రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T144229.093.wav?_=1

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నంపెట్టే రైతన్నలను నిండా ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు రాజమొగిలి(రవి) యూరియా కోసం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనగా తీవ్రగాయాలపాలై హనుమకొండలోని ప్రయివేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఆయనను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా రవి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నరని విమర్శించారు.పులిగిల్ల గ్రామానికి చెందిన రైతులకు వరికోలు గ్రామంలో టోకెన్లు ఇవ్వడమేంటి అక్కడ టోకెన్ తీసుకొని పరకాలలో సొసైటీలో యూరియా ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం బయలుదేరిన రైతులను రోడ్డు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోతున్న మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటలకు తావులేదన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచిన ఘనత కేసిఆర్ దన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని,ధైర్యంగా నిలబడి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడి యూరియా తెచ్చుకుందామని అన్నారు.మీకు అండగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని అన్నారు.పరకాల ఆర్టీసీ డీఎం,అగ్రికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదంలో కాలువిరిగిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

వ్యవసాయానికి బ్యాంకులు రూ.2148 కోట్ల రుణం.

గత ఏడాది కంటే రూ.472 కోట్లు అధికంగా బ్యాంకుల బడ్జెట్.

ఇందులో పంట రుణాలకు రూ. 1140 కోట్లు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల/ నేటి ధాత్రి.

 

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2148 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం రుణాలలో రూ.1140 కోట్లను పంట రుణాలకు కేటాయించగా.. మిగిలిన రూ.1008 కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలకు ఇస్తారని వివరించారు. నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలంలో కంటే ఈ ఏడాది ఖరీఫ్ లో పంటల సాగు పెరిగిందని, దాని ప్రకారంగా యూరియా వాడకం కూడా పెరిగిందని చెప్పారు.
వర్షాలు బాగా కురిసి, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసిన నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలను సరళీకృత విధానంలో అందించాలని అధికారులను కోరామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన రైతులకు రూ. 1290 కోట్లను పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వివిధ కారణాలతో ఈ లక్ష్యంలో రూ. 867 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసారని చెప్పారు. అయితే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలను సరళీకృత విధానంలో అందించాలని, పంట రుణాలతో పాటుగా వ్యవసాయ సంబంధిత రంగాలకు, వ్యవసాయ యాంత్రీకరణకు మరింత అధికంగా రుణాలను ఇవ్వాలని కోరామని అన్నారు. గత ఏడాదిలో పంట రుణాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.1676 కోట్ల రుపాయల బడ్జెట్ ను కేటాయించగా ఈ ఏడాది దానికంటే రూ.472 కోట్లు అధికంగా రూ.2148 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వెల్లడించారు. ఈ మొత్తం బడ్జెట్లో జడ్చర్ల మండలానికి రూ.1024 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.283 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.361 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.190 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.186 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.102 కోట్లు చొప్పున బ్యాంకుల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. అలాగే ఈ ఏడాది పంట రుణాల కోసం నియోజకవర్గం మొత్తానికి రూ.1140 కోట్లను కేటాయించగా వీటిలో జడ్చర్ల మండలానికి రూ.482 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.166 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.235 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.104 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.108 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.43 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు విపులీకరించారు.

పెరిగిన పంటల సాగు..యూరియా వాడకం:

జడ్చర్ల నియోజక వర్గంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల సాగు గణణీయంగా పెరిగిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో 24,773 ఎకరాల విస్తీర్ణం లో మొక్క జొన్న పంట సాగు చేయటం జరిగిందని, అయితే ఈ సంవత్సరం 41,160 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయటం జరిగిందని చెప్పారు. అదే విధంగా గత సంవత్సరం వరి పంట 61,708 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 68,069 ఎకరాలలో నాట్లు వేయటం జరిగిందన్నారు. మొక్కజొన్న, వరి పంటల్లో యూరియా వాడకం అదికంగా ఉండటంతో నియోజకవర్గంలో యూరియాకు డిమాండ్ పెరిగిందని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోయిందని, అయితే ప్రస్తుతం 14 వ తేదీ నాటికే 9,134 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగలిగామని వివరించారు. నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో కేటాయించేలా అధికారులతో సమన్వయం చేసుకొని, జిల్లాకు యూరియా రేక్ వచ్చినప్పుడల్లా జడ్చర్లకు ఎక్కువ యూరియాను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు..

