ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత
ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మంజూరునగర్ లోని ఇల్లంద క్లబ్ లో జిల్లా యువజన క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే వారు మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. యువత వివిధ పోటీల్లో పాల్గొని జిల్లా ప్రతిభను ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత తమలోని ప్రతిభను ప్రదర్శించి కీర్తి పొందాలన్నారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు యువతులు చేసిన జానపద నృత్యాలు అలరింపజేశాయి. అనంతరం మాదక ద్రవ్యాల నివారణ, అవగాహనపై ఎంపీ, ఎమ్మెల్యే విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు
