ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు…

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల 144 సెక్షన్ అమలు భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని భూపాలపల్లి ఎస్పీ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు.

భూపాలపల్లి జిల్లా పరిధిలోని మొత్తం 08 పరీక్ష కేంద్రాల్లో(భూపాలపల్లి 02, కాటారం 02, చిట్యాల 02, మహాదేవపూర్ 01, తాడిచర్ల 01) తేది 25-02-2026 నుండి 18-03-2026 వరకు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు.

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.

సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.

పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని ఎస్పీ ఆదేశించారు.
ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని ఎస్పీ హెచ్చరించారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు…

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో 163 బీఎన్ ఎస్ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉండగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. డీజేలు, మైకులు, బాణాసంచా వంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వరకు బీరు షాపులు బందు చేయాలి…

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వరకు బీరు షాపులు బందు చేయాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీరు మద్యం దుకాణాలు బందు చేయిoచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
2 విడత ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత ఐదు మండలాల పరిధిలో సాయంత్రం 5:00 గంటల గంటల వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని కోరారు ఆ తర్వాత ఎటువంటి బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. ఇతర ప్రాంతల వారు ఉంటే వెళ్లిపోవాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరారు పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలీస్ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

 

జూబ్లీహిల్స్ నియోజవర్గానికి రేపు ఎన్నిక జరుగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలనుు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు.
3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కాగా.. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో‌ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైన ఉప ఎన్నికలో గెలవాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి మరి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version