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు

రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని CPM ధర్నా

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా

పరకాల నేటిధాత్రి

రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T153118.778-1.wav?_=2

 

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

యూరియా లేక రైతుల ఇబ్బందులు

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఘనపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం విషయంలో మాట తప్పిందని కనీసం రైతులకు యూరియా అందించలేని దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని లేనిపక్షంలో రైతుల కోసం రైతు సంక్షేమం కోసం ధర్నా చేస్తామని అన్నారు
కార్యక్రమంలో వారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు తోట మానస శ్రీనివాస్, పెంచల రవీందర్, నాయకులు బైరగాని కుమారస్వామి, ఉడుత సాంబయ్య, పేరాల దేవేందర్ రావు, మామిండ్ల సాంబయ్య, గాజర్ల చింటూ, వాజిద్, తదితరులు ఉన్నారు

రైతులకు తప్పని యూరియా కష్టాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T154922.742-1.wav?_=3

 

రైతులకు తప్పని యూరియా కష్టాలు

రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గోలి చంద్రారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

చిగురుమామిడి మండలంలోని రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించడంలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చిగురుమామిడి మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈసందర్భంగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా మండలంలో యూరియా బస్తాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో యూరియా కష్టాలు తీవ్రం అయ్యాయని దీనిని పరిష్కరించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఘెరంగా విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం ప్రతిరోజు ప్రాథమిక సహకార కేంద్రం వద్ద బారులు తీరుతూ చెప్పులు పెట్టి గంటల తరబడి లైన్లో నిల్చున్న పొన్నం ప్రభాకర్ కు కనీస కనికరం లేకుండా పోయిందని రైతులను గోస పెట్టిన ఏప్రభుత్వం కూడా నిలవదని ఆయన అన్నారు. పట్టాదారు పాసు బుక్కు ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాతోపాటు నాన్ లిక్విడ్ కొంటేనే యూరియా బస్తా ఇస్తున్నారని రైతుకు ఇష్టం లేకున్నా అంటగడుతున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించి బయట విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని వెంటనే రైతులకు చిగురుమామిడి మండలంలో సరిపడ యూరియాని తెప్పించాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ముద్రకోల రాజయ్య, మనోజ్, మహేందర్, రెడ్డి, ఐలయ్య, గంగారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి, పోచయ్య, స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులకు సరిపడా యూరియాను అందించాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52-2.wav?_=4

రైతులకు సరిపడా యూరియాను అందించాలి

పట్టా బుక్కు లేకుంటే ఆధార్ ద్వారా కూడా అందించాలి

-సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న

కరకగూడెం,,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి…

మండలంలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ తగిన స్థాయిలో యూరియా అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మండలంలోని అశ్వాపురం గ్రామంలో పార్టీ మండల కమిటీ సమావేశం కొమరం మల్లక్క అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే యూరియా మీద దృష్టి పెట్టినట్లయితే ఇంత పరిస్థితి ఉండేది కాదని రైతుల పక్షాన ఉండటంలో ప్రభుత్వం వైశాల్యం చెందుతుందని వారు విమర్శించారు ఒక్కో రైతు నాలుగైదు రోజుల తరబడి ఎదురు చూడటం ద్వారా నరకయాతనకు గురవుతున్నారని వారన్నారు తక్షణమే రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే యూరియా పంపిణీ విషయంలో పట్టాదార్ పాస్ పుస్తకలు లేని భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా ఆధార్ కార్డు నిబంధన అమలు చేయాలని మండలంలో చాలా మంది రైతులకు పట్టాలు లేవని గిరిజనులలో కూడా కొంతమందిలో భుమి పట్టాల సమస్య ఉందని పట్టాలు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు యూరియాను ప్రభుత్వం తగిన స్థాయిలో అందించకుంటే రైతులను సమీకరించి ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, బిలపాటి శంకరయ్య, కనితి రాము, పద్దం బాబురావు తదితరులు పాల్గొన్నారు

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ..

