వారసులే వ్యతిరేకులు… పరివారమే పగదారులు!

`దేశ రాజకీయాలలో కవిత తిరుగుబాటు మొదటిది కాదు.

`కాంగ్రెస్‌ లో మేనక రూపంలో మొదటి కుంపటి రగిలింది.

`అనేక రాష్ట్రాలలో కూడా కుటుంబాలలో చీలికలు వచ్చాయి.

`అన్ని కుటుంబాలు వేరు కెసిఆర్‌ కుటుంబం వేరు.

`అన్ని రాజకీయాలు వేరు.. కెసిఆర్‌ రాజకీయం వేరు.

`పదవి కోసం రాజకీయ పార్టీ పెడితే కేసీఆర్‌ రాజకీయం ఉండేది

కాదు.

`బీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం కల్వకుంట్ల కుటుంబం సొత్తు కాదు.

`పొత్తు కోసం కవిత పోరాటం లో అర్ధం లేదు.

`స్వార్ధం తప్ప ప్రజా ప్రయోజనం అసలే లేదు.

`శత్రువులు ఎక్కడో వుండరు అని మరోసారి కవిత రుజువు చేసింది.

`ఎన్టీఆర్‌ ది కుటుంబ పార్టీ.. తిరుగుబాటు జరిగింది.

`వైస్‌ కుటుంబం లోనూ పదవుల కుంపటి రగిలింది.

`కవిత కుంపటి తనకు తానే పొగ పెట్టుకునేలా చేసింది.

`ఆస్తులు కాదు, ఆత్మ గౌరవం అనే మాట అర్ధం లేనిది.

`పార్టీ కష్టాలలో వున్నప్పుడు తోడున్నవాళ్లు దెయ్యాలా?

`పార్టీ కష్టాలలో వున్నప్పుడు ముంచాలనుకునే వారు దెయ్యమా?

`కేసీఆర్‌ పాలన ను వేలెత్తి చూపిన వారు ఎవరూ లేరు?

`కన్న కూతురు ఎక్కడైనా తండ్రి కి ద్రోహం చేయడం చూశామా?

`కష్టాలలో పార్టీని పట్టుకొని కాపాడుతున్న వారే అసలు వారసులు?

`పార్టీ కి అసలైన సైనికులు… పదవుల కోసం ఆశపడే వాళ్ళు కాదు!

`గుంట నక్కలే పార్టీని చిన్నభిన్నం చేయాలని చూస్తారు!

`దొంగే దొంగా దొంగా అని అరుస్తారు?

`ఇంకా కవిత విషయం లో కెసిఆర్‌ కూతురు గానే చూస్తున్నారు!

`ఒకప్పుడు షర్మిల రాజకీయం చూసి కవిత చాలా నయం

అనుకున్నారు!

`ఇప్పుడు కవిత కన్నా షర్మిల లక్ష రేట్లు మెలనుకుంటున్నారు!

`రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మ హత్యలే వుంటాయని కవిత

మరోసారి నిరూపించింది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలలో హత్యలుండవు. ఆత్మహత్యలు మాత్రమే వుంటాయని రాజకీయ పండితులు ఏనాడో తేల్చేశారు. అతిగా ఆశపడే నాయకులు తమ రాజకీయ జీవితాలను తామే తుంచుకుంటారు. తమకు తాము అతిగా ఊహించుకుంటారు. తమకేం తక్కువ అనుకుంటారు. అందరికన్నా తామే ఎక్కువ అనుకుంటారు. తమకు ప్రాదాన్యత దక్కడం లేదన్న భావనలోకి వెళ్లపోతారు. తమకు ఆదిపత్యం కరువౌతుందని ఆలోచనల్లో ముగినిపోతుంటారు. దాంతో వారికి రాజకీయంగా ఎదురులేకున్నా తనను పట్టించుకోవడం లేదన్న భ్రమల్లోకి వెళ్లిపోతుంటారు. పార్టీలో ఏదైనా తనకు తెలియకుండా ఏదైనా నిర్ణయం జరిగితే చాలు నన్ను తొక్కిపెడుతున్నారని ఆందోళన చెందుతుంటారు. పైగా తనకు వున్న ఆశలు ఎవరో ఎగిరేసుకుపోవచ్చన్న భయంలో బతుకుతుంటారు. తను మాత్రమే పార్టీకి గొప్ప నమ్మకస్తుడిని అనుకుంటారు. ఇతరులు పార్టీ అదినేతల వద్ద చనువుగా వుంటే ఓర్చుకోలేరు. తనకు దక్కని ప్రాదాన్యం ఇతరులకు దక్కుతుంటే సహించలేరు. ఇవి సహజంగా సాధారనంగా అందరికీ వుండే అవలక్షణాలే..ఇదే కొంప ముంచుతాయి. ప్రతి ఇంట్లోనూ వుండేవే. కాని రాజకీయ నాయకుల కుటుంబాలలో వెంటనే బైటకు వస్తాయి. కుటుంబంలో చీలికలు తెస్తాయి. కుటుంబాన్ని వీదిన పడేస్తాయి. తనకు దక్కనిది వేరే ఇతరులకు కూడా దక్కొదన్నంత పట్టుదలను ప్రదిర్శించేలా చేస్తాయి. ఇలా రాజకీయాల్లో లేని పోని అపోహలతో జీవితాలు తలకిందులు చేసుకున్న వారిలో మాజీ ఎంపి. దేవనపల్లి కవితతే కాదు, చిరిత్రలో చాలా మంది వున్నాయి. అయితే అదికారంలో వున్నప్పుడు పార్టీలో వుండి, పదవులున్నీ అనుభవించి, పొందాల్సిన గౌరవాలన్నీ అందరికన్నా ఎక్కువగా పొందినా వారికి తృప్తి వుండదు. అధికారం చూసిన కళ్లతో ఖాళీగా వుండాలంటే మనసు నొప్పదు. అలా తమ రాజకీయ జీవితాలను తుంచుకున్న వారిలో ముందుగా మనకు కనిపించేది మేనకాగాంధీ. ఇందిరాగాందీ చిన్న కుమారడు సంజయ్‌ గాందీని పెళ్లి చేసుకున్నారు. సంజయ్‌గాందీ మరణానంతరం ఆమె కీలకం కావాలనుకున్నారు. అత్త ఇందిరాగాందీని వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీని గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఆఖరుకు ఇందిరాగాందీ కుటుంబానికి దూరమయ్యారు. ఏకండా రాష్ట్ర సంజయ్‌మంచ్‌ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె కూడా ఆ పార్టీ నుంచి గెలవలేకపోయింది. నిజానికి ఆమె ఆనాడు కొంత ఓపికతో వుంటే ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ ఆమె చేతుల్లో వుండేది. ఆమె ప్రదానమంత్రి అయ్యి వుండేది. కాని చేజేతులా తన రాజకీయ జీవితాన్ని కొంత నష్టం చేసుకున్నది. తన వారసుడు వరుణ్‌ గాందీకి కూడా గాందీ వారసత్వం లేకుండా చేసుకున్నది. ఆ మధ్య షర్మిల కూడా ఇదే తరహాలో తన అన్న మీద ఆరోపణలు గుప్పిస్తూ ఆయనకు దూరమైంది. ఆఖరుకు తనకు రాజకీయమే లేకుండా చేసుకున్నది. ఆ సమయంలో కల్వకుంట్ల కవిత కుటుంబ పరంగా షర్మిలకన్నా చాల బెటర్‌ అని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు కవిత కన్నా, షర్మిల వెయ్యి రెట్లు బెటర్‌ అనుకునే స్ధితిని కవిత కొని తెచ్చుకున్నారు. తన అన్న జగన్‌ కోసం షర్మిల సుమారు పది సంవత్సరాలు తన వ్యక్తి గత జీవితాన్ని కూడా వదిలేసుకున్నది. అన్నను రాజకీయంగా బలవంతుడిని చేసేందుకు అహర్నిషలు కృషి చేసింది. జగన్‌ జైలుకు వెళ్లడంతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఓదార్పు యాత్రను పూర్తి చేసింది. అన్నకు కొండంత అండగా నిలిచింది. అన్న కోసం ఏకంగా పాదయాత్ర కూడా చేసింది. కాని తన అన్న అదికారంలోకి వచ్చినా పదవి ఇవ్వకపోవడం తోపాటు, తనకు ప్రాదాన్యతనివ్వడం లేదన్న కోపంతో ఎదురుతిరిగింది. షర్మిల విషయంలో అన్న కోసం త్యాగం కనిపిస్తుంది. కాని కేటిఆర్‌ విషయంలో కవిత త్యాగం ఎక్కడా లేదు. అన్న ఎంతో తాను అంతే.. అన్న తనకంటే ఎక్కువేం కాదన్న దోరణి కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి కావాలన్న కలలు కనిపించాయి. అన్నను ముఖ్యమంత్రి చేస్తానని ఎక్కడా చెప్పలేదు. తానెందుకు ముఖ్యమంత్రి కావొద్దన్న ఆలోచనలు మాత్రమే చేసిందనేది అర్దమౌతోంది. అందుకే అన్నను సిఎం. కాకుండా కూడా అడ్డుకున్నట్లు కూడ కనిపిస్తోంది. అయితే కవిత ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. చాలా రాష్ట్రాలలో కుటుంబ రాజకీయ చీలికలువేరు. తెలంగాణలో కేసిఆర్‌ కుటుంబ రాజకీయం వేరు. అన్ని రాజకీయాలు వేరు..