రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు పరిశీలన…

రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు పరిశీలన…

పుర కమిషనర్ గద్దె రాజు, సిఐ శశిధర్ రెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించి సదుపాయాలను పరిశీలించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డిలు అన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22 వార్డులు 45 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి 700 నుండి 800 మంది ఓటర్లు ఉన్నారని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం జరిగిందని తెలిపారు.

ఎక్కడైతే సౌకర్యాలు సరిగా లేవో ఆ పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తామని సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ లు స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీలించిన కలెక్టర్..

పోలింగ్ కేంద్రాల సరళిని పరిశీలించిన కలెక్టర్

సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:

 

గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం
గీసుకొండ మండలంలోని గీసుకొండ, గంగాదేవిపల్లి పోలింగ్ కేంద్రాలు,దుగ్గొండి మండలంలోని వెంకటాపూర్, దేశాయిపల్లి పోలింగ్ కేంద్రాలు, నల్లబెల్లి మండలంలోని
నల్లబెల్లి సుమంగళి ఫంక్షన్ హాల్, నందిగామ పోలింగ్ కేంద్రాలు,సంగెం మండలం సంగెం జడ్పీ హై స్కూల్, మొండ్రాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరిత ( గ్రీన్) పోలింగ్ కేంద్రాలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలలో ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సిబ్బంది డ్యూటీల అమలు, పోలింగ్ సాగుతున్న విధానం, భద్రతా చర్యలు వంటి అంశాలను వివరంగా పరిశీలించారు.

సమర్థవంతమైన పోలింగ్ నిర్వహణకు సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఏ విధమైన నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన, అంతరాయం లేని వాతావరణం కల్పించడం సిబ్బందిపైనున్న ప్రధాన బాధ్యతఅని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల ఖచ్చితమైన అమలు అత్యంత ఔచిత్యం కలదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఎన్నికల సూచనల మేరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి మండలానికి రెండు చొప్పున హరిత (గ్రీన్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటి విడత లో హరిత పోలింగ్ కేంద్రాలలో మిగతా పోలింగ్ కేంద్రాల కంటే 2 నుండి 3 శాతం పోలింగ్ పెరిగిందని కలెక్టర్ తెలిపారు.
రెండవ విడతలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని, 82 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎప్పటికపుడు కలెక్టరేట్ లో
ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుండి కౌటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా వార్డుల కౌంటింగ్ , తర్వాత గ్రామపంచాయతీ లో సర్పంచ్ కౌంటింగ్ జరుగుతుందని వారన్నారు
మేజర్ గ్రామపంచాయతీలలో త్వరగా ఫలితాలు వచ్చేలా ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్వోలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.మొదటి విడతలో 585 వార్డ్ స్థానాలుండగా,ప్రస్తుతం రెండవ విడతలో 906 వార్డు స్థానాలను ఉన్నాయని, కౌంటింగ్ ఫలితాలు త్వరితంగా ఇచ్చుటకు
ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మరియు కౌంటింగ్ జరుగుటకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు.కలక్టర్ వెంట ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓ సుమా, నోడల్ అధికారులు, ఎంపిడీవోలు, తహశీల్దార్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version