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ

మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, మొగుళ్ళపల్లి (PACS) వద్ద యూరియా మరియు ఇతర ఎరువుల విక్రయాల పై స్థానిక ఎస్సై బి. అశోక్ , మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి తానిఖీ నిర్వహించడం జరిగింది. తానిఖీలో యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యత మరియు నిల్వలకు సంబంధించిన వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డు, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి రైతుకి వారి యొక్క వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సిఫారసు మేరకే యూరియా మరియు ఇతర ఎరువుల బస్తాలను రైతులకి పంపిణీ చేయాలని సూచించడం జరిగింది. అలాగే, నానో యూరియా మరియు నానో డి‌ఏ‌పి వాడకం, నానో యూరియా వాడడం వల్ల కలిగే లాభాలు మరియు సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి రైతులకు సూచించడం జరిగింది.
మొగుళ్ళపల్లి మండల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది ఈ PACS, మొగుళ్ళపల్లి వద్ద 444 బస్తాలు, PACS, మొట్లపల్లి వద్ద 444 బస్తాలు, PACS, ఇస్సిపేట వద్ద 444 బస్తాలు మరియు అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద 222 బస్తాలు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది, కావున రైతులు మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డు తో సంబంధిత కేంద్రాలనుండి ఎరువులను పొందగలరు.
ఇట్టి తానిఖీలో CEO A. సాగర్ PACS పంపిణీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలి

ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలి

ఎవరైనా డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు

మండల వ్యవసాయ అధికారి…. బి వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్, మరియు జిల్లా వ్యవసాయ అధికారి మహబూబాబాద్ ఆదేశాల మేరకు, శనివారం కేసముద్రం మండలంలోని పలు ఎరువుల దుకాణాలు, మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను, ఆగ్రో రైతు సేవ కేంద్రాలను కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న, మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది, పలు దుకాణాలలో వారు యూరియా నిలువలు, లైసెన్స్, పి ఓ ఎస్ మిషన్ బ్యాలెన్స్ మరియు, స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్, గోదాం బ్యాలెన్స్ తనిఖీలు చేయడం జరిగింది.
కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మాట్లాడుతూ, కేసముద్రం మండలంలోని ఎరువుల డీలర్లు, ప్రాపర్ గా, స్టాక్ బోర్డు మరియు, గోదాం బ్యాలెన్స్,స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్, పి ఓ ఎస్ బ్యాలెన్స్ మెషిన్ తో సమానంగా ఉండేటట్లుగా ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలని వారు సూచించారు, ఎరువుల డీలర్లు ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లుల మీద రైతు సంతకాలు తీసుకోవాలని, ఎవరైనా డీలరు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడిన, అధిక ధరలకు విక్రయించిన, నిత్యావసర వస్తువుల చట్టం 1955 మరియ ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు. అదేవిధంగా రైతులు ఆధార్ కార్డు మరియు పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ నకలు ను తీసుకువెళ్లి యూరియా మరియు ఇతర ఎరువులను కొనుగోలు చేయాలని వారు సూచించారు.
అదేవిధంగా నానో యూరియా వాడకాన్ని రైతులు అలవాటు చేసుకోవాలని, అది కూడా గ్రాన్యూలార్ యూరియా వలె పని చేస్తుందని, వారు తెలిపారు.
కేసముద్రం మండలంలో యూరియా నిల్వలు 389 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, 1) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవ కేంద్రాల వద్ద 210 మెట్రిక్ టన్నులు, 2) ప్రవేట్ దుకాణాల వద్ద 179 మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు అందుబాటులో ఉన్నందున రైతులు ఎవరు ఆందోళన చెందువద్దని, విడతలవారీగా మండలానికి యూరియా వస్తున్నందున రైతులు పత్తి, మొక్కజొన్న మరియు ఇతర పంటలకు మోతాదులో మాత్రమే వినియోగించాలని వారు సూచించారు, ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న మరియు ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

#6 ఏ కేసు నమోదు చేసి యూరియా నిలువల అమ్మకాలు నిలిపివేశారు.

