పని చేసే వారిని గెలిపించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి…

పని చేసే వారిని గెలిపించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

* అలియాబాద్ 7వ వార్డులో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

 

ప్రజల కోసం పనిచేసే పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 7వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తంటం నర్సింహా తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎల్లుబాయి, మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు నర్సింగరావు, కుమార్, సంజీవరెడ్డి, వెంకటరెడ్డి బాబు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌కు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థిని విప్లవ..

జాతీయస్థాయి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీలకు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విధ్యార్థిని విప్లవ కు మర్రి రాజశేఖరరెడ్డి ప్రశంసలు

మల్కాజిగిరి నేటిధాత్రి

 

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో మూడవ సంవత్సరం చదువుతూ జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) లో చురుకుగా పాల్గొంటున్న కోడూరి విప్లవ జాతీయ స్థాయిలో జరగబోయే ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికవడం తమ కళాశాలకు గర్వకారణమని కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ సెక్రెటరీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నాలుగు దశల్లో క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రజెంటేషన్, ఇంటర్వూ లాంటి పోటీల్లో పాల్గొన్న ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో తమ కళాశాలకు చెందిన కోడూరి విప్లవ జాతీయస్థాయికి ఎంపికవటం పట్ల మర్రి రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాలలో వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నామని, హ సస్టైనబిలిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో విప్లవ తన ఆలోచనలు పంచుకోనుండడం ఒక గొప్ప అవకాశమని తెలియజేస్తూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీరు విప్లవ మరియు ప్రోత్సహించిన తమ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ లను అభినందించారు.

ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఢిల్లీలోని భారత మండపంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీల్లో సస్టైనబులిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద మాట్లాడబోతున్న విప్లవ రాణించాలని ఆకాంక్షించారు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాసరావు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ విప్లవను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

 భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. ఉద్రిక్తత

 

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లా రెడ్డి (Malla Reddy), మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇక భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈరోజు (మంగళవారం) అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version