మండలంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన తెలుగు పరీక్షకు ఆరు మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి వి మార్కండేయ నాయుడు తెలిపారు. మండలంలో నెత్త కుప్పం, కుప్పం బాదూరు, కమ్మ కండ్రిగ, సొరకాయల పాల్యం, కే కే వి పురం పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు328 మంది, ప్రైవేటు విద్యార్థులు 6తో కలిపి మొత్తం 334 మంది హాజరు కావాల్సి ఉండగా 328 మంది హాజరయ్యారు. ఇద్దరు రెగ్యులర్ విద్యార్థులు, నలుగురు ప్రైవేట్ విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు , సొరకాయల పాల్యం పరీక్షా కేంద్రంలో కాయంపేట, పత్తి పుత్తూరు,కమ్మ కండ్రిగ పరీక్ష కేంద్రంలో దుర్గ సముద్రం పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కమ్మ కండ్రిగ పరీక్షా కేంద్రంలో లావణ్య, మురారి ఇద్దరు ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులు పరీక్షలకు హాజరై, సహాయకులచే పరీక్షలు వ్రాయించారు.పరీక్షా కేంద్రాల వద్ద ఎస్సై భక్తవత్సలం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి 144 సెక్షన్ విధించారు..
కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
భూపాలపల్లి నేటిధాత్రి
ఈనెల 8న మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బుధవారం కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, పూజారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో వడివట్టం కట్టి ఘన స్వాగతం పలికారు. భద్రత, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలపై సమీక్ష అనంతరం దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ప్రతి సెక్టార్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. దేవాలయాన్ని సుందరంగా అలంకరించాలని, పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ముమ్మరంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాలన్నారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటన దృష్ట్యా నాలుగు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా దారి సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మల్చూర్ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎంపిఓ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
న్యాల్కల్ లో ఉర్సు: గంధం ఊరేగింపుతో ఆధ్యాత్మిక వాతావరణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో ఉర్సు సందర్భంగా సోమవారం రాత్రి గంధం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపులో అలంకరించిన గుర్రం, డప్పుల మోగుడు, భక్తుల నినాదాలతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. గంధపు సువాసన, దువాలు, సలాం మధ్య ఊరేగింపు ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసరాలను విద్యుత్ దీపాలు, పతాకాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయగా, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నందినగర్‌లోని నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు ముందు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆన్ కెమెరా విచారణ జరుగుతోంది. అయితే, సిట్ విచారణకు ముందు పార్టీ నాయకులతో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా గులాబీ బాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోశానని.. ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..
స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి
టీ20 వరల్డ్ కప్-2026 నుంచి బంగ్లా ఔట్.. తొలిసారి స్పందించిన
దానం నాగేందర్ కేసు విచారణ.. పాడి కౌశిక్‌రెడ్డి ఏమన్నారంటే?
వచ్చే బడ్జెట్లో బంగారం కొనుగోళ్ల మీద పాన్-ఆధార్ పరిమితి పెంచ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన ని
పీటీ ఉష కుటుంబంలో విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
రేవంత్ నయా రికార్డ్.. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొ
మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి
మైక్రోసాఫ్ట్‌కు షాక్.. 424 బిలియన్ డాలర్లు ఆవిరి!
మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి
రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని.. అలాగే ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశామని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు మాజీ ముఖ్యమంతి. ఇప్పుడు ఇదే గదిలో విచారణను ఎదుర్కోవడం దురదృష్టకరమంటూ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు.కాగా.. నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను ఐదుగురు సభ్యుల సిట్ బృందం ప్రశ్నిస్తోంది. భవనంలోని రెండో ఫ్లోర్‌లో విచారణ జరుగుతోంది. విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని అరెస్ట్‌లు చేశారు.
జహీరాబాద్, జనవరి 30( ప్రజా జ్యోతి న్యూస్ )పట్టణ పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో 24 వార్డ్ బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ నామినేషన్ దాఖలు చేశారు. వారి వెనుక బిజెపి నాయకుడు పాలెంకర్ సంతోష్ కాలోని వాసులు పాల్గొన్నారు అని తెలియజేశారు. అనంతరం చివరి రోజు(శుక్రవారం) కావడంతో పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలు, బాజాభజంత్రీలతో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. అభ్యర్థుల మద్దతుదారులతో పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. పోలీసులు ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వ హించారు. అభ్యర్థి తోపాటు పాలిoకార్ మహేష్, చిరంజీవి, డప్పు విజయ్, సంతోష్ తదితరులు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడం తో పట్టణంలో ప్రచార పర్వం ఊపందు కోనుంది.