#యూరియా కొరతను డీలర్లు సృష్టిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

#ఏడిఏ దామోదర్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

యూరియాను కృతిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి డీలర్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని నర్సంపేట ఏ డి ఏ దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేపట్టారు. ఆదివారం రాత్రి యూరియా కోసం మండలంలోని బిల్లా నాయక్ తండా చెందిన రైతులు యూరియా కోసం మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ షాపు వెళ్ళగా యూరియా నిలువలు ఉండంగా లేదని దురుసుగా రైతులపై మాట్లాడడంతో సదరు డీలర్ గోదాం దగ్గరికి వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంత పరిచి సమాధానం చెప్పడంతో రైతులు శాంతించగా.

Fertilizer Dealer.

ఈ సంఘటన రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనం కాగా అధికారులు స్పందించి కర్ర కృష్ణారెడ్డి డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిలువలపై స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి 1000 బస్తాలు ఉండడంతో అట్టి యూరియా నిలువలను అధికారులకు సమాచారం ఇవ్వకుండా అమ్మరాదని సదర్ డీలర్ కర్ర కృష్ణారెడ్డిని హెచ్చరించారు. అనంతరం ఆయనపై 6 ఏ కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలోని ఏ డీలర్ కూడా యూరియాకు లింకు పెట్టి అమ్మితే చట్ట రిత్యా చర్య తీసుకొని సంబంధిత డీలర్ లైసెన్సును రద్దు చేయబడుతుందని ఆయన పలువురు డీలర్లకు సూచించారు. ఆయన వెంట ఏవో బన్న రజిత, ఏ ఈ ఓ శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ
జిల్లా వ్యవసాయ అధికారి నునావత్ వీరు నాయక్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారుల షాప్లను తానిఖీ చేయడం జరిగింది. తానిఖీలో భాగంగా పత్తి విత్తనాల లభ్యత & నిల్వలు, ఎరువుల లభ్యత & నిల్వలు లైసెన్స్ వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది.
డీలర్లు విధిగా పాటించవల్సిన నియమాలు: డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి. స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి.డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి. స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్
బోర్డుపై రాయాలిబ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును.
లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా
పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా
నిల్వచేయాలి. డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం జరపరాదు లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలిడీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి.

ఇట్టి తానిఖీలో స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి.

కష్టాల కడలిలో ఎరువుల వ్యాపారాస్తుల పరిస్థితి

డీలర్ లపై కొన్ని కంపెనీల కపట ప్రేమ

ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మరియు డీలర్ ఫెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

 

ఎరువుల రిటైల్ డీలర్లు వ్యాపారం,కష్టాల కడలిపై, నష్టాల నావలా తయారైందని గత రెండేళ్లుగా కొన్ని ఎరువుల కంపెనీలు,రిటైల్ డీలర్లకు ఇచ్చే మార్జిన్లు గణనీయంగా తగ్గించడంతో హోల్ సేల్ డీలర్లు ఎమ్మార్పీ ధరలకు అమ్మి రిటైల్ డీలర్లకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నవని పరకాల మండల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్ మరియు డీలక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందే వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రముఖ ఎరువుల కంపెనీలలో కొన్ని కంపెనీలు లాభా పెక్షే ధ్యేయంగా ఎరువుల కంపెనీ డీలర్ల పై కపట ప్రేమను చూపిస్తూ సీజను అన్సీజన్ పక్కనపెట్టి డిమాండేతర సరుకులకు ఎరువుల ఆర్డర్ తోపాటు లింకు రూపేనా కొన్ని రకాల సరుకులను తీసుకున్న హోల్ సేల్ డీలర్లుతో మాత్రమే వ్యాపారం చేస్తున్నాయన్నారు.లింకులో తెచ్చుకున్న సరుకులు అమ్ముడుపోక వ్యాపారంలో లాభాలురాక డీలర్లు చితికి పోతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా బస్తాలు రిటైల్ డీలర్లు అమ్మే పరిస్థితిలో లేరని కొన్ని కంపెనీ లు ఇచ్చే మార్జిన్లు హమాలీ, డి డి ఖర్చులకే పోతున్నాయని ఇవన్నీ పోగా డీలర్లకు మిగిలేది శూన్యమే అని అన్నారు.ఎరువులపై గవర్నమేంట్ సబ్సిడీ ఇస్తున్నారు కానీ కంపెనీ వారు వారి లాభాపేక్షణకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్నారని అధికారులు,కంపెనీ ప్రతినిధులు దీనిపై దృష్టి సారించి ఇచ్చే లింకులు రైతులకు ఇచ్చే విధంగా రూల్ పాస్ చెసి రిటైల్ డీలర్లకు న్యాయ
సమ్మతమైన విధంగా యూరియాను అందించాలని కోరారు.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల.