కేసిఆర్‌ రాజకీయంవేరు. అన్ని పార్టీలు వేరు. బిఆర్‌ఎస్‌ పార్టీ వేరు. బిఆర్‌ఎస్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేకమైన గుణాలున్నాయి. అవి ఏ ఇతర పార్టీలకు లేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్‌లో వున్న తెలుగుదేశం, వైఎస్‌ ఆర్సీపిలు వ్యక్తులుగా నిర్మాణం చేసుకున్న పార్టీలు. కాని బిఆర్‌ఎస్‌ వ్యక్తిగా కేసిఆర్‌ నిర్మాణం చేసుకున్న పార్టీ కాదు. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ చెప్పి, తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సమయంలో పార్టీ నిర్మాణం అప్పటికి జరగలేదు. ఎన్టీఆర్‌ ఎవరికి టికెట్‌ ఇస్తే వాళ్లు గెలిచారు. వాళ్లే పార్టీకి తర్వాత నాయకులయ్యారు. కాని బిఆర్‌ఎస్‌ అలా కాదు. బిఆర్‌ఎస్‌ తొలి తరంలో నాయకులను తయారు చేయలేదు. నాయకులంతా కలిసి బిఆర్‌ఎస్‌కు రూపకల్పన చేశారు. కేసిఆర్‌కు పూర్తి సహాకారమందించారు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్‌తో కలిసి నడిచారు. అందులో అప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా వున్నారు. అలా బలమైన నాయకులతో బిఆర్‌ఎస్‌ బలమైన పునాదులు వేసుకున్నది. తర్వాత కాలంలో ఉద్యమకారుల చేత తిరుగులేని శక్తిగా మారిపోయింది. ఆ సమయంలో బలంగా వున్న నాయకుడు దూరమౌతూ వచ్చారు. కొత్త నీరు నాయకులయ్యారు. అయినా బిఆర్‌ఎస్‌ అదికారంలోకి వచ్చాక కూడా చాలా మంది ఇతర పార్టీల నాయకులు చేరారు. పార్టీకి బలం పెంచారు. ఈ విషయం కవిత మర్చిపోయింది. పార్టీ నాదే అనేంత దైర్యం ఆమెకు వచ్చిందంటనే ఆమెకు పార్టీలో పట్టు, ప్రాధాన్యత ఎంతో వున్నట్లు లెక్క. ఒక దశలో గులాబీ జెండా నాది అని ఉద్యమకారుడిగా ఈటెల రాజేందర్‌ మాట్లాడితే ఆయనను పార్టీ నుంచి బైటకు పంపించారు. ఆ సమయంలో ఉద్యమకారుల ఆత్మగౌరవం కవితకు గుర్తుకు రాలేదు. పార్టీ నాది, మనందరిదీ అని నాయకులు అనుకోకలేకపోతే ఏ పార్టీ పది కాలాలపాటు బలంగా వుండదు. అందుకే ఉద్యమ కారుడిగా ఈటెల, పార్టీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఏదో ఆయాచితంగా అన్న మాటలు మాత్రమే. కాని అది ఆయన పార్టీనుంచి బైటకు వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. అప్పుడైనా కవిత తెలుసుకోవాల్సింది. పార్టీ మనందరదీ..అయినా అదినేత తన తండ్రి కావడం వల్ల తనకు ఎనలేని ప్రాదాన్యత దక్కుతుందని గుర్తించుకోలేకపోయింది. తాను పార్టీ కోసం ఎంతో చేశాను. తనను దూరం పెడుతున్నారని అనుకున్నది. నిజానికి ఎవరూ ఆమెను దూరం పెట్టలేదు. తనకు తానుగానే దూరమౌతూ వచ్చింది. తనకు ప్రాదాన్యత లేని పార్టీ వుంటే ఎంత? లేకుంటే ఎంత? అనుకున్నది. బిఆర్‌ఎస్‌లో తాను సిఎం. అయ్యే అవకాశం లేదన్నది ఆమె తెలుసుకున్నది. తనుకు సిఎం. పదవి దక్కని పార్టీ వుంటే ఎంత లేకుంటే ఎంత? అనుకొన్నట్లువుంది. తాను సిఎం. కాకపోయినా ఫరవాలేదు. కాని తన అన్న కాకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు వుంది. అందుకే అన్నకు పార్టీలో దక్కుతున్న ప్రాదాన్యత చూసి అసూయ చెందినట్లుంది. కేసిఆర్‌ చుట్టూ దెయ్యాలున్నారని మొదలు పెట్టింది. నిజానికి ఇప్పుడు పార్టీ అదికారంలో లేదు. ప్రతిపక్షంగా ఐదేళ్ల పాటు చేసేదేమీ లేదు. కేసిఆర్‌ చుట్టూ నాయకులు వుండడం వల్ల వారికి వచ్చే లాభమేమీ లేదు. పైగా ఇంత మంది నాయకులు కేసిఆర్‌ చుట్టూ వుంటే పార్టీకే బలం. పార్టీ అదికారంలో వున్నప్పుడు ఎలాగూ కేసిఆర్‌కు దగ్గ్ణర కాలేకపోయాం..ఇప్పుడైనా దగ్గరగా వుంటే భవిష్యత్తులో తమకు ప్రాదాన్యత వుంటుందన్న ఆలోచనతో కూడా నాయకులు వుండొచ్చు. అలా పార్టీకి, కేసిఆర్‌కు మనో ధైర్యంగా వున్న నాయకులను దెయ్యాలు, దొంగలు, గుంట నక్కలు అంటూ సంబోదించి తన గోతి తానే తవ్వుకున్నది. తన రాజకీయానికి తానే కుంపటి పెట్టుకున్నది. పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు అండగా నిలబడాల్సిన సమయంలో పార్టీ మీద అబాంఢాలు వేస్తూ, ఏకంగా కేసిఆర్‌ పాలననే తూర్పారపడుతూ, పదేళ్ల ఏం పీకారని కవిత మాట్లాడడం చాల తప్పు. అందుకే వారసురాలిని అని చెప్పుకోవాల్సిన కవిత, పగదారురాలై పార్టీకి దూరమైంది.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య….