భక్తులుకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై అశోక్ ప్రత్యేక ఏర్పాట్లు
మొగులపల్లి నేటి దాత్రి
మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్ళపల్లిలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఉత్సవాలలో భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై బొరగాల అశోక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో ట్రాఫిక్ అంతరాయంతో దర్శణానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కునేవారు. గత జాతరలో జరిగిన ట్రాఫిక్ పరిస్థితులు పునరావృతం కాకుండా. జాతరలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా సవ్యంగా భక్తులకు దర్శనం జరిగేవిదంగా . మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ ముందస్తుగా పోలీస్ సిబ్బందితో ట్రాఫిక్ సమస్యలపై ఆంక్షలుతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడమే కాకుండా నిత్యం జాతరకు వచ్చే వాహనాలను నేరుగా పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలిపి ఉంచడంపై ప్రత్యేక దృష్టి సాధించడంతో రెండు లక్షలకు పైగా భారీ సంఖ్యలో జాతరకు వచ్చిన భక్తజనం అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మొక్కులు చెల్లించుకున్నారు. జాతర నిర్వహణలో మొగుళ్లపల్లి ఎస్ఐ బొరగల అశోక్ ఎంతో కీలకంగా వ్యవహరించాడంతో భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం…
మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఏ గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి నాలుగు రోజుల పాటు జాతర జరిగే నేపథ్యంలో సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మంగళవారం కంక వనం తో జాతర ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగామందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ హాజరయ్యారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కంకవనాన్ని ప్రతిష్టించారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా సింగరేణి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది.జాతరకు కార్మికులు , కార్మికేతరులు, భక్తులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని మందమర్రి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరుతున్నారు.మహిళలకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, క్షౌరషాలలు ఏర్పాటు చేస్తున్నారు. బెల్లంపల్లి ,మందమర్రి, రామకృష్ణాపూర్, గద్దెరాగడి ప్రాంతాల నుంచి నుంచి భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.సుమారు 10 నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణం మొత్తం కనిపించేలా పెద్ద టవర్ ఏర్పాటు చేశారు.టవర్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో చోరీలు జరిగే అవకాశం ఉంటే వారిని పసికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ పి రమేష్ ల ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఎస్సై జె శ్రీధర్ నేతృత్వంలో సుమారు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.సుమారు 300 కు పైగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. కంక వనం కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల పాటు నిర్వహించే ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర స్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి. ప్రవీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జాతరకు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు.ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. జాతరకు వచ్చే మార్గాల్లో రోడ్ల రిపేర్పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఝరాసంగం గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్ మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ మాజీ సర్పంచ్ జగన్ పటేల్ పాల్గొన్నారు.
సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కృప ప్రతి ఒక్కరిపై ఉండాలి..
మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల కృప కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం మందమర్రి ఏరియాలోని ఆర్కే వన్ ఏ గని వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర లో భాగంగా అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి మొక్కలు చెల్లించారు.అనంతరం జిఎం రాధాకృష్ణ మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలు పుర ప్రముఖుల సహాయ సహకారాలతో ఇంత గొప్పగా జాతర జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. మందమర్రి ఏరియా పరిసర ప్రాంత ప్రజలు ఉద్యోగులు జాతరకు విచ్చేసి అమ్మవార్ల ను దర్శించుకోవాలని కోరారు. సుమారు 40 సంవత్సరాలుగా జాతరను సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు సైతం ఉంటుందని అన్నారు .సాంస్కృతిక కార్యక్రమాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీలు సలేంద్ర సత్యనారాయణ, అక్బర్ అలీ, కేకే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతీ ఝా, పర్సనల్ డిజిఎం అశోక్, కిరణ్ కుమార్ ప్రసాద్ ,సివిల్ ఎస్ఈ శ్రీధర్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకట్ రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ ,రవి యూనియన్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు పరిశీలన…
పుర కమిషనర్ గద్దె రాజు, సిఐ శశిధర్ రెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించి సదుపాయాలను పరిశీలించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డిలు అన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22 వార్డులు 45 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి 700 నుండి 800 మంది ఓటర్లు ఉన్నారని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం జరిగిందని తెలిపారు.
ఎక్కడైతే సౌకర్యాలు సరిగా లేవో ఆ పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తామని సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ లు స్పష్టం చేశారు.
#అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో జాతరను దిగ్విజయం చేయాలి.
#ప్లాస్టిక్ రహిత జాతరగా మద్ది మేడారాన్ని నిలపాలి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ప్లాస్టిక్ రహితంగా మద్ది మేడారం జాతరను అధికారులు, ఆలయ కమిటీ సమన్వయంతో ముందుకు సాగి జాతరను దిగ్విజయం చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం మండలంలోని నాగరాజు పల్లి గ్రామ శివారులో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు తాగునీరు, రవాణా సౌకర్యం, వైద్యం అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తూ భక్తులను అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని పోలీస్ శాఖకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ జాతరలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం తరఫున మరిన్ని నిధులు ఇప్పిస్తే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాతరను సజావుగా సాగే విధంగా ఆలయ కమిటీ కృషి చేస్తుందని కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడి జాతరకు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీవో శుభ నివాస్, నాగరాజు పల్లి సర్పంచ్ ఎరుకల లలిత, మామిండ్ల వీరేపల్లి సర్పంచ్ ఏడాకుల సరోజన, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ , విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగు గ్రామంలో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ శశిధర్ రెడ్డి, మందమర్రి , కాసిపేట, దేవాపూర్ ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామన్నారు.ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లా రెడ్డి (Malla Reddy), మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈరోజు (మంగళవారం) అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌పై ప్రజలకు అవగాహన సదస్సు*
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పటిష్ట బందోబస్తు : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి
ముత్తారం :- నేటి ధాత్రి
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ముత్తారం పోలీస్ ఆధ్వర్యంలో ఖమ్మం పల్లి, ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేసనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) పై అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ముత్తారం ఎస్ ఐ రవి కుమార్, సిబ్బంది తో కలిసి గ్రామాల వారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలు, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులకు యువత కు ప్రత్యేకంగా ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలు వివరించి అవగాహన కల్పించారు
ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ…. ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, గొడవలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరగాలని దానికి అందరూ పోలీస్ వారికీ సహకరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, ప్రచారాలు సమయంలో, పోలింగ్ ను ముందురోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, నిషేధిత చర్యలు, డబ్బు/మద్యం పంపిణీ, బెదిరింపులు, పోలింగ్ బూత్ ల వద్ద ప్రభావం చూపే చర్యలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఎలాంటి అక్రమ చట్ట వ్యతిరేకమైన, ఎన్నికల ఉల్లాంఘాన చర్యలు జరిగిన వెంటనే డయాల్ 100, స్థానిక పోలీస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు గొడవలకు పాల్పడడం చేయకూడదు అన్నారు. అభ్యర్థులు, మద్దతుదారులు శాంతి భద్రతలను కాపాడుతూ ఎన్నికల చట్టాలను గౌరవించాలి అని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక చర్యలు, ప్రతిష్టాభంగ ప్రచారాలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా హానికరమైన ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు షేర్ చేసిన కూడా బాధ్యులపై చర్యలు తప్పమన్నారు. రాత్రి వేళలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని.. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంథని సీఐ బి. రాజు, ముత్తారం ఎస్ ఐ రవి కుమార్, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, తిరుమలగిరి నామినేషన్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ ధారావత్ జానకి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలపై సిబ్బందితో కలిసి ఆరా తీశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్ గౌడ్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలంలో ఈరోజు రెండో విడత నామినేషన్లు ఆఖరి రోజు కావడంతోఆశావాహులందరి నామినేషన్లు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు చివరి రోజు కావడంతో గ్రామాల్లోని గ్రామ ప్రజలు వార్డు ప్రజలు గ్రామాల్లోని గ్రామపంచాయతీలో నామినేషన్లు వేసినారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉన్నందున మండలంలో ప్రతి గ్రామ ప్రజలు నామినేషన్లు వేసిన ఆశావాహులు ఎవరు ఉంటారో ఎవరు బరిలో ఉండరోతెలియని పరిస్థితి ఉండడంతో ఎవరికి వారే గెలుస్తామని ధీమాలో ఉన్నారు. అలాగే మండలంలో ప్రతి నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోలీసులు పోలీసు సిబ్బంది ఎన్నికల రిటర్న్ అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు ఇట్టి నామినేషన్ పక్రిలో భాగంగా తమ విధులు నిర్వహిస్తు వచ్చేవారికి ఎలాంటి సౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే మండలంలో ఎలాంటి చెదురు మధుర సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటూ గ్రామ గ్రామాన పోలీసుల పర్యవేక్షణలో రక్షణ బాధ్యతలు చేపడుతున్నారు అలాగే నామినేషన్ వేసే క్రమంలో ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరూ నామినేషన్ వేయడానికి వచ్చేవారు సంబంధిత అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ అన్ని అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించారు
మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద సిఐ దేవయ్య ఆదేశాల మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య పటిష్ట బంధవస్తు నిర్వహించారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్సై లు హెచ్చరించారు.అలాగే తాండూర్ మండల కేంద్రంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.
కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ
మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు.
మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు (Tirupati SP Subbarayudu) స్పందించారు. ఇవాళ(ఆదివారం) మీడియాతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వార్తలు అసత్యమని కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి తొక్కిసిలాట జరుగలేదని క్లారిటీ ఇచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
భక్తుల రద్దీని పూర్తిగా నియంత్రిస్తూ సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు నిజమైన సమాచారం కోసం పోలీస్ శాఖ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం నిత్యం కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రజల భద్రత – మా ప్రధాన లక్ష్యం’ అని ఉద్ఘాటించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడమహాలయ అమావాస్య – కపిలతీర్థం వద్ద పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు . ఈరోజు(ఆదివారం) మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయంలో తర్పణాలు వదిలే భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడానికి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించామని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాల కదలికలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని వివరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
వాహనాల పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ ఏర్పాట్లను పరిశీలించానని పేర్కొన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో హనుమకొండ రాంనగర్లో వారి నివాసంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును కలిసి కాశిబుగ్గ దసరా ఉత్సవాలకు ఐదు డివిజన్ల ప్రజలు కాశీబుగ్గ దసరాఉత్సవాలకు హాజరవుతారని, గ్రామీణప్రాంత ప్రజలు కూడా హాజరవుతారని ఉత్సవాలకు కావలసిన సదుపాయాలపై మున్సిపల్ సిబ్బందితో మైదానం క్లీనింగ్ చేయుట, లైటింగ్, సౌండ్ సిస్టం, స్టేజ్, ఆర్అండ్ బితో బారిగేట్స్, వాటర్ సప్లై, పోలీసు బందోబస్తు, కరెంటు సిబ్బంది, ఫైర్ సిబ్బంది, డిపిఆర్ ఓతో పలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దసరా ఉత్సవాలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని కొండా మురళీధర్ రావుకు మెమోరండం ఇవ్వడం జరిగినది.
కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ కాశిబుగ్గ దసరా ఉత్సవాలు కావలసిన సదుపాయాలన్నీ మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లు చేస్తారని తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ను అధికారులను కొండా మురళీధర్ రావు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్లపల్లి రాజ్ కుమార్, కన్వీనర్ బయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, గణిపాక సుధాకర్, సిలివేరు రాజు, గుజ్జుల రాకేష్ రెడ్డి, గణిపాక కిరణ్, గోరంట్ల మనోహర్, గుత్తికొండ నవీన్, గుర్రపు సత్యనారాయణ, మార్టిన్ లూథర్, సిద్ధోజు శ్రీనివాస్, రామ యాదగిరి, బిల్లాశివ, క్యాతం రంజిత్, బాలమోహన్, తొగరు వీరన్న, గణిపాక కిరణ్, దేవర ప్రసాద్, పెండ్యాలసోను, కోటసతీష్, చింతం రాజు, కాశీబుగ్గ దసరా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.