ఫర్టిలైజర్ నూతన కమిటీని సన్మానించిన వరికెల

పరకాల నేటిధాత్రి

 

పరకాల మండల ఎరువులు పురుగు మందులు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు, ఎర్ర లక్ష్మణ్ లను తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు,కార్మిక సంఘ నాయకులు లంకదాసరి అశోక్ లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని కోరారు.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

సబ్ స్టేషన్ తండా వాస్తవ్యులు మలోత్ రాజు ఇటీవల జరిగిన
పాకిస్తాన్ మరియు ఇండియ సిందూరు ఆపరేషన్ యుద్ధంలో
కేసముద్రం మున్సిపాలిటీ పరిది లోని సబ్ స్టేషన్ తండా కూ చెందిన మలోత్ రాజు పాల్గొనడం గర్వకారణమని, అగ్రోస్ రైతు సేవ కేంద్రం దన్నసరి క్రాస్ రోఢ్ యజమానులు ధారావత్ రాజు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ కేసముద్రం మండల అధ్యక్షులు ననబల రమేష్ ఏఎంసి కేసముద్రం మాజీ డైరెక్టర్ ధారావత్ రమారవిందర్ నాయక్,
బనోత్ నాగ ,మాలోత్ బాలాజీ, బానోత్ రాజు, బనోత్ సురేష్, బానోత్ వీరన్న తదితరులు పాల్గోన్నారు

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం.

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం

వీణవంక (కరీంనగర్ జిల్లా ):

నేటి ధాత్రి :వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విత్తనాలు, ఎరువుల దుకాణాదారులతో ట్రైనీ ఎస్సై, ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారి తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జమ్మికుంట రూరల్ సీఐ గారి సూచనల మేరకు, వ్యవసాయ అధికారితో కలిసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సూచనల మేరకు నకిలీ విత్తనాలు అమ్మకానికి పాల్పడకూడదు.
గుర్తు తెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమి కీటకాల మందులు అమ్మకూడదు క్రిమి సహాక మందులు అమ్మేటప్పుడు రైతు ఆధార్, పాస్‌బుక్, జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకొని రిజిస్టర్‌లో నమోదు చేయాలి అని తెలిపారు అంతేకాకుండా
లాట్ నంబర్, పీసీ నంబర్ సరిగా ఉండాలి.
సరైన లైసెన్సు ఉన్నవారే అమ్మకాలు నిర్వహించాలి.
దుకాణదారులు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు సిబ్బంది హెచ్చరించారు
ఈ సమావేశంలో పలు గ్రామాల ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణదారులు పాల్గొన్నారు.

విత్తన ఎరువుల దుకాణాల్లో.

విత్తన ఎరువుల దుకాణాల్లో తనిఖీలు ఎన్ రమేష్ ఏడిఏ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మొగుళ్ళపల్లి మండల పరిధిలోని రంగాపూర్, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొర్కిశాల, పిడిసిల్ల గ్రామాలకు చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారుల షాప్లను తానిఖీ చేశారు తానిఖీలో పత్తి విత్తనాల లభ్యత & నిల్వలు, ఎరువుల లభ్యత & నిల్వలు లైసెన్స్ వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది.
డీలర్లు విధిగా పాటించవల్సిన నియమాలు:
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి.
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి.
డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి.
స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్
బోర్డుపై రాయాలిబ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును. లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా
పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా నిల్వచేయాలి. డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం జరపరాదు.
లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలి.
డీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి. ఇట్టి తానిఖీలో స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

ఫర్టిలైజర్స్,సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

ఫర్టిలైజర్స్,సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

పోలీస్,వ్యవసాయ శాఖల ఉమ్మడి తనిఖీలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు.వర్షాకాలం నేపథ్యంలో నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారా అని నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని విత్తనాల షాపులను దుగ్గొండి సీఐ సాయిరమణ,నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.