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. గత రెండు రోజుల క్రితం వైద్యం వికటించి మృతి చెందిన మహమ్మద్ అమిద్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి మృతుడి కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడంతో పాటు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బుస రాజేశం. ఒగ్గు కుంటయ్య మరియు రాళ్లపేట గ్రామానికి చెందిన గౌరీ శంకర్ మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి మనం ధైర్యం కల్పించి. వారికి భరోసాను.ఇచ్చారు అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన అమీద్.కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా.ఆదుకోవాలని. ప్రభుత్వానికి తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని తదుపరి ఇట్టి విషయాలపై సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు చేకూర్చే దిశగా ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా కేటీ రామారావు కి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పరామర్శించిన వారిలో. మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. తంగళ్ళపల్లి ఉపసర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి. వార్డు మెంబర్ తాటికొండ చందు. సాయి. మైనార్టీ నాయకులు. చనిపోయిన బాధిత కుటుంబాల వారు తదితరులు పాల్గొన్నారు

 బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే..

 బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ.. చర్చించిన అంశాలివే

 

 

నందినగర్‌లోని నివాసంలో బీఆర్‌ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.

 బీఆర్‌ఎస్ నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ (Former CM KCR) ఈరోజు (మంగళవారం) సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్‌ (KTR), హరీష్ రావు (Harish Rao), పలువురు బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలన్నదే బీఆర్‌ఎస్ వ్యూహం.ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ విషయంలో గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మాత్రమే నిర్మించిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో అటు కృష్ణా, ఇటు గోదావరి రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వాటాలు పరిష్కరించామని ఆ పార్టీ చెప్పుకొస్తోంది.ఇదే విషయంపై కొద్దిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. వీటన్నింటికీ అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌ రావు, ఇతర నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?.. ప్రభుత్వం చెప్పే ప్రతీ అంశంపై సమాధానంతో సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల గడ్డపై ఎగిరింది గులాబీ జెండా..

సిరిసిల్ల గడ్డపై ఎగిరింది గులాబీ జెండా..

ప్రజాధనం ఎవరి అత్త సొమ్ము కాదు: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు

 

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ‘ఆత్మీయ సమ్మేళనం’లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను అభినందించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు సమరశంఖం పూరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని సిరిసిల్ల నియోజకవర్గంలోని 117 గ్రామ పంచాయతీలకు గాను 80 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాలు తిరిగినా, ప్రలోభాలకు గురిచేసినా క్షేత్రస్థాయిలో ప్రజలు కేసీఆర్ నాయకత్వం వైపే మొగ్గు చూపారని ఆయన వివరించారు. ముఖ్యంగా గంభీరావుపేట వంటి మండలాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్పంచులను బెదిరించడంపై స్పందిస్తూ, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అని, అది ఎవరి అత్త సొమ్ము కాదని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను ఆపే అధికారం ఏ ఎమ్మెల్యేకు గానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ లేదని స్పష్టం చేశారు. “ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వం, నిధులు ఆపేస్తాం” అని చిల్లర మాటలు మాట్లాడే వారిని ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.

గత పదేళ్లలో కేసీఆర్ ‘పల్లె ప్రగతి’ ద్వారా గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దారని, నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఈడీ బల్బులు మార్చే దిక్కు లేక పల్లెలు చీకటిమయమవుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాన్ని చూసి భయపడే రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టి, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట కోసం కార్యకర్తలంతా ఐకమత్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 117 పంచాయతీల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలను క్లస్టర్ల వారీగా సమీక్షించుకొని గెలుపు దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నాయకులకు సూచించారు. గెలిచిన ప్రజాప్రతినిధులకు సంక్రాంతి తర్వాత వారి హక్కులు, బాధ్యతలపై ప్రత్యేక శిక్షణ (Workshops) ఏర్పాటు చేస్తామని, పార్టీ వారికి కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు మరియు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వాళ్లే టార్గెట్‌గా మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు…

వాళ్లే టార్గెట్‌గా మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు

 

ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్‌ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు.

మాజీ మంత్రి హరీష్ రావు, బీఎర్ఎస్ టార్గెట్‌గా జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావుతో హరీష్, బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలు తన దృష్టికి వస్తున్నాయని… అసలు కథ ముందుంది అంటూ కామెంట్స్ చేశారు. ‘నేను మంచి దాన్ని కాదు. కాళ్ళు విరగొడతాను’ అంటూ హెచ్చరించారు. అధికారంలో ఉన్న పదేళ్లలో తాను, తన భర్త ఒక్క పని అయినా అడిగామా అని ప్రశ్నించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. బీఆర్ఎస్‌లో 10 ఏళ్లలో ఒక్క రూపాయి సంపాదించలేదని స్పష్టం చేశారు.
హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్‌ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు. ఉద్యమంలో ఎవరు ఏమి చేశారనేది తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని వార్నింగ్ ఇచ్చారు. తనను పార్టీ నుంచి పంపించారని.. అయినా వాళ్ల కళ్ళు చల్లబడలేదా అని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిచిందని.. కాంగ్రెస్ డోర్స్ ఓపెన్ చేసిందన్నారు. తనపై ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా జవాబు చెబుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో చాలా తప్పిదాలు జరిగాయని… అవి తన దృష్టికి వస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేశారనే.. రేవంత్ అధికారంలోకి వచ్చారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లావాదేవీలకు, కాంగ్రెస్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. ‘నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా. హరీష్ రావు.. విజ్ఞత అని తప్పించుకుంటున్నారు. లైన్‌లు నేను దాట లేదు. నేను ఇంకా ఊరుకోను ’ అంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు.

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

– ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా

– ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్ల తో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించామని కార్మికుల పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. అధికారంలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని వారి వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడుతామన్నారు.
కేసీఆర్‌ను మరోసారి గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నరని ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సిరిసిల్ల బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,
ఆటో యూనియన్ అధ్యక్షులు అల్లే శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ చైర్మన్ చిక్కాల రామారావు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు

కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T114529.069.wav?_=1

 

కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విజయ దివాస్ డిసెంబర్ 9 సందర్భంగా , బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ & మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు ఆదేశాల మేరకు కొనింటి మాణిక్ రావు , తెలంగాణ తల్లికి పాలాభిషేకం & డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కె.సి.ఆర్ సచ్చోడో తెలంగాణ వచ్చాడో అంటూ నవంబర్29నుండి డిసెంబర్ 9 వరకు చేసిన ఆమరణ దీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిందని కె.సి.ఆర్ రణబేరీ,ఆత్మార్పణకు సంకల్పించిన రోజు కాబట్టి డిసెంబర్9నీ విజయ దివాస్ గా జరుపుకుంటున్నామని అన్నారు.

