కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు సిరిసిల్ల జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ .గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం.ప్రవీణ్ .సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి.ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత.నలినికాంత్ గారి తో. ప్రచారంలో తంగళ్ళ పల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వాడవాడల గడపగడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలినీ కాంత్ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలనుదృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు .ఉంచుతున్నారని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిఅప్పుల పాలు చేస్తే దాన్ని అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువస్తూ అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాముని వనిత నలిని కాంత్.గార్లను మీ ఆశీర్వాదంతో అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థిస్తూ ఓటర్లనువేడుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్పుల స్వరూప తిరుపతిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళా పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ముగిసిన నామినేషన్ల పర్వం.

ముగిసిన నామినేషన్ల పర్వం

* 24 బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, జనవరి 30( ప్రజా జ్యోతి న్యూస్ )పట్టణ పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో 24 వార్డ్ బిజెపి అభ్యర్థి పాలెంకర్ పద్మ నామినేషన్ దాఖలు చేశారు. వారి వెనుక బిజెపి నాయకుడు పాలెంకర్ సంతోష్ కాలోని వాసులు పాల్గొన్నారు అని తెలియజేశారు. అనంతరం చివరి రోజు(శుక్రవారం) కావడంతో పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలు, బాజాభజంత్రీలతో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. అభ్యర్థుల మద్దతుదారులతో పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. పోలీసులు ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వ హించారు. అభ్యర్థి తోపాటు పాలిoకార్ మహేష్, చిరంజీవి, డప్పు విజయ్, సంతోష్ తదితరులు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడం తో పట్టణంలో ప్రచార పర్వం ఊపందు కోనుంది.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

◆:- తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా,హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి వారితో పాటు పుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహిం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి,కూన.శ్రీశైలం గౌడ్,ఆవుల రాజిరెడ్డి మరియు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version