Agriculture.

ఎరువుల దుకాణాల యజమానులకు ఎలాంటి నకిలీ విత్తనాలు, పత్తి గింజలు మిరప గింజలు,మొక్కజొన్నలు,పెసర్లు రైతులకు సంబంధించిన నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడిఏ దామోదర్ రెడ్డి,సీఐ సాయిరమణ హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు, నర్సంపేట ఏవో కృష్ణ కుమార్, దుగ్గొండి ఏవో మాధవి, చెన్నారావుపేట ఏవో గోపాల్ రెడ్డి, దుగ్గొండి ఏఈఓ విజయంతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

పోలీస్,వ్యవసాయ శాఖల ఉమ్మడి తనిఖీలు.

నర్సంపేట నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు.వర్షాకాలం నేపథ్యంలో నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారా అని నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని విత్తనాల షాపులను దుగ్గొండి సీఐ సాయిరమణ,నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.

Fertilizer

ఎరువుల దుకాణాల యజమానులకు ఎలాంటి నకిలీ విత్తనాలు, పత్తి గింజలు మిరప గింజలు,మొక్కజొన్నలు,పెసర్లు రైతులకు సంబంధించిన నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడిఏ దామోదర్ రెడ్డి,సీఐ సాయిరమణ హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు, నర్సంపేట ఏవో కృష్ణ కుమార్, దుగ్గొండి ఏవో మాధవి, చెన్నారావుపేట ఏవో గోపాల్ రెడ్డి, దుగ్గొండి ఏఈఓ విజయంతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు..

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు

శాలువాతో సత్కరించిన అరుణ ఫర్టిలైజర్ యాజమాని వెంకన్న

పరకాల:నేటిధాత్రి
వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్బంగా అరుణ ఫర్టీలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే వెంకటేశ్వర్లు హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.గత 35 సంవత్సరాలుగా ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ రంగంలో వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు అందిస్తూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఎరువుల పురుగుమందులు విత్తనంపై దుకాణాల యజమానుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు గందే వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి జిల్లాకు ఎరువుల సరఫరా పెంపు అవసరం.!

*తిరుపతి జిల్లాకు ఎరువుల సరఫరా పెంపు అవసరం..

*ఎంపీ మద్దిల గురుమూర్తి..

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27:

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి 2025-26 ఖరీఫ్ మరియు రబీ సీజన్‌ల కోసం అవసరమైన ఎరువుల సరఫరా పెంచేందుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లకు లేఖ రాశారు.
2024-25 వ్యవసాయ సంవత్సరంలో 1,19,141,
మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించబడ్డాయని తెలిపారు.రైతుల అవసరాలను, పెరుగుతున్న వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2025-26 సంవత్సరానికి 25% పెరుగుదల అంటే 1,54,131 మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా అవసరమని తన లేఖలో పేర్కొన్నారు.
రైతులకు ఎరువులు సకాలంలో అందించేందుకు, జిల్లాలో రిటైల్ డీలర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం 258 ప్రైవేట్ డీలర్లు, 36 వ్యవసాయ సహకార సంఘాలు ఎరువుల పంపిణీలో ఉన్నాయని, పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా డీలర్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు.
రైతుల ఉత్పాదకత పెంపు, ఆహార భద్రత లక్ష్యాలను సాధించేందుకు సరఫరా పెంపు ఎంతో కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తగిన చర్యలు తీసుకుని, అవసరమైన ఎరువుల నిల్వలు సమర్థవంతంగా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version