డిసెంబర్9తర్వాత ఎన్నో ఒడిదొడుకులు,నిర్బంధాలు ఎదుర్కొని కె.సి.ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.
దేశ చిత్రపటంలో మాయమైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కె.సి.ఆర్ గారిది అని అన్నారు. కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిన రాష్టం నేడు తిరోగమన దశలో ఉందని ఇది భావితరాలకు ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో సుపరిపాలన కావాలంటే మళ్ళీ కె. సి.ఆర్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, మాజి హజ్ కమిటీ సభ్యులు యూసఫ్ సాబ్,యువ నాయకులు మిథున్ రాజ్,గణేష్, వెంకటేశం,చంద్రయ్య,నరసింహ రెడ్డి,నాగన్న పటేల్,ఇబ్రహీం,లక్ష్మీకాంత్, అలి, జుబేర్,జాఫర్,జాకీర్, అమెర్, బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, సాజిద్,రఘు తేజ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T113712.199.wav?_=2

 

కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల విజయ దివాస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విజయ దివాస్ డిసెంబర్ 9 సందర్భంగా , బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ & మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు ఆదేశాల మేరకు కొనింటి మాణిక్ రావు , తెలంగాణ తల్లికి పాలాభిషేకం & డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కె.సి.ఆర్ సచ్చోడో తెలంగాణ వచ్చాడో అంటూ నవంబర్29నుండి డిసెంబర్ 9 వరకు చేసిన ఆమరణ దీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిందని కె.సి.ఆర్ రణబేరీ,ఆత్మార్పణకు సంకల్పించిన రోజు కాబట్టి డిసెంబర్9నీ విజయ దివాస్ గా జరుపుకుంటున్నామని అన్నారు.
డిసెంబర్9తర్వాత ఎన్నో ఒడిదొడుకులు,నిర్బంధాలు ఎదుర్కొని కె.సి.ఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.
దేశ చిత్రపటంలో మాయమైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కె.సి.ఆర్ గారిది అని అన్నారు. కె.సి.ఆర్ ఆమరణ దీక్ష,అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిన రాష్టం నేడు తిరోగమన దశలో ఉందని ఇది భావితరాలకు ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో సుపరిపాలన కావాలంటే మళ్ళీ కె. సి.ఆర్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, మాజి హజ్ కమిటీ సభ్యులు యూసఫ్ సాబ్,యువ నాయకులు మిథున్ రాజ్,గణేష్, వెంకటేశం,చంద్రయ్య,నరసింహ రెడ్డి,నాగన్న పటేల్,ఇబ్రహీం,లక్ష్మీకాంత్, అలి, జుబేర్,జాఫర్,జాకీర్, అమెర్, బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, సాజిద్,రఘు తేజ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేటీ రామారావుచిత్రపటానికి పాలాభిషేకం….

ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేటీ రామారావుచిత్రపటానికి పాలాభిషేకం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీ రామారావు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ అధ్యక్షులు జిల్లా యూనియన్ గౌరవ అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొ ల్లి రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ. గత ప్రభుత్వం ఆయాంలో .ఆటో డ్రైవర్లుఅందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవనం సాగించారని. ఇప్పుడున్న సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆటో డ్రైవర్ లు జీవనోపాధి మీద చాలా భారం పడిందని. మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న సంవత్సరానికి. మీ మాట ప్రకారం అటు డ్రైవర్లఅకౌంట్లో డబ్బులు వేస్తామని ఆటో డ్రైవర్లకు మాయమాటలు చెప్పి తప్పించుకుని తిరుగుతున్నారని పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తున్నారని. అందుకు అనుగుణంగా వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పై .దయ తలచి మీరు ఇచ్చిన మాట ప్రకారం వారి అకౌంట్లో డబ్బులు వేయాలని. ప్రభుత్వపరంగా జీవిత బీమా 10 లక్షలకు విధంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎందరో నిరుపేద కార్మికులు ఆటో డ్రైవర్ గా జీవిస్తున్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారి బాగోబాగులు. చూసుకోవాలని. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పించడం మంచిదే అయిన దానికి వ్యతిరేకం మేము కాదు అని. దీనివలన ఆటో జీవన ఉపాధి పై. భారం పడుతుందని దయచేసి ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి వారి జీవితాలలో వెలుగు నింపాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి పాలాభిషేక. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ శాఖ నాయకులు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్. నులిగొండ శ్రీనివాస్. ఆటో యూనియన్ అధ్యక్షులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్>…

జూబ్లీహిల్స్ బైపోల్.. రంగంలోకి గులాబీ బాస్

 

జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

 జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubilee Hills Bypoll) బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) దృష్టిసారించారు. గులాబీ పార్టీ ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇంచార్జ్‌లకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రేపు (గురువారం) ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉప‌ఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీఆర్‌ఎస్. అయితే జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా.. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది బీఆర్‌ఎస్ పార్టీ. అందుకు తగ్గ ప్రణాళిలను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడిక్కడ ర్యాలీలో, సభలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొని బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికల్లో గెలుపు తమదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. బైపోల్‌లో విజయం తమనే వరిస్తుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ మూడు పార్టీల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టంకట్టనున్నారో చూడాలి మరి.

