కేతకీ సంగమేశ్వర స్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ పి. ప్రవీణ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
శివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల పాటు నిర్వహించే ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర స్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి. ప్రవీణ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జాతరకు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలన్నారు.ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. జాతరకు వచ్చే మార్గాల్లో రోడ్ల రిపేర్పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఝరాసంగం
గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్ మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ మాజీ సర్పంచ్ జగన్ పటేల్ పాల్గొన్నారు.
