలాకర్,ఇల్లంత కుంట తిరుపతి , బచ్చు ప్రసాద్ ,సామల తిరుపతి,కొండ విజయ్,తొట్ల మల్లేశం,తొట్ల మల్లేశం,రోహిత్ యాదవ్ ,కొండయ్య,దామోదర్ ,శ్రీనివాస్ ,నరేందర్,శ్రీధర్ తదితరు పాల్గొన్నారు.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు.

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ముందస్తు అరెస్ట్

మంచిర్యాల నేటి దాత్రి

 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది మంచిర్యాల పోలీసులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నస్పూర్ అఖిల్. శ్రావణ్ . రాజ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్బంగా నస్పూర్ అఖిల్ మాట్లాడుతూ బి సి ,ఎస్ సి, ఎస్ టి విద్యార్థుల ఫిజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంత వరకీ ఒక స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు అన్నారు విద్యార్థుల బంగారు భవిష్యత్తును గుర్తుంచుకొని ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయాని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది

రాష్ట్ర నాయకత్వం లోకి కుంట్ల మహేందర్.

ఏ ఐ టి యు సి ఆర్టిజన్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం లోకి కుంట్ల మహేందర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం , చెల్పూర్ లో కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన ఏ ఐ టి యు సి కార్యవర్గ సమావేశం లో ఆర్టిజన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న,కుంట్ల మహేందర్ ను ఏ ఐ టి యు సి అనుబంధ తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ యూనియన్ రాష్ట్ర కమిటీ లోకి తీసుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెలు ప్రకటించడం జరిగింది.ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ, ఆర్టిజన్ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న కుంట్ల మహేందర్ కు పదవీ రావడం పట్ల ఏ ఐ టి యు సి రాష్ట్ర రీజినల్ నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
ఇట్టి సమావేశం లో రీజినల్ ప్రెసిడెంట్ కోల శ్యామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగినేని ధర్మారావు, కార్యదర్శి గోపిరెడ్డి కిరణ్, ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి పవన్ కుమార్,పిప్పాల శ్రీపాల్ తదితరలు పాల్గొన్నారు

నవత ఆటో యూనియన్ చలివేంద్రం ఏర్పాటు.

నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముఖ్య అతిథిలుగా హాజరైన ఎస్ఐ మహేందర్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి నేటి ధాత్రి:

 

 

#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని అంబేద్కర్ కూడలిలో నెక్కొండ నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నెక్కొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు సురేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చలివేంద్రం ను ప్రారంభించారు ఈ సందర్భంగా టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులకు త్రాగునీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, గంధం సుధాకర్, నవత ఆటో యూనియన్ సభ్యులు శ్రీరంగం శ్రీనివాస్, పొదిల సురేష్, వాగ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version