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ…

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో బాకీ కార్డులను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడి ఏరియాలో ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపుతో మునిసిపాలిటీలోని గద్దె రాగడిలో బాకీ కార్డులను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇంటింటికి పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అలుగుల సత్తయ్య, కుర్మ గురువయ్య దేవి సాయి కృష్ణ, కుర్మ దినేష్, బండారు రవీందర్, శివ, అలుగుల అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మెజారిటీ కోసమే ప్రచారం…”ఎంపీ వద్దిరాజు రవిచంద్ర”

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T131035.665.wav?_=3

 

ఎంపీ వద్దిరాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాలినడకన ఎన్నికల ప్రచారం

(నేటిధాత్రి)

 

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాలినడకన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎంపీ రవిచంద్ర కు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావు యూసఫ్ గూడ డివిజన్ బాధ్యతలను అప్పగించారు.

 

ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.శివమ్మ పాపిరెడ్డి హిల్స్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ సభకు ఎంపీ రవిచంద్ర నాయకత్వాన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

ఎంపీ రవిచంద్ర మంగళవారం ఉదయం యూసఫ్ గూడ డివిజన్ ప్రగతినగర్ నందు కొలువైన వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాలినడకన ఎన్నికల ప్రచారం జరిపారు. ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ సీనియర్

 

నాయకులు పుస్తె శ్రీకాంత్,ఆశీస్ కుమార్ యాదవ్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్,కోట్ల వినోద్ కుమార్,మంజుల, భాగ్యలక్ష్మీ,విమల తదితరులు తన వెంట రాగా గులాబీ కండువాలు మెడలో వేసుకుని ప్రగతినగర్, లక్ష్మీనరసింహా నగర్,యూసఫ్ గూడ చెక్ పోస్ట్ తదితర చోట్ల పలు వీధుల్లో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు,ప్రజలకు రావలసిన బకాయిలను వివరిస్తూ కార్డులు పంపిణీ చేశారు.గృహిణులు, వ్యాపారస్తులు, మైనారిటీలు, యువకులు, మెకానిక్స్,వృద్ధులను ఎంపీ రవిచంద్ర తదితర నాయకులు కలిసి సర్కారు వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”కారు గుర్తుకే మన ఓటు”,”బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మకే మన ఓటు అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.

 

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి…

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు.
మా(కాంగ్రెస్) పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పిన అనిరుధ్ రెడ్డి.. ‘మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన.. నిరంకుశత్వ పాలన. మీది రౌడీయిజం పాలన. అది చూడలేకనే ప్రజలు మిమ్మల్ని.. మీ పార్టీని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.తాను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నానని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని, ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలని అనిరుధ్ రెడ్డి.. కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి…

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్‌ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్…

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

https://youtu.be/n8XtHC_g77I?si=37zwAlH0YSjCUecg

వారం రోజులుగా కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప..

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వారం రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో.. కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమచారం.

మరోవైపు, పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. వీటితోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ‌నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 13న‌ గద్వాల్ నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారు. దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

‘‘కేసీఆర్‌’’ సంతోషంలో కనిపించేది ‘‘సంతోషే’’!


`‘‘కేసీఆర్‌’’ ఆరోగ్యానికి ఔషదం ‘‘సంతోషే’’!

`చెదిరిపోని చిరునవ్వుతో ‘‘కేసిఆర్‌’’ ఆనందానికి కారణం ‘‘సంతోషే’’!

`పాతిక సంవత్సరాలకు పైగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేస్తున్నాడు.

BRS MP SANTOSH RAO

`అనుక్షణం ఆసరాగా వుంటున్నాడు.

`కుడి భుజమై కాపాడుకుంటున్నాడు.

`సహాయకుడుగా నిరంతర సేవలందిస్తున్నాడు.

`నిరంతరం ‘‘కేసీఆర్‌’’ వెన్నంటే వుంటాడు.

BRS MP SANTOSH RAO

`ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ‘‘సంతోష్‌’’ కనిపిస్తారు.

`కన్న తండ్రికి మించి సపర్యలు చేస్తూ వుంటాడు.

`సంతోషమైనా, ఆపదైనా ‘‘కేసీఆర్‌’’ వెనకాలే వుంటాడు.

`ఆసుపత్రిలో వున్నా కన్నపిల్లలకన్నా ఎక్కువగా ‘‘కేసీఆర్‌’’ను చూసుకుంటాడు.

`అలాంటి ‘‘సంతోష్‌’’ సేవలను శంకించడం తగదు.

`అనుక్షణం ‘‘కేసీఆర్‌’’ తన వద్ద ‘‘సంతోషే’’ వుండాలని కోరుకుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్ర లేవక ముందే అక్కడుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్రపోయిన తర్వాత ఇంటికెళ్తాడు.

`‘‘కేసీఆర్‌’’ ను దైవం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు.

`జీతం కోసం పని చేసే వారు జీవితం త్యాగం చేయరు.

`తన వ్యక్తిగత జీవితమంతా ‘‘కేసీఆర్‌’’ కోసం త్యాగం చేస్తున్నాడు.

`ప్రతి వ్యక్తికి కుటుంబం వుంటుంది.

`జీవితంలో ప్రతి వ్యక్తి రాణించాలనే అనుకుంటాడు.

`ఆస్థులు, అంతస్తులు కోరుకోని వారుండరు.

`‘‘సంతోష్‌’’ స్థానంలో ఎవరూ ఒక్క రోజు కూడా వుండలేరు.

`‘‘సంతోష్‌’’ లాగా ‘‘కేసీఆర్‌’’ ను కంటికి రెప్పలా ఎవరూ చూసుకోలేరు.

`కన్న పిల్లల కన్నా ‘‘సంతోష్‌’’ ను ‘‘కేసీఆర్‌’’ చూసుకోవడానికి కారణం అదే.

`అయినా రాజకీయ వారసత్వం ‘‘కేటీఆర్‌’’ దే.

`కూతురుగా కుటుంబంలో కీలక స్థానం ‘‘కవిత’’దే.

`ఎంతగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేసినా ‘‘సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే’’!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

జోగిన పల్లి సంతోష్‌రావు. ఈ పేరు పన్నెండేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ కీలక ఉద్యమకారులకు, బిఆర్‌ఎస్‌ నాయకులకు, మీడియాలో కూడా కీలకమైన జర్నలిస్టులకు తప్ప పేరు తెలియని నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ సిఎం. అయ్యాక సంతోష్‌ పేరు నిత్యం వినిపిస్తూ వచ్చింది. సంతోష్‌ గురించి కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో చాలా మందికి పరిచయం అయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ దీక్ష చేస్తున్న సమయంలో సంతోష్‌ ఏమిటో? ఆయనకు పార్టీలో వున్న ప్రాదాన్యత ఏమిటో? ఆయన ఎవరో? ఆయనకు కేసిఆర్‌ కు వున్న బంధుత్వం గురించి తెలంగాణ ఉద్యమకారులకు తెలిసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసిఆర్‌ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కేసిఆర్‌ వెనుకే నిలబడిన వ్యక్తి సంతోష్‌ అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతోద్యోగులు సంతోష్‌ గురించి చర్చించుకోవడం అందరం విన్నదే. ఎప్పుడైతే సంతోష్‌ రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా ఆయనెవరో పూర్తిగా తెలిసింది. అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌, కేసిఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్‌రావుల తర్వాత నాలుగో వ్యక్తిగా రాజకీయాల్లో సంతోష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో సంతోష్‌ పేరే రాజకీయ, ఉద్యోగ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అంతలా సంతోష్‌ గొప్పదనమేముంది? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. బిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు సంతోష్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజ్యసభకు ఎంపిక చేశారు. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అసలు సంతోష్‌కు రాజకీయాలకు ఏం సంబంధం అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు కేసిఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్‌ గురించి చెప్పడం జరిగింది. సంతోష్‌ కూడా ఆదినుంచి ఉద్యమంలోనే వున్నారనే విషయం వెల్లడిరచారు. అంతే కాకుండా ఉద్యమ నాయకుడుగా తనను కాపాడుకునే బాద్యత తీసుకున్నాడు కేసిఆర్‌ చెప్పారు. కేసిఆర్‌ను తెలంగాణ ఉద్యమం మొదలై, 2004 ఎన్నికల సమయం నుంచి సంతోష్‌ డిల్లీలో కేసిఆర్‌కు తోడుగా వుండడం మొదలు పెట్టారు. తెలంగాణలో హరీష్‌రావు, డిల్లీలో కేసిఆర్‌ వున్నప్పుడు సంతోష్‌ చూసుకుంటూ వచ్చారు. ఇలా ఇరవై ఐదు సంతవ్సరాలుగా కేసిఆర్‌ యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌ ఎప్పుడు ఎవరిని కలవాలి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి. కేసిఆర్‌ ఎప్పుడు ఏం తినాలి. మందులు వేసుకోవాలి. అని ప్రతిపతి క్షణం కనిపెట్టుకుంటూ, కేసిఆర్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కేసిఆర్‌ తనకు ఎప్పుడు ఏ మందులు కావాలో, ఇవ్వాలో చూసుకుంటాడు. అని చెప్పినప్పటినుంచి ప్రతిపక్షాలు సంతోష్‌ను అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ వచ్చారు. వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. అయితే బిఆర్‌ఎస్‌ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్‌ మీద కుట్రలు చేసిన వారు కూడా చాల మంది వున్నారు. కవిత లాంటి వారు కూడా తమకు కేసిఆర్‌ అప్పాయింటు మెంటు ఇవ్వకుండా సంతోష్‌ను అడ్డుకుంటున్నాడంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా అనేక విమర్శలు కూడా సంతోష్‌ ఎదుర్కొన్నారు. కేసిఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే సంతోష్‌ ఇక్కడ ఆస్ధులు సంపాదించాడు. అక్కడ ఆస్ధులు కొనుగోలు చేశాడంటూ కూడా అనేక వర్తాలు వచ్చేవి. వాటిని ఎవరు లీక్‌ చేసేవారో ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే కవిత నేరుగా సంతోష్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతోంది. సంతోష్‌ను వేలెత్తి చూపిస్తోంది. కాని తన తండ్రి ఇప్పటికీ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండడానికి కారణం సంతోష్‌ అని తెలియదా? సంతోషంగా వున్నప్పుడు ఎవరి గురించి తెలియదు. కాని బాదల్లో వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్న పదేళ్లకాలంలో సంతోష్‌ రావు తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లినట్లు గాని, కుటుంబంతో కలిసి ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినట్లు గాని ఒక్క ఫోటో బైటకు రాలేదు. కాని కవిత కుటుంబం గురించి అనేక వార్తలు వచ్చాయి. కేసిఆర్‌ సిఎం. అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రిలో కనిపించే ఏకైక నాయకుడు సంతోష్‌. కేసిఆర్‌ ఎన్ని రోజులు ఆసుపత్రిలో వుంటే అన్ని రోజులు కూడా ఆసుపత్రిలోనే వుంటూ ప్రతి క్షణం కాపాడుకునే నాయకుడు సంతోష్‌. ఈ మధ్య అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కేసిఆర్‌ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటున్న ఏకైక వ్యక్తి సంతోష్‌. తన తండ్రి కేసిఆర్‌ను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా కేటిఆర్‌, కవితలు కూడా చూసుకునేవారు కాదు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం వుంటుంది. పుట్టిందే జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి, కాని సంతోష్‌ లాంటి వ్యక్తికి అన్నీ కళ్లముందు వున్నా అనుభవించలేని జీవితాన్ని గడుపుతున్నాడని ఎంత మందికి తెలుసు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులైనా సరే ఒక్క రోజు ఆసుపత్రిలో వుంటే చూసుకోవాలంటే చిరాకు పడిపోతాము. అలాంటిది ఒక కేసిఆర్‌ను పట్టుకొని పాతిక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంతోష్‌పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇది కవిత గమనించాలి. సంతోష్‌ను విమర్శించి కవిత తప్పు చేసిందని బిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. కుటుంబ సమస్యను కవిత బజారున పడేయడమే కాకుండా కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ను విమర్శిండం సరైంది కాదంటున్నారు. అంటే కేసిఆర్‌ సంతోషంగా వుండడం కవితకు ఇష్టం లేదా? కేసిఆర్‌కు సంతోష్‌ను దూరుం చేస్తారు? సరే..మరి కేసిఆర్‌ను సంతోష్‌లగా చూసుకునే వ్యక్తిని తేగలరా? రాజకీయాలు వదిలేసి కవిత తండ్రి కేసిఆర్‌ను చూసుకోగలరా? ఇవి ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. కేసిఆర్‌ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న సంతోషే అసలైన ఔషదం అని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. రోజూ ఎంత పని ఒత్తిడిలో వున్న చెరగని చిరునవ్వుతో కనిపించే సంతోష్‌ వల్లనే కేసిఆర్‌ ఆర్యోగంగా ఆనందంగా వుండగలుగుతున్నాడని అంటుంటారు. దేవుడికైనా గుడిలో సేవ చేసే పూజారి కూడ కొంత సమయమే వెచ్చిస్తాడు. కాని కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ ఇరవైనాలుగు గంటుల కేసిఆర్‌ వెంటే వుంటారు. కేసిఆర్‌ వెన్నంటే వుంటారు. కేసిఆర్‌ కోసం జీవితమే త్యాగం చేశారు. తనను కన్న తండ్రిలా చూసుకున్న సంతోష్‌ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా కేసిఆర్‌ చూసుకుంటూ వస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కంటేనే అమ్మ అని అంటే ఎలా? అన్నట్లు కేసిఆర్‌ను ఎంతో ప్రేమతో సేవలు చేస్తున్న సంతోష్‌ అంటే కూడా కేసిఆర్‌కు అంత ప్రేమ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవితం వుంటుంది. కుటుంబం వుంటుంది. కాని సంతోష్‌కు జీవితం, కుటుంబం కూడా కేసిఆరే అయ్యారు. కేసిఆర్‌ను దేవుడిగా కొలుస్తూ సేవలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రకంగా రాణించాలనే వుంటుంది. ఎక్కడో జీవితం ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఆస్ధులు, అంతస్ధులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కాని కేసిఆర్‌కు సేవ చేయడమే తన జీవితానికి గొప్ప అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయినా సంతోష్‌ ఎప్పుడూ కేసిఆర్‌కు రాజకీయ వారసుడు కాదు. కుటుంబంలో కవిత కన్నా కీలకమైన స్దానం కూడా కాదు. కేసిఆర్‌కుఎంతసేవ చేసినా సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే తప్ప, వారసుడు కాలేడు. ఈ సత్యం సంతోష్‌కు తెలియంది కాదు. కవితకుతెలియంది కాదు. అయినా సంతోష్‌ను వేలెత్తి చూపి ఆయన మనసు గాయపర్చడం అంటే కేసిఆర్‌ మనసు కష్టపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కవిత ఈ సంగతి తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏది ఏమైనా సంతోష్‌ లాగా కేసిఆర్‌కు సేవలు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత ఓపిక వున్న వారు ఎవరూ వుండరు. ఈ విషయంలో సంతోష్‌ ఈస్‌ గ్రేట్‌ అని అందరూ అనాల్సిందే.

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=4

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్

 

మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హైదరాబాద్, ఆగస్టు 24: 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు సైతం ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది. అయితే మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకొంటుంది.

అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటిలోకి చేరారు. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది.

దీంతో ఆ యా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం.. అంటే ఆగస్టు 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కేడర్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జ్‌ను కేటీఆర్ ప్రకటించనున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరికేపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ నియోకవర్గాల కేడర్‌తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆదేశించినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-9.wav?_=5

“రామంతపూర్ విషాదం: కేటీఆర్, కవిత ఆవేదన”

హైదరాబాద్‌ ఉప్పల్‌ రామంతపూర్‌ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో రథానికి విద్యుత్‌ తీగలు తగలడంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా: KTR

మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా: KTR

TG: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తుండటంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘KCR హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాం. నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఈ లిస్